Home / POLITICS / Minister Botsa Sathyanarayana : సామాన్యుడికి న్యాయం జరగాలంటే సీఎం గా జగనే ఉండాలి : మంత్రి బొత్స

Minister Botsa Sathyanarayana : సామాన్యుడికి న్యాయం జరగాలంటే సీఎం గా జగనే ఉండాలి : మంత్రి బొత్స

Minister Botsa Sathyanarayana : రాష్ట్రంలో సామాన్యుడికి న్యాయం జరగాలంటే సీఎం గా జగనే ఉండాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సహనం కోల్పోయి, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు సహనం కోల్పోయి సభ్యత లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు సోమవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబుకు వైసీపీని ప్రజలు బలపరుస్తున్నారనే భయం పట్టుకుందన్నారు.

ఏం చేసైనా సరే రాజకీయ లబ్ధి పొందాలన్నదే చంద్రబాబు తపన అని అన్నారు. చంద్రబాబు మాటలు నీచాతి నీచంగా ఉన్నాయయని.. ఆయనొక్కడే నిజాయితీ, సచ్చీలుడిలా మాటాడుతున్నారని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. ఈ వయసులో చంద్రబాబు ఎందుకు సహనం కోల్పోతున్నారని ప్రశ్నించారు. తమకు కూడా మాటలు వచ్చని.. రాజ్యాంగాన్ని గౌరవించబట్టే మాటాడటం లేదన్నారు. ప్రతి చిన్న అంశాన్ని చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పారు.

తమకు చంద్రబాబు మాదిరిగా అబద్దాలు, ఫ్యాబ్రికేట్ చేస్తూ పబ్లిసిటీ చేస్తూ మాటాడాల్సిన‌ పనిలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము చేసిన పనులు చెప్పుకుంటే చాలని పేర్కొన్నారు. కాగా ఈరోజు నరసాపురం నియోజకవర్గ పర్యటనలో సుమారు 3వేల 197 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారు. అలానే ప్రతిపక్ష నాయకులపై కూడా తనదైన స్టైల్లో ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కబోతున్నాయని ప్రస్తుత పరిస్థితులు చూస్తే అర్దం అవుతుంది.

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar