కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో చోటుదక్కింది. ప్రధాన మంత్రి నరేందర్ మోదీ ఇంటిపేరు వ్యవహారంలో రాహుల్ గాంధీ అనర్హతకు గురైన సంగతి తెల్సిందే. దీంతో ఆయన దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టు తీర్పుతో మళ్లీ లోక్‌సభలోకి ప్రవేశించారు. సభ్యత్వం పునరుద్ధరించిన వారం వ్యవధిలోనే రాహుల్ గాంధీ డిఫెన్స్‌పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి నామినేట్ కావడం విశేషం. ఈ మేరకు …
Read More »కర్ణాటక సీఎం ఎవరు..?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన కాంగ్రెస్ పార్టీ సీఎం పదవి ఎవరికి ఇవ్వాలన్న అంశంపై తర్జనభర్జన పడుతోంది. ఆ పార్టీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ ఆ పోస్టుకు పోటీపడుతున్నారు. సీఎంను ఎన్నుకునే విషయంలో ఏక వాఖ్య తీర్మానం చేశామని, ఆ అంశాన్ని పార్టీ హైకమాండ్‌కు వదిలేస్తున్నామని, తాను ఢిల్లీకి వెళ్లడం లేదని, తనకు ఇచ్చిన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించినట్లు కర్ణాటక …
Read More »ప్లీనరీ సమావేశాల్లో కాంగ్రెస్ సంచలన నిర్ణయం
కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోన్న తాజా ప్లీనరీ సమావేశాల్లో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అత్యున్నత కమిటీ అయిన CWCకి ఇక నుంచి ఎన్నికలు నిర్వహించకూడదని తీర్మానించారు. సభ్యులను నామినేట్ చేసే అధికారం పార్టీ అధ్యక్షుడికే కట్టబెట్టారు. చత్తీస్ గఢ్ లోని రాయపూర్ లో ఆ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో పార్టీ అగ్రనేతలు పాల్గొన్నారు.
Read More »రాహుల్ కు పెళ్ళి వద్దంటా కానీ పిల్లలు కావాలంటా..?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 52 ఏండ్లైనా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆయన పెండ్లి ఎప్పుడు చేసుకుంటారా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ విషయంలో రాహుల్ కు అనేక సార్లు ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. అయితే, తాజాగా తన వివాహంపై రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటి వరకు వివాహం ఎందుకు చేసుకోలేదో తెలియదు కానీ, పిల్లలు కావాలని మాత్రం ఉందంటూ చెప్పుకొచ్చారు.
Read More »తెలంగాణలో రికార్డుస్థాయికి చేరిన విద్యుత్తు డిమాండ్…
వేసవికాలం రాకముందే విద్యుత్తు వాడకం చుక్కలను తాకుతోంది. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా శుక్రవారం సాయంత్రం 4.08 గంటలకు 14,169 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ నమోదైంది. గతేడాది ఫిబ్రవరి 10న డిమాండ్ 11,822 మెగావాట్లు మాత్రమే. గతంలో అత్యధిక రోజువారీ వినియోగం 2022 మార్చి 29న 14,167 మెగావాట్లు నమోదు కాగా తాజాగా ఆ రికార్డు చెరిగిపోయింది. యాసంగి పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతున్నందున వ్యవసాయబోర్ల వినియోగం ఎక్కువై డిమాండ్ …
Read More »త్వరలోనే కొత్త రేషన్ కార్డులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న పేదలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ అసెంబ్లీలో తెలిపారు. జాతీయ ఆహార భద్రత కింద కేంద్రం 53 లక్షల రేషన్ కార్డులు ఇచ్చింది. తాము అదనంగా 35 లక్షల కార్డులు ఇచ్చినట్లు వెల్లడించారు. మంత్రి ప్రకటనతో త్వరలో తమకు …
Read More »తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ
తెలంగాణ రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 11న నామినేషన్లను స్వీకరించనున్నారు. 12వ తేదీన మండలిలో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు. డిప్యూటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్ పేరు ఖరారు అయింది. బండ ప్రకాశ్ ఎమ్మెల్సీగా 2021, నవంబర్ నెలలో ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. చైర్మన్‌గా గుత్తా సుఖేందర్ రెడ్డి కొనసాగుతున్న విషయం విదితమే.
Read More »విద్యార్థులకు ఏపీ సర్కారు శుభవార్త
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాలయాల్లో చదివే విద్యార్థుల వసతి, భోజనం ఖర్చుల కోసం సుమారు రూ.1000 కోట్లు ఖర్చు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్యార్థులకు బలవర్థకమైన ఆహారం అందించడంలో భాగంగా మార్చి 2 నుంచి మధ్యాహ్న భోజనంలో రాగి జావ పంపిణీ చేయాలని నిర్ణయించింది. వారానికి మూడు రోజులపాటు అందజేసేందుకు అదనంగా రూ.86 కోట్లను ఖర్చు చేయనుంది.
Read More »మంత్రులు,ఎమ్మెల్యేలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అభద్రతాభావంలో ఉన్నారని నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో నాయకులు.. ఫోన్లు మాట్లాడుకునే ధైర్యం చేయలేకపోతున్నారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ ఘటనపై ప్రభుత్వం భయపడుతోందని… విచారణ జరిగితే మిగిలిన వారి ట్యాపింగ్ విషయాలు బయటపడతాయని వెనకడుగు వేస్తోందని చెప్పారు. మేయర్తోపాటు 11 మంది కార్పోరేటర్లు తనతోపాటు ఉన్నారని కోటంరెడ్డి తెలిపారు.
Read More »యువతకు మంత్రి కేటీఆర్ శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతకు మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని అమెరికాకు చెందిన ప్రొవిడెన్స్ హెల్త్ సిస్టమ్స్ కంపెనీ తమ ఉద్యోగుల సంఖ్యను మూడింతలు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం కంపెనీలో 1,000 మంది పనిచేస్తున్నారని, ఆ సంఖ్యను 3వేలకు పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ మేరకు కంపెనీ సీఈవో డాక్టర్ రాడ్ హోచ్మన్, సీఐవో మూర్, ఇండియా హెడ్ మురళీ కృష్ణలు భేటీ అయ్యారని ట్విటర్లో పేర్కొన్నారు.
Read More »