Home / INTERNATIONAL / చైనాలో కరోనా మళ్లీ పంజా

చైనాలో కరోనా మళ్లీ పంజా

రష్యా, జర్మనీతోపాటు చైనాలో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ముఖ్యంగా చైనాలోని అత్యధిక రాష్ట్రాల్లో వందలమంది కరోనాబారిన పడ్డారు. ఇక తొలికేసు వెలుగుచూసిన వుహాన్ నగరంలో గతంలో కంటే ఇప్పుడే అధిక కేసులు నమోదవుతున్నాయి.

దీంతో చైనా ప్రభుత్వం కొవిడ్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తోంది. ఎక్కడికక్కడ పరీక్షలు నిర్వహించి, చికిత్స అందిస్తోంది. మరోవైపు రష్యాలో నిత్యం 1,100కు పైగా మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది.