Home / ANDHRAPRADESH / స్థానిక సంస‌్థల ఎన్నికల్లో టీడీపీ అరాచకం ఎన్నికల అధికారిపై పరిటాల శ్రీరామ్ దౌర్జన్యం..!

స్థానిక సంస‌్థల ఎన్నికల్లో టీడీపీ అరాచకం ఎన్నికల అధికారిపై పరిటాల శ్రీరామ్ దౌర్జన్యం..!

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కుయుక్తులను పన్నుతున్నాడు.రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకునేలా ప్రత్యర్థులను రెచ్చగొట్టి హింసాత్మక ఘటనలు జరిగేలా చేసి వైసీపీపై బురద జల్లేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు. విజయవాడలో ఆర్వో సెంటర్ వద్ద వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులు చేసిన సంఘటన మరువక ముందే…అనంతపురంలో మరో ఘటన జరిగింది. జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలకు అంతే లేకుండా పోతుంది. తాడిపత్రిలో జేసీ దివాకర్ రెడ్డి మున్సిపల్ కార్యాలయంవద్ద వైసీపీ నేతలపై దౌర్జన్యానికి పాల్పడగా వారు తిప్పి పంపించారు.

 

తాజాగా టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు రామగిరిలో ఎన్నికల కోడ్‌ అమలు చేస్తున్న ఎన్నికల అధికారులపై దాడికి పాల్పడ్డారు. ఎన్నికల కోడ్‌ అమలులో భాగంగా రాజకీయ నేతల చిత్ర పటాలపై అధికారులు ముసుగు వేశారు. ఆగ్రహించిన పరిటాల శ్రీరామ్ ఎన్నికల అధికారులను దుర్బాషలాడి వారిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఒక ఎన్నికల అధికారి కాలర్‌ పట్టుకుని శ్రీరామ్‌ బెదిరించాడు. పరిటాల శ్రీరామ్ ఇలా ఎన్నికల అధికారి చొక్కా కాలర్ పట్టుకుని బెదిరించడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుంది. అధికారంలో లేకపోయినా అనంతపురం జిల్లాలో పరిటాల వర్గీయుల అరాచకాలకు అడ్డూ, అదుపూ లేకుండా పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా ఎన్నికల అధికారిని పరిటాల శ్రీరామ్ కాలర్ పట్టుకుని బెదిరించిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.