Cm Ys Jagan : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష (రీసర్వే) పథకం కింద సర్వే పూర్తి అయిన గ్రామాలకు సంబంధించిన రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. 11.00 నుంచి …
Read More »Minister Botsa Sathyanarayana : సామాన్యుడికి న్యాయం జరగాలంటే సీఎం గా జగనే ఉండాలి : మంత్రి బొత్స
Minister Botsa Sathyanarayana : రాష్ట్రంలో సామాన్యుడికి న్యాయం జరగాలంటే సీఎం గా జగనే ఉండాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సహనం కోల్పోయి, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు సహనం కోల్పోయి …
Read More »‘అక్కడ జరగని పాపం లేదు.. అన్యాయాలను ఊహించలేము’
ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో తిరుపతిని సర్వనాశనం చేసిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు సినీ నిర్మాత అశ్వినీదత్. సీతారామం సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ గవర్నమెంట్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ ప్రభుత్వ హయాంలో తిరుపతిలో జరగని పాపం లేదని.. అక్కడ జరిగే అన్యాయాలను ఊహించలేమని అశ్వినీదత్ విమర్శంచారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తారన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు. ఆమధ్య …
Read More »చంద్రబాబుపై సీఎం జగన్ సెటైరికల్ కామెంట్స్..
టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పులను తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మద్యం తయారీకి సంబంధించిన 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలలరీలకు పర్మిషన్ ఇచ్చిన పాపం చంద్రబాబు ప్రభుత్వానిదేనని చెప్పారు. లిక్కర్ పాలసీపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో జగన్ మాట్లాడారు. నవరత్నాలు, అమ్మఒడి.. ఇవన్నీ తమ ప్రభుత్వ బ్రాండ్లని.. ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ ఛాయిస్, భూంభూం బీర్, 999 లెజెండ్, పవర్‌స్టార్ 999 …
Read More »డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్పీచ్.. జగన్ నవ్వులే నవ్వులు
అమరావతి: సారాను విచ్చలవిడిగా ఊరూరా ప్రవహించేలా చేసింది టీడీపీ చీఫ్ చంద్రబాబే అని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. జంగారెడ్డిగూడెం మరణాలపై ప్రభుత్వం ఇచ్చే వివరణను కూడా టీడీపీ సభ్యులు వినిపించుకోకుండా సభలో గందరగోళం సృష్టించారని ఆరోపించారు. శాసనసభలో నారాయణస్వామి మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సారా వ్యవహారంలో రూ.550కోట్లను చంద్రబాబు కొల్లగొట్టారని.. ఆయనపై కేసు కూడా నమోదైందని గుర్తు చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం ఆయనకు బాగా …
Read More »పవన్.. ఇంకెన్నాళ్లు ఈ డిపెండింగ్ పాలిటిక్స్?
‘దరువు.కామ్’ ప్రత్యేక కథనం అది మార్చి 14, 2014.. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా, ప్రముఖ సినీనటుడిగా ఉన్న పవన్‌కల్యాణ్ జనసేన పార్టీని ప్రకటించిన రోజు. తనకు అధికారం ముఖ్యం కాదని.. ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆయన చెప్పారు. దీంతో అటు ప్రజలు,ఇటు అభిమానులు అప్పట్లో పవన్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాలకి.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కి ఎంతో ఉద్ధరిస్తారని జనం భావించారు. సీన్ కట్ చేస్తే ఈ ఎనిమిదేళ్ల జనసేన …
Read More »కేబినెట్‌లో చోటు దక్కకపోతే.. రీషఫిల్‌పై సీఎం జగన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
విజయవాడ: మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ (రీషఫిల్)పై ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈరోజు ఉదయం శాసనసభలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఆ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టే ముందు మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కేబినెట్ రీషఫిల్‌పై సీఎం జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గంలో స్థానం కోసం చాలా …
Read More »వైరల్అయ్యినవన్నీ నిజాలు కానక్కర్లేదు
ఏపీలో చిత్తూరు జిల్లాలో కూతుళ్లతో కాడి పట్టించిన రైతు, అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, సోనూ సూద్ స్పందించి ట్రాక్టర్ పంపించడం… ఈ వ్యవహారం మొత్తం అడ్డం తిరిగింది. — ఆ వీడియోలోని రైతు వీరదల్లు నాగేశ్వరరావు మదనపల్లె టౌన్లో ఉంటారు. కరోనా టైములో పల్లెటూరు సేఫ్ అని వాళ్ళ సొంతూరు వెళ్లారు. — కరోనా టైములో ఒక తీపి గుర్తుగా ఉంటుందని వాళ్లే స్వయంగా నాగలితో ప్రయత్నం …
Read More »జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం జగన్ ఘన నివాళి…!
అహింసా, సత్యాగ్రహాలే ఆయుధంగా అహింసామార్గంలో తెల్లవాడిని తరిమికొట్టి అఖండ భారతావనికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ప్రసాదించిన భారత జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి నేడు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తన నివాసంలో మహాత్ముని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి స్వాతంత్ర్యం అందించిన గొప్ప నాయకుడు మహాత్మాగాంధీ అని స్మరించుకున్నారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన బోధనలైన అహింస, సత్యాగ్రహం, సర్వోదయ కోసం పునరంకితమవుదామని సీఎం వైఎస్ …
Read More »బ్రేకింగ్..ప్రగతి భవన్‌కు చేరుకున్న ఏపీ సీఎం జగన్..!
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం.. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు స్వాగతం పలికారు. ఇరువురు నేతలు మధ్యాహ్న భోజనం కలిసి చేశారు.. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలే లక్ష్యంగా పలు అంశాలను పరస్పర చర్చల ద్వారా స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించుకోవాలని గతంలో ఇరు రాష్ట్రాల సీఎంలు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ రోజు జరిగే భేటీలో ఇద్దరు …
Read More »