ఇంగ్లండ్ తో జరుగుతున్న నాల్గవ టెస్టులో అద్భుత సెంచరీతో అదరగొట్టిన యంగ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్,, అరుదైన రికార్డు సాధించాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా భారత్ లో సెంచరీ సాధించిన రెండవ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఘనత సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా లెజండరీ కీపర్ ఆడం గిల్ క్రిస్ట్ సరసన నిలిచాడు. గతంలోనే ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల్లో సెంచరీ చేసిన పంత్.. తాజాగా అహ్మదాబాద్ లో సూపర్బ్ …
Read More »TimeLine Layout
March, 2021
-
6 March
మరోసారి జోడిగా నాగార్జున-అనుష్క
టాలీవుడ్ లో సూపర్ హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న నాగార్జున-అనుష్క మరోసారి కలిసి నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ వీరిద్దరూ 9సార్లు సిల్వర్ స్క్రీన్పై మెరిశారు. ఇపుడు పదోసారి కలిసి నటించబోతున్నట్లు సమాచారం. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో అనుష్క మరోసారి నాగ్ సరసన నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెండితెరపై వీళ్ల జోడీకి మంచి క్రేజ్ ఉంది
Read More » -
6 March
బీజేపీపై ఎంపీ సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు
బీజేపీకి చెందిన సీనియర్ ఎంపీ సుబ్రహ్మణ్యం సొంత పార్టీపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. కేరళ బీజేపీ సీఎం అభ్యర్థిగా మెట్రో మ్యాన్ శ్రీధరన్ పేరు ప్రకటించడాన్ని తప్పుబట్టారు. శ్రీధరన్ వయసు 89 ఏళ్లు, బీజేపీ రూల్స్ ప్రకారం 75 ఏళ్లు దాటిన వారికి పార్టీ పదవులు ఇవ్వరు. మరి ఇది సరైనా నిర్ణయమా? ఒక వేళ ఇది కరెక్ట్ అయితే.. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, శాంత కుమార్లు 2024 …
Read More » -
6 March
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వేగంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 60 ఏండ్ల వయసు సైబడిన 11,854 మందికి మొదటి డోస్ ఇచ్చినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. 5530 మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ సెకండ్ డోస్ తీసుకున్నట్లు తెలిపారు, సమయం తేదీని స్వయంగా నిర్ణయించుకునే వెసులుబాటు ఇవ్వడంతో అనేక మంది స్లాట్ బుక్ చేసుకుంటున్నారని వైద్యాధికారులు చెప్పారు
Read More » -
6 March
ఉసిరితో లాభాలెన్నో..?
విరివిగా లభించే ఉసిరితో కాల్షియం లోపానికి చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు. ఉసిరిని ఎక్కువగా పచ్చడి రూపంలో తింటుంటాం. ఉసిరి పొడి వినియోగం కూడా పెరిగింది. ఇక.. ఉసిరిని జ్యూస్ గా, మురబ్బాగా, సిరప్ గా తీసుకోవచ్చు. కొంత మంది ఉసిరి కాయలను ఊరబెట్టి కూడా తింటారు. ఇలా ఏ రూపంలో తీసుకున్నా ఉసిరిలో పోషక విలువలు పదిలంగానే ఉంటాయి. శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆయుర్వేద వైద్యంలోనూ ఉసిరిని విరివిగా …
Read More » -
6 March
తెలంగాణ బడ్జెట్ సమావేశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష
తెలంగాణ బడ్జెట్ సమావేశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి హరీష్ రావుతో పాటు ఆర్థిక శాఖ అధికారులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల నిర్వహణతో పాటు సంబంధిత అంశాలపై సీఎం సమీక్షించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. మరో రెండు వారాల్లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
Read More » -
6 March
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతురాలినే ఎన్నుకుందాం…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ ఎన్ఆర్ఐ కాలనిలో స్థానిక నాయకుడు శ్రీకర్ గుప్త గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పట్టభద్రులతో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు, స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బలపర్చిన టీఆర్ఎస్ …
Read More » -
5 March
మేయర్ అభ్యర్థిని ఖరారు చేసిన టీడీపీ
ఏపీలో త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ మేయర్ అభ్యర్థిని టీడీపీ ఖరారు చేసింది. ఎంపీ కేశినేని నాని కుమార్తె అయిన కేశినేని శ్వేత పేరును ఓకే చేసినట్లు ఆ పార్టీ వెల్లడించింది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. కేశినేని శ్వేత 11వ డివిజన్ నుంచి బరిలో ఉన్నారు.
Read More » -
5 March
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మాజీ ప్రధాని
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇవాళ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆయన సతీమణి గుర్ శరణ్ కౌర్ తో కలిసి ఢిల్లీలోని ఎయిమ్స్ లో వ్యాక్సినేషన్లో పాల్గొన్నారు. భారత్ బయోటెక్ సంస్థ తయారుచేసిన కోవాక్సిన్ వేయించుకున్న 88 ఏళ్ల మన్మోహన్.. అరగంట పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అంతేకాకుండా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఢిల్లీలోని ఫోర్టిస్ అనే ఆస్పత్రిలో టీకా తొలి డోసు వేయించుకున్నారు
Read More » -
5 March
నిండు సభలో బట్టలు విప్పేసిన ఎమ్మెల్యే
కర్ణాటక అసెంబ్లీలో ఇవాళ పెద్ద రచ్చ జరిగింది. బీజేపీ జమిలి ఎన్నికల అంశాన్ని తెరపైకి తేవడంతో కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు.బీజేపీ,ఆర్ఎస్ఎస్ లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో భద్రావతి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీకే సంగమేష్.. తన షర్ట్ విప్పి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కోప్పడిన స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే.. అసభ్య ప్రవర్తనతో సభను అగౌరవపర్చారని ఎమ్మెల్యేను వారం సస్పెండ్ చేశారు. అనంతరం సభను …
Read More »