భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇవాళ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆయన సతీమణి గుర్ శరణ్ కౌర్ తో కలిసి ఢిల్లీలోని ఎయిమ్స్ లో వ్యాక్సినేషన్లో పాల్గొన్నారు. భారత్ బయోటెక్ సంస్థ తయారుచేసిన కోవాక్సిన్ వేయించుకున్న 88 ఏళ్ల మన్మోహన్.. అరగంట పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అంతేకాకుండా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఢిల్లీలోని ఫోర్టిస్ అనే ఆస్పత్రిలో టీకా తొలి డోసు వేయించుకున్నారు
Read More »పార్టీ మార్పుపై జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు
పార్టీ మార్పుపై సీనియర్ నేత, మాజీమంత్రి కె. జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ ను వీడేదిలేదని ఆయన స్పష్టం చేశారు. టీపీసీసీ చీఫ్ పదవి ఎవరికి వచ్చినా కలిసి పని చేస్తామని తెలిపారు. ఆదివారం రాత్రి వికారాబాద్ జిల్లా పరిగిలో విలేకరులతో ఆయన మాట్లాడారు. సీనియర్లు, జూనియర్లంతా సమన్వయంతో కాంగ్రె్‌సను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. మీరు బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారంపై జానారెడ్డి సున్నితంగా స్పందించారు. …
Read More »కరోనాతో అహ్మద్ పటేల్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ ట్రబుల్ షూటర్ అహ్మద్ పటేల్ కన్నుమూశారు. అక్టోబర్ 1న ఆయన కరోనా బారినపడ్డారు. దీంతో గురుగ్రామ్‌లోని మేదాంత దవాఖానలో నెల రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఆయన అవయవాలు చికిత్సకు సహకరించక పోవడంతో ఇవాళ తెల్లవారుజామున 3.30 గంటలకు మరణించారు. ఈమేరకు ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాంగాధీకి ఆయన సుదీర్ఘకాలం రాజకీయ సలహాదారుగా పనిచేశారు. …
Read More »మళ్లీ కాంగ్రెస్ లో చేరతా -మాజీ ఎంపీ
‘నేను తిరిగి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నా. ఉత్తరప్రదేశ్‌లో దళిత బాలికపై అత్యాచారం, హత్య కేసులో బాధితులకు అండగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ప్రియాంక చేసిన పోరాటం చూస్తుంటే ఇందిరాగాంధీ రోజులు గుర్తుకొస్తున్నాయి. దేశంలో పేద, దళిత, మైనారిటీ ప్రజలకు అండగా ఉండేది.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే’ అని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ పేర్కొన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. హీరోలా 120 కిలోమీటర్ల దూరం నడిచి …
Read More »అగమ్యగోచరంగా కాంగ్రెస్ నేతల పరిస్థితి
కాంగ్రెస్ పార్టీలో నేతల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కాంగ్రెస్‌లో ఇక తమకు భవిష్యత్ లేదని ఆలోచిస్తున్న కొంతమంది నేతలు పార్టీని వీడడం భారంగా భావిస్తున్నారు. అదే సమయంలో బీజేపీలో చేరడం తప్ప.. మరో ప్రత్యామ్నాయం కనిపించడంలేదు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అసాధ్యమని పలువురు కాంగ్రెస్ నేతలు బేరేజు వేసుకుంటున్నారు. ఎన్నికల నాటికి ప్రధానిగా మోదీ మరింత బలపడతారని, అలాంటి సమయంలో కాంగ్రెస్ టిక్కెట్‌పై గెలుపు అన్నది అత్యాసే అవుతుందని …
Read More »ఏఐసీసీ అధ్యక్ష పదవికి సోనియాగాంధీ రాజీనామా
ఏఐసీసీ అధ్యక్ష పదవికి సోనియాగాంధీ రాజీనామా చేశారు. ఇవాళ ఉదయం 11గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైంది. ఈ సందర్భంగా సమావేశంలో తన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అధ్యక్ష పదవి తనకు ఆసక్తి లేదని ఈ సందర్భంగా సోనియాగాంధీ తెలిపారు. మరో అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సభ్యులకు సూచించారు. సోనియా రాజీనామాను సభ్యులకు కేసీ వేణుగోపాల్ చదివి వినిపించారు. ఈ సందర్భంగా అధ్యక్ష పదవికి సోనియా మాజీ …
Read More »కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూత
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూశారు. జూలై 29న అనారోగ్యంతో నిమ్స్‌లో చేరిన నంది ఎల్లయ్య.. శనివారం ఉదయం 10.30 గంటలకు తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధ పడుతూ నిమ్స్‌లో చేరగా పరీక్షల అనంతరం కరోనా పాజిటివ్‌గా నిర్దారించారు. 10 రోజుల పాటు చికిత్స అనంతరం మృతి చెందారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. నంది ఎల్లయ్య లోక్‌సభ ఎంపీగా ఆరు సార్లు గెలుపొందారు. …
Read More »ప్రధానికి ఎస్పీజీ భద్రత తగ్గింపు..కారణం ఇదేనా
ప్రధానికి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) కమాండోల భద్రత తగ్గిపోనుంది. ప్రస్తుతం ఉన్న వారిలో 50-60శాతం మంది సిబ్బందితోనే ప్రధానికి భద్రత కల్పించనున్నారు. రానున్న రోజుల్లో.. ఎస్పీజీలో ఉన్న 4వేల మంది సిబ్బందిని దశల వారీగా తగ్గించే ప్రక్రియ మొదలైందని అధికారులు తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుటుంబ సభ్యులకు కేటాయించిన కమాండోలను కూడా ఉపసంహరించాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందని చెప్పారు. కేంద్ర కేబినెట్ సచివాలయ …
Read More »కరోనా ఎఫెక్ట్ -సోనియా గాంధీ సంచలన నిర్ణయం
ప్రస్తుతం దేశమంతా కరోనావైరస్ ప్రభావంతో గజగజ వణుకుతుంది.మరణాల శాతం తక్కువగానే ఉన్నా కానీ బాధితుల సంఖ్య మాత్రం రోజురోజుకు పెరుగుతుంది.ఈ క్రమంలో ఏఐసీసీ అధినేత శ్రీమతి సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని సంచలన డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నాము.కరోనా నియంత్రణకు కేంద్రం తీసుకునే ప్రతి చర్యకు మేము మద్ధతిస్తాము. లాక్ డౌన్ నిర్ణయంతో పేద,మధ్యతరగతి …
Read More »రేవంత్‌కు అంత దమ్ము ఉందా..!
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జైల్లో కూర్చొని పీసీసీ పదవి ఎందుకు ఆశిస్తున్నారని రేవంత్‌ను ప్రశ్నించారు. నాలుగు గోడల మధ్య జరుగుతున్న చర్చను సోషల్ మీడియాలో ఎందుకు పెడుతున్నారని నిలదీశారు. రేవంత్‌రెడ్డి అనుచరులు ఫేస్‌బుక్‌లో చేస్తున్న వ్యాఖ్యలను గమనిస్తున్నానని చెప్పారు. రేవంత్ అనుచరులు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని.. వారి అరాచకాలను అడ్డుకోవాలని టీపీసీసీని కోరారు.కాంగ్రెస్ పార్టీ …
Read More »