పల్లీలు బెల్లం కలుపుకుని తింటే మజా ఉంటుందని అంటున్నారు వైద్యులు..అలా తినడం వలన లాభాలెంటో తెలుసుకుందాం.. ప్రతిరోజూ పల్లీ చక్కీలు తింటే రక్తం శుద్ధి అవుతుంది. రక్తహీనత సమస్య తీరేందుకు బాగా సహాయపడుతుంది. రక్త సరఫరా పెరిగి గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఈ ఎదుగుతున్న పిల్లలకు పల్లీలు, బెల్లం కలిపి ఇస్తే రోజంతా హుషారుగా ఉంటారు. చర్మం తాజాగా మారుతుంది. …
Read More »TimeLine Layout
June, 2021
-
7 June
లాక్ డౌన్ సడలింపులు దిశగా తెలంగాణ
తెలంగాణలో లాక్ డౌన్ ను మరింత సడలించే దిశగాప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఎల్లుండి నుంచి సాయంత్రం 5గంటల వరకు అన్ని పనులకు పర్మిషన్ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. రేపు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే కేబినేట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వెసులుబాటు కల్పించింది. మరోవైపు లాక్డౌన్ తొలగించి.. నైట్ కర్ఫ్యూ ఒక్కటే కొనసాగించే ప్రతిపాదనలు కూడా …
Read More » -
7 June
ఈ నెల 13న బీజేపీలోకి ఈటల
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీకి ఇటీవల గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరే ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 13 న ఈటల రాజేందర్ బీజేపీలో చేరనున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, టీఆర్ఎస్ మహిళా విభాగం మాజీ …
Read More » -
6 June
మానవత్వాన్ని చాటుకున్న వినోద్ కుమార్
తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం కరీంనగర్ వెళ్టుండగా రోడ్డుపై పడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తిని గమనించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వెంటనే తన వాహనం నుంచి దిగి జగిత్యాల ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. మెట్ పల్లి, కథలాపూర్, మేడిపల్లిలలో ఆదివారం పలు కార్యక్రమాలలో పాల్గొని కరీంనగర్ వెళ్తుండగా వినోద్ కుమార్ కు ఈ సంఘటన ఎదురైంది. జగిత్యాల నుంచి కరీంనగర్ వెళ్తున్న …
Read More » -
6 June
చిన్నారుల మనసును గెలిచిన మంత్రి పువ్వాడ
ఖమ్మం నగరంలోని ఒక ప్రైవేట్ విద్యాసంస్థలో చదివే చిన్నారి తన ప్రాజెక్టు వర్క్ లో మంత్రి పువ్వాడపై వ్యాసం.. ఐదో తరగతి చదువుతున్న ఆశ్రిత్ నాయుడు.. సామాజిక సేవా దృక్పథం గురించి సొంత వ్యాసం రాయమని విద్యార్థులకు టాస్క్ దీంతో జిల్లాలో పువ్వాడ అజయ్ కుమార్ గారు చేస్తున్న సామాజిక సేవలపై వ్యాసం రాసిన అశ్రిత్ నాయుడు.. జిల్లాలో కరోనా కట్టడీపై మంత్రి పువ్వాడ తీసుకున్న చర్యలు బాగున్నాయని చిన్నారి …
Read More » -
6 June
ఏపీలో కొత్తగా 10,373 కరోనా కేసులు
ఏపీలో గత 24 గంటల్లో 88,441 మందికి కరోనా టెస్టులు చేస్తే 10,373 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న 80 మంది కరోనాతో మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 17,49,363కు చేరగా ఇప్పటివరకు 11,376 మంది చనిపోయారు. ప్రస్తుతం 1,28,108 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 15,958 మంది కరోనాను జయించారు. మొత్తం 16,09,879 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Read More » -
6 June
తెలంగాణలో తగ్గని కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 2,070 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 18 మంది మహమ్మారికి బలయ్యారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 3,762 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,89,734కు చేరింది. ఇప్పటికీ 5,57,162 మంది కోలుకున్నారు. మొత్తం ఇప్పటివరకూ కరోనాతో 3,364 మంది చనిపోయారు. యాక్టివ్ కేసులు 29,208 ఉన్నాయి. ఒక్కరోజు వ్యవధిలో 1,38,182 టెస్టుల చేసినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
Read More » -
6 June
రేపు ఢిల్లీకి సీఎం జగన్
ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత,సీఎం జగన్ ఈనెల 7న ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ తో పాటు మరికొందరు కేంద్ర మంత్రులతోనూ ఆయన భేటీ కానున్నట్లు సమాచారం. కరోనా వ్యాక్సిన్ పంపిణీతో పాటు పలు అంశాలపై సీఎం చర్చించే అవకాశాలున్నాయి. పోలవరం ప్రాజెక్టు, విభజన హామీల నిధుల మంజూరు విషయాలపైనా కేంద్రమంత్రులతో ఆయన మాట్లాడనున్నారు. అటు ప్రధాన మంత్రితో భేటీకి సీఎం కార్యాలయం సంప్రదించినట్లు తెలుస్తోంది.
Read More » -
6 June
కరోనా థర్డ్ వేవ్ ను ఇలా ఎదుర్కోవాలి
విటమిన్-D మోతాదు ప్రకారం తీసుకోవడం వల్ల కరోనా నుంచి కాపాడుకోవచ్చు! థర్డ్ వేవ్ ను అడ్డుకోవచ్చు. విటమిన్-Dతో కరోనా సివియర్ కాకుండా ఆపుతున్నాం. కాబట్టి.. బ్లాక్ ఫంగస్ సోకే అవకాశాలు తక్కువే. విటమిన్-డీ కోసం చేపలు, గుడ్లు వంటి ఆహార పదార్థాలతో పాటు సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవాలి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇలా విటమిన్ Dతో కరోనా నుంచి కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Read More » -
6 June
పెళ్లి పై అంజలి క్లారిటీ
తెలుగు భామ అంజలి.. పెళ్లి గురించి స్పందించింది. ఇటీవల ‘వకీల్ సాబ్’ సినిమాతో అలరించింది అంజలి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో లాక్డౌన్లో చాలామంది హీరోయిన్లు పెళ్లి చేసుకుంటున్నారు.. మీది ఎప్పుడు అని అడగ్గా.. ప్రస్తుతం పూర్తి ఫోకస్ కెరీర్ మీదే ఉందని, ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని అంజలి తేల్చిచెప్పింది. తెలుగులోనే కాకుండా, తమిళం, కన్నడలోనూ నటిస్తోంది. అంజలి, తమిళ హీరో జై తో ప్రేమలో ఉన్నట్లు టాక్ నడుస్తోంది.
Read More »