తెలంగాణలో 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూలు విడుదలైంది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్ , నిజామాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి ఒక్కో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అవనుంది. అలాగే కరీంనగర్ , మహబూబ్నగర్, రంగారెడ్డి నుంచి రెండేసి ఎమ్మెల్సీ స్థానాలు త్వరలో ఖాళీ అవనున్నాయి.
వీటన్నింటికీ కలిపి నవంబర్ 16న నోటిఫికేషన్ విడుదలవనుంది. అలాగే ఈ ఎన్నికల కోసం నామినేషన్లను నవంబర్ 23 వరకూ స్వీకరిస్తారు. నవంబర్ 24న నామినేషన్ల పరిశీలనఉంటుంది.
నవంబర్ 26 వరకూ నామినేషనలను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఈ స్థానాలన్నింటికీ డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహిస్తారు. డిసెంబర్ 14న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల సంఘం పేర్కొంది.