Home / NATIONAL / నిండు సభలో బట్టలు విప్పేసిన ఎమ్మెల్యే

నిండు సభలో బట్టలు విప్పేసిన ఎమ్మెల్యే

కర్ణాటక అసెంబ్లీలో ఇవాళ పెద్ద రచ్చ జరిగింది. బీజేపీ జమిలి ఎన్నికల అంశాన్ని తెరపైకి తేవడంతో కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు.బీజేపీ,ఆర్ఎస్ఎస్ లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ క్రమంలో భద్రావతి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీకే సంగమేష్.. తన షర్ట్ విప్పి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కోప్పడిన స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే.. అసభ్య ప్రవర్తనతో సభను అగౌరవపర్చారని ఎమ్మెల్యేను వారం సస్పెండ్ చేశారు. అనంతరం సభను వాయిదా వేశారు