ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత,సీఎం జగన్ ఈనెల 7న ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ తో పాటు మరికొందరు కేంద్ర మంత్రులతోనూ ఆయన భేటీ కానున్నట్లు సమాచారం.
కరోనా వ్యాక్సిన్ పంపిణీతో పాటు పలు అంశాలపై సీఎం చర్చించే అవకాశాలున్నాయి.
పోలవరం ప్రాజెక్టు, విభజన హామీల నిధుల మంజూరు విషయాలపైనా కేంద్రమంత్రులతో ఆయన మాట్లాడనున్నారు. అటు ప్రధాన మంత్రితో భేటీకి సీఎం కార్యాలయం సంప్రదించినట్లు తెలుస్తోంది.