TimeLine Layout

November, 2021

  • 9 November

    రవిశాస్త్రి BCCI కి ప్రత్యేక ధన్యవాదాలు

    టీమిండియా కోచ్ జట్టు విజయాల కోసం చేయాల్సినదంతా చేశానని రవిశాస్త్రి తెలిపాడు. భారత క్రికెట్ జట్టుకు సేవలందించే అవకాశం కల్పించిన బీసీసీఐకి ఆయన ధన్యవాదాలు తెలిపాడు. తనపై నమ్మకంతో కోచ్ బాధ్యతలు అప్పగించిన మాజీ ప్రెసిడెంట్ శ్రీనివాసను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. కాగా 2014లో ఇంగ్లాండ్ టూర్లో టీమిండియా 1-3 తేడాతో ఘోర పరాజయంతో విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో తనను శ్రీనివాసన్ కోచ్ గా నియమించారన్నాడు.

    Read More »
  • 9 November

    చైనాలో కరోనా మళ్లీ పంజా

    రష్యా, జర్మనీతోపాటు చైనాలో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ముఖ్యంగా చైనాలోని అత్యధిక రాష్ట్రాల్లో వందలమంది కరోనాబారిన పడ్డారు. ఇక తొలికేసు వెలుగుచూసిన వుహాన్ నగరంలో గతంలో కంటే ఇప్పుడే అధిక కేసులు నమోదవుతున్నాయి. దీంతో చైనా ప్రభుత్వం కొవిడ్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తోంది. ఎక్కడికక్కడ పరీక్షలు నిర్వహించి, చికిత్స అందిస్తోంది. మరోవైపు రష్యాలో నిత్యం 1,100కు పైగా మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది.

    Read More »
  • 9 November

    దేశంలో కొత్తగా 10,126 కరోనా కేసులు

    దేశంలో గడచిన 24 గంటల్లో  10,126 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 3,43,77,113కు చేరింది. తాజాగా 332 మంది వైరస్లో మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 4,61,389గా ఉంది. ఇక కొత్తగా 11,982 మంది మహమ్మారి నుంచి బయటపడగా.. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,37,75,086గా ఉంది. ప్రస్తుతం దేశంలో 1,40,638 యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు ఇప్పటివరకు 109,08,16,356 వ్యాక్సిన్ డోసులు …

    Read More »
  • 9 November

    TSలో 1,130 గెస్ట్ లెక్చరర్ల ఖాళీలు భర్తీ

    తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకుల కొరత తీర్చేందుకు 1,130 గెస్ట్ లెక్చరర్ల ఖాళీలను భర్తీ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నియామకాల్లో నెట్, పీహెచ్ అభ్యర్థులకు తొలి ప్రాధాన్యం దక్కనుండగా, తర్వాతి ప్రాధాన్యం పీజీ పూర్తి చేసిన వారికి ఉంటుంది. అయితే ఈ పోస్టులకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడతాయని విద్యాశాఖ పేర్కొంది.

    Read More »
  • 9 November

    రాఘవ లారెన్స్ గొప్ప ఔదార్యం

    సూర్య హీరోగా నటించి తానే నిర్మాతగా జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుని ఘన విజయం సాధించిన చిత్రం జైభీమ్.. ఈ చిత్రంలోని సినతల్లి పాత్రదారి అయిన రియల్ లైఫ్ సినతల్లికి ఇల్లు కట్టిస్తానని నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ప్రకటించాడు. చేయని నేరానికి చిత్రహింసలకు గురై మృతి చెందిన రాజకన్ను కుటుంబాన్ని ఆదుకుంటానన్నాడు. 28 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటన ఆధారంగానే ‘జై భీమ్’ చిత్రం రూపొందింది. తాజాగా ఈ …

    Read More »
  • 9 November

    కాజల్ తల్లి కాబోతుందా..?

    టాలీవుడ్ ముద్దుగుమ్మ..ముదురు అందాల రాక్షసి అయిన చందమామ కాజల్ అగర్వాల్ తాను ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలపై తొలిసారి స్పందించింది. ‘నా ప్రెగ్నెన్సీ గురించి సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెప్తాను. అమ్మతనం అనేది ఎంతో గొప్ప విషయం. దాని గురించి ఎంతో ఎగ్జిట్మెంట్, నర్వస్ ఫీల్ అవుతున్నా. నాకు పిల్లలు పుడితే ఎలా ఉంటుందనే భావన మరింత ఎమోషనల్కు గురి చేస్తోంది’ అని చెప్పుకొచ్చింది. గౌతమ్ కిచ్లూను కాజల్ గతేడాది …

    Read More »
  • 9 November

    ఒకటే నిమిషంలో సీఎం ప‌ద‌వికి రాజీనామా చేస్తా- సీఎం కేసీఆర్

    బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ బిల్లు పాసైన‌ప్పుడు కేసీఆర్ ఓటేయ‌లేదు అని బండి సంజయ్ అంటున్నాడు.ఆయ‌న మాట‌లు వింటుంటే ఏం చేయాలో అర్థం కావ‌డం లేదు. తెలంగాణ ఉద్య‌మంలో నువ్వెక్క‌డ‌. నువ్వు ఎవ్వ‌నికి తెలుసు ఈ రాష్ట్రంలో. నీ ప‌త్తానే లేదు. ఇప్పుడొచ్చి దుంకుతా అంటే న‌డ‌వ‌దు. క‌థ తేల్చే దాకా నేనే మాట్లాడుతా. వ‌దిలిపెట్ట‌ను. ప్ర‌తి రోజు మాట్లాడుతా. గార‌డీ చేస్తామంటే …

    Read More »
  • 8 November

    పక్కరాష్ట్రం వెళ్లి చేపల పులుసు తింటే తప్పా?.-CM KCR

    ‘రాయలసీమ కరువు ప్రాంతం. అక్కడకు నీళ్లు కావాలని గతంలో నేను వెళ్లి చెప్పిన మాట వాస్తవమే. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. కృష్ణానదిలో నీళ్లు లేవు. గోదావరిలో ఉన్న నీటిని ఇటు మళ్లించుకుందామని ఏపీ సీఎం జగన్మోహనరావుకు కూడా చెప్పా. ఈ విషయంలో ఏపీ సీఎంను హైదరాబా‌ద్‌కు పిలిపించి మరీ ఇదే విషయం చెప్పా. బేసిన్‌లు, భేషజాలు అడ్డం పెట్టం. తప్పకుండా సహకరిస్తాం అని చెప్పా’ అని సీఎం కేసీఆర్‌ …

    Read More »
  • 8 November

    త్వరలో మరో 70 వేల ఉద్యోగాలు: సీఎం కేసీఆర్

    తెలంగాణలో లక్షా 35 వేల ఉద్యోగాలు ఇచ్చామని, త్వరలో మరో 70 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని ఇందుకోసం ఉద్యోగులను సర్దుబాటు చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఉద్యోగాల భర్తీ కోసం జోనల్‌ చట్టం తీసుకొచ్చామన్నారు. జోనల్‌ విధానం అమలు కారణంగా ఖాళీల భర్తీ కాస్త ఆలస్యమవుతోందని చెప్పారు. ‘‘ మేం చేయగలిగిందే చెబుతాం. కేంద్రం.. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలని చెప్పి …

    Read More »
  • 8 November

    ఎవ‌రు గ‌ట్టిగా మాట్లాడితే వాళ్లు దేశ‌ద్రోహులా- సీఎం కేసీఆర్

    భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌పై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. బండి సంజ‌య్ ఇవాళ మాట్లాడుతూ.. తాను అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌కుండా.. మిగ‌తా విష‌యాల‌న్ని మాట్లాడిండు. వ‌డ్ల గురించి మాట్లాడ‌కుండా.. సొల్లు పురాణం మాట్లాడిండు అని కేసీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. దీన్ని బ‌ట్టే తెలంగాణ రైతాంగం అర్థం చేసుకోవాలి. కేంద్రం మొండి వైఖ‌రి వీడ‌ట్లేదు. రైతుల ఉద్య‌మాలు కొన‌సాగుతున్నాయి. గ‌ట్టిగా నిల‌దీస్తే దేశ‌ద్రోహి. మ‌ద్ద‌తు …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat