Home / ANDHRAPRADESH / మేయర్ అభ్యర్థిని ఖరారు చేసిన టీడీపీ

మేయర్ అభ్యర్థిని ఖరారు చేసిన టీడీపీ

ఏపీలో త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ మేయర్ అభ్యర్థిని  టీడీపీ  ఖరారు చేసింది. ఎంపీ కేశినేని నాని కుమార్తె అయిన కేశినేని శ్వేత పేరును ఓకే చేసినట్లు ఆ పార్టీ వెల్లడించింది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. కేశినేని శ్వేత 11వ డివిజన్ నుంచి బరిలో ఉన్నారు.