Home / Tag Archives: anantapuram

Tag Archives: anantapuram

కన్నకూతురిపై కన్నతండ్రే..!

ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం జరిగింది. కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డ తండ్రి ఆమెను గర్భవతిని చేశాడు. తాగుడుకు బానిసైన ఆ వ్యక్తికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 15 ఏళ్ల వయసున్న పెద్ద కుమార్తెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. 2 రోజుల క్రితం ఒంట్లో నలతగా ఉండటంతో తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది. టెస్టులు చేయగా బాలిక గర్భవతి అని తేలింది.

Read More »

అనంతపురం జిల్లాలో రోడ్డుప్రమాదం

ఏపీలో అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం హులికల్లు గ్రామం వద్ద రోడ్డుప్రమాదం సంభవించింది. కళ్యాణదుర్గం – రాయదుర్గం ప్రధాన హైవే రోడ్‌లో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే ఒకరి మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కళ్యాణదుర్గం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు

Read More »

చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ.. వైసీపీలో చేరిన శమంతకమణి, యామినిబాల..!

స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా వైరస్ పేరుతో వాయిదా వేయించామని శునకానందంతో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ నేతలు వరుస షాక్‌లు ఇస్తున్నారు. చంద్రబాబు నీచ రాజకీయాలు భరించ లేక టీడీపీ సీనియర్ నేతలంతా ఒక్కొక్కరిగా వైసీపీలో చేరుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కూతురు శింగనమల మాజీ ఎమ్మెల్యే యామినీబాల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో …

Read More »

స్థానిక సంస‌్థల ఎన్నికల్లో టీడీపీ అరాచకం ఎన్నికల అధికారిపై పరిటాల శ్రీరామ్ దౌర్జన్యం..!

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కుయుక్తులను పన్నుతున్నాడు.రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకునేలా ప్రత్యర్థులను రెచ్చగొట్టి హింసాత్మక ఘటనలు జరిగేలా చేసి వైసీపీపై బురద జల్లేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు. విజయవాడలో ఆర్వో సెంటర్ వద్ద వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులు చేసిన సంఘటన మరువక ముందే…అనంతపురంలో మరో ఘటన జరిగింది. జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలకు అంతే లేకుండా పోతుంది. తాడిపత్రిలో జేసీ …

Read More »

చంద్రబాబుకు డబుల్ షాక్.. వైసీసీలోకి అనంత తల్లీకూతుర్లు..!

స్థానిక సంస్థల వేళ టీడీపీ సీనియర్ నేతలంతా చంద్రబాబుకు హ్యాండ్ ఇచ్చి వైసీపీ గూటిలోకి చేరుకుంటున్నారు. దశాబ్దాలుగా టీడీపీలో పని చేసిన నేతలంతా ఇక చంద్రబాబుతో పని చేయలేమంటూ జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు. జమ్మలమడుగు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డితో రాయలసీమలో మొదలైన వలసల పర్వం ఇంకా కొనసాగుతోంది. రేపో మాపో పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి వైసీపీలో చేరబోతుండగా తాజాగా …

Read More »

పాతకేసులో అరెస్ట్ భయంతో వణికిపోతున్న జేసీ దివాకర్ రెడ్డి..!

వివాదాస్పద టీడీపీ సీనియర్ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేయవచ్చని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న జేసీ దివాకర్ రెడ్డికి చెందిన ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. అంతే కాదు జేసీ ట్రావెల్స్ ఫోర్టరీ కేసులో పాటు, నకిలీ ఇన్సూరెన్స్ సర్ఠిఫికెట్ల బాగోతంలో పీకల్లోతు మునిగిపోయింది. …

Read More »

వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు తప్పిన ముప్పు..ఉద్విగ్న వాతావరణం..!

అనంతపురం జిల్లాలో ప్రజాదరణ పొందిన నేతల్లో ఉరవకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ముందు వరుసలో ఉంటారు. అంతులేని ప్రజాభిమానం ఆయన సొంతం. వైయస్ కుటుంబానికి విశ్వేశ్వరరెడ్డి అత్యంత ఆత్మీయుడు. . 2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు ఎంతగా ప్రలోభాలకు గురి చేసినా…విశ్వేశ్వరరెడ్డి లొంగలేదు. వైసీపీలోనే ఉండిపోయారు. అందుకే సీఎం జగన్‌తో పాటు విజయమ్మ కూడా నమ్మినబంటు అయిన విశ్వేశ్వరరెడ్డిని ఎంతో అభిమానిస్తారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ …

Read More »

ప్రజా చైతన్య యాత్రకు రావద్దు అంటున్న అనంత తమ్ముళ్లు.. చంద్రబాబు ఆగ్రహం..?

ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చినట్లు..టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర టీడీపీ నేతల చావుకు వచ్చింది. వైసీపీ ప్రభుత్వం 9 నెలల పాలనపై నవ మోసాల పాలన అంటూ చంద్రబాబు ప్రజా చైతన్యయాత్ర చేపట్టి తొలుత ప్రకాశం జిల్లాలో పర్యటించాడు. పాపం బాబుగారి యాత్రకు జనాలు దండిగా తరలించాలని..అమరావతి నుంచి జిల్లా నేతలకు ఆదేశాలు అందాయి. దీంతో టీడీపీ నేతలు పడుతూ లేస్తూ..డబ్బులు కుమ్మరించి జనాలను ఓ మోస్తరు …

Read More »

పరిటాల ఫ్యామిలీ అవినీతిపై తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

ఏపీలో టీడీపీ నేతలు వరుసగా స్కామ్‌ల్లో ఇరుక్కుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, మాజీ మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులతో సహా పలువురు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్ స్కామ్‌లో ఇరుక్కోగా..మాజీ మంత్రులు అచ్చెంనాయుడు, పితాని సత్యనారాయణ ఈఎస్‌ఐ స్కామ్‌లో అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఇక టీడీపీ హయాంలో వివిధ ప్రభుత్వ శాఖలలో జరిపిన అవినీతిపై జగన్ సర్కార్ విచారణ జరిపిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ …

Read More »

బాలయ్యకు షాక్…వైసీపీ నేతకు జేజేలు పలుకుతున్న హిందూపురం తెలుగు తమ్ముళ్లు.. ఎందుకో తెలుసా..!

హిందూపురంలో వైసీపీ నేత, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. గతంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకుని మానవత్వాన్ని చాటిన మహ్మద్ ఇక్బాల్…తాజాగా చేసిన ఓ మంచి పనికి ప్రత్యర్థులైన టీడీపీ నేతలు సైతం జేజేలు కొడుతున్నారు. పక్షవాతంతో బాధపడుతున్న ఓ టీడీపీ కార్యకర్తకు మహ్మద్ ఇక్బాల్ ఆపన్నహస్తం అందించడం అనంతపురం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే… అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన టీడీపీ కార్యకర్త …

Read More »