ఆషాడ బోనాల ఉత్సవాల సందర్భంగా యేటా సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పట్టుచీర సమర్పించడం ఆనవాయితీ. ఈ నెల 25న బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారికి సమర్పించేందుకు చేపట్టిన చీరె తయారీని సోమవారం అమ్మవారి ఆలయంలో రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మశాలి సంఘం ప్రతినిధులతో కలిసి శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 10 మంది …
Read More »TimeLine Layout
July, 2021
-
19 July
అభివృద్ధి పనులపై మంత్రి పువ్వాడ సమీక్ష.
ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్, సుడా పరిధిలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులపై సమీక్షించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ .పారిశుధ్యం, చెత్త సేకరణ, రోడ్లు, డ్రైన్స్, పట్టణ ప్రగతిలో చేపట్టిన పనులు, గుర్తించి చేయాల్సిన పనులు, మిషన్ భగీరథ, తదితర పనులపై జిల్లా కలెక్టరేట్ లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో మున్సిపల్, పబ్లిక్ హెల్త్, పంచాయతీ రాజ్, మున్సిపల్, అటవీ, విద్యుత్ తదితర శాఖ అధికారులతో సమీక్షించారు.మేయర్ …
Read More » -
18 July
దేశంలో అందరికంటే ముందు నిద్రలేసే గ్రామం పేరు తెలుసా..?
దేశంలో అందరికంటే ముందు నిద్రలేసే గ్రామం పేరు దోంగ్. ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. దేశంలో తొలి సూర్యకిరణాలు తాకే చోటును, ఆ ఉదయాన్ని ఆస్వాదించడానికి పర్యాటకులు భారీగా వెళ్తుంటారు. అక్కడి బస్సులు ఉండవు. ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లి.. ఆ తొలి సూర్యకిరణాలను ఆస్వాదిస్తుంటారు టూరిస్టులు. దోంగ్ గ్రామంలో తొలి కిరణాలు, నారింజ రంగుతో పర్వత శ్రేణులు కనువిందు చేస్తాయి. అక్కడ సాయంత్రం 4కే సూర్యాస్తమయం అవుతుంది.
Read More » -
18 July
అసలు ఎంతసేపు పడుకుంటున్నారు?
అసలు ఎంతసేపు పడుకుంటున్నారు? ఎన్ని గంటలు నిద్రపోవాలి? అనే విషయం మీకు తెలుసా.. అయితే ఇప్పుడు తెలుసుకుందాం తెలియకపోతే మంచి నిద్ర.. మనిషికి చాలా అవసరం. సరైన నిద్రలేకపోయినా.. నిద్ర ఎక్కువైనా అనేక సమస్యలు వస్తాయి. వయస్సుల వారిగా ఎవరెంత టైం నిద్ర పోవాలన్న దానిపై కొన్ని లెక్కలు ఉన్నాయి. 5-12 వయస్సున్నవారు 9 నుండి 11 గంటలు, 13-17 ఏళ్లు ఉన్నవారు 8 నుండి 10గంటలు పడుకోవాలి. 18 ఏళ్లు దాటినవారు.. …
Read More » -
18 July
క్యారెట్ తో ఎన్నో లాభాలు
క్యారెట్ ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయి. క్యారెట్ గుండెకు చాలా మంచిదట. క్యారెట్ రెగ్యులర్గా తింటే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువని తేలింది. క్యారెట్లో పుష్కలంగా ఉండే కెరోటిన్.. శరీరంలోకి విటమిన్ Aగా మార్పు చెందుతుంది. ఇది రక్తంలో చెడు కొవ్వులను తగ్గిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. గుండె జబ్బులకు కారణమయ్యే అథెరోస్కెలెరోసిస్ అభివృద్ధి చెందకుండా క్యారెట్ చేస్తుందని నిర్ధారించారు.
Read More » -
18 July
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎవరో తెలుసా..?
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు పేరును ప్రకటించనున్నట్టు సమాచారం. పార్టీ అధినేత చంద్రబాబు నేడు లేదా రేపు TTDP అధ్యక్షుడితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించనున్నారు. సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్ష పదవిపై అనాసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది. వచ్చింది.
Read More » -
18 July
TTD చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి
ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి మరోసారి నియమితులయ్యారు. టీటీడీ చైర్మన్ గా ఆయన్ను కొనసాగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే, టీటీడీ ఛైర్మన్ గా తిరిగి కొనసాగేందుకు ఆయన సుముఖంగా లేరని గతంలో ప్రచారం జరిగింది. ప్రత్యక్ష రాజకీయాల్లో కీలకంగా మారాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, సీఎం ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానని గతంలో సుబ్బారెడ్డి తెలిపారు.
Read More » -
18 July
నిరుద్యోగులకు అండగా నారా లోకేష్
ఏపీ ఉద్యోగ పోరాట సమితి ఈ నెల 19న తలపెట్టిన ‘చలో తాడేపల్లి’ కార్యక్రమానికి పోలీసులు అనుమతివ్వకపోవడంపై TDP నేత నారా లోకేశ్ స్పందించారు. నిరుద్యోగులను పోలీసులు బెదిరిస్తున్నారు.. కేసులు పెట్టి భవిష్యత్తు దెబ్బతీస్తామని హెచ్చరించడం జగన్ అరాచక పాలనకు నిదర్శనమన్నారు. కొందరు పోలీసులు YCP బానిసల్లా బతుకుతున్నారని.. రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే హక్కును కాలరాసే హక్కు పోలీసులకు లేదన్నారు.
Read More » -
18 July
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్
తెలుగు సినిమా స్టార్ హీరో.. జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో రానున్న సినిమాపై ఇంట్రెస్టింగ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా బడ్జెట్ రూ.200 కోట్లు అని ఫిల్మ్ నగర్ టాక్. కొరటాల ఈ సినిమాను ఓ రేంజ్లో తీర్చిదిద్దనున్నారని చెప్పుకుంటున్నారు. RRR షూటింగ్ పూర్తయ్యాక తారక్ ఈ ప్రాజెక్టులో చేరనున్నాడు. వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సూపర్ హిట్ అయింది.
Read More » -
18 July
రకుల్ ప్రీత్ సింగ్ పై ట్రోలింగ్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి.. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. గ్రాజియా అనే మేగజైన్ కోసం తాజాగా రకుల్ ఫోటో షూట్ చేసింది. అయితే, ఈ ఫోటోల్లో రకుల్ దారుణంగా ఉందంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఒకప్పుడు అందంతో ఆకట్టుకున్న రకుల్ ఇలా అయిపోయిందేంటని షాక్ తింటున్నారు. తాజాగా ఫోటోల్లో గ్రహాంతరవాసిలా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. రకుల్ ఫ్యాన్స్ …
Read More »