మూర్ఛతో కూతురు చనిపోయిందని భావించిన ఆ తల్లిదండ్రులకు రెండున్నరేళ్ల మనవరాలు చెప్పిన మాటలు విని కుప్పకూలిపోయారు. తాత.. అమ్మ గొంతును నాన్న ఇలా నొక్కాడు.. అని రెండు చేతులను తన మెడ దగ్గర పెట్టి చెప్పింది ఆ చిన్నారి. అమ్మ ఎలా చనిపోయింది.. నాన్న ఏం చేశాడో ఆ చిన్నారి వచ్చిరాని మాటలు, సైగలతో వివరించడంతో తాత గుండె ఆగినంతపనైంది. ఒడిశాలోని ఉమ్మర్‌కోట్ సమితి సిలాటిగావ్ గ్రామానికి చెందిన మాణిక్ …
Read More »30 ఏళ్ల వ్యక్తితో ఏడో తరగతి పిల్లకి పెళ్లి.. ప్రెగ్నెంట్ అయి మృతి
అభం శుభం తెలియని ఆ బాలికను 30 ఏళ్లకు పైగా వయసున్న ఓ వ్యక్తి ఇచ్చి పెళ్లి చేయగా ప్రెగ్నెంట్ అయిన అమ్మాయి కడుపులో బిడ్డతో సహా చనిపోయింది. ఈ దారుణమైన ఘటన కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో జరిగింది. చల్లపల్లి మండలం పురిటిగడ్డ ప్రాంతానికి చెందిన ఓ ఎస్సీ బాలిక 7వ తరగతి చదువుతోంది. ఆమె తండ్రి మరణించడంతో బాలికను తల్లి బందరు శారదానగర్‌కు చెందిన 30 ఏళ్లు దాటిన …
Read More »ఠాగూర్ హాస్పిటల్ సీన్ రిపీట్.. చనిపోయిన ప్రెగ్నెంట్‌కి వైద్యం..!
గవర్నమెంట్ హాస్పిటల్‌లో చనిపోయిన ఓ వ్యక్తికి డబ్బులు కోసం వైద్యం చేస్తున్నట్లు తెగ హడావుడి చేస్తారు ఓ ప్రైవేట్ హాస్పిటల్ వైద్యలు.. ఫైనల్‌గా సారీ మేము చాలా ట్రై చేశాం.. కానీ మీ అన్నయ్య చనిపోయారు.. అని చెప్పాడు ఓ డాక్టర్.. ఏంటిది ఎక్కడో చూసినట్లు.. విన్నట్లు అనిపిస్తోందా.. అదేనండి.. ఠాగూర్ సినిమాలో చాలా ఫేమస్ అయిన హాస్పిటల్ సీన్ ఇది. అచ్చం దీన్నే రిపీట్ చేసేశారు ఆమనగల్లు పట్టణంలోని …
Read More »చితక్కొట్టి.. చిత్రహింసలు పెట్టి.. చిన్నపిల్లాడ్ని చంపేసిన మేనత్త-మామ..!
వైయస్‌ఆర్ జిల్లా కేంద్రం కడపలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. పదేళ్ల పిల్లాడ్ని మేనత్త, మామ చిత్రహింసలు పెట్టి చంపేశారు. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం కోనంపేటకు చెందిన శివ సోదరి ఇంద్రజ.. అంజన్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ఇది నచ్చక శివ సోదరితో మాట్లాడటం మానేశాడు. ఇంద్రజ భర్త అంజన్ కుమార్ కడపలోని ఓ ప్రవేట్ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. వీరికి కూతురు పుట్టగానే అందరూ …
Read More »టపాసుల్లా పేలిన 100 గ్యాస్ సిలిండర్లు
వరుసగా ఒకదాని తర్వాత మరొకటిగా గ్యాస్ సిలిండర్లు పేలిన ఘటన ప్రకాశం జిల్లాలోని కొమరోలు మండలం దద్దవాడ గ్రామంలో చోటుచేసుకుంది. కర్నూలు నుంచి ఉలవపాడుకు 306 సిలిండర్లతో వెళ్తున్న ఓ లారీలో షార్ట్ సర్కూట్ కావడంతో 100 సిలిండర్లు ఒక్కసారిగా పేలాయి. భయంతో డ్రైవర్ అక్కడి నుంచి దూరంగా పారిపోయాడు. ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడి రోడ్డు మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది.
Read More »కేటీఆర్‌కు ఏపీ దివ్యాంగ బాలిక అరుదైన గిఫ్ట్
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్‌కి ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన దివ్యాంగ డ్రాయింగ్ ఆర్టిస్ట్ స్వప్నిక్ అరుదైన గిఫ్ట్ ఇచ్చారు. చిన్నతనంలో విద్యుత్‌షాక్‌తో రెండు చేతులూ కోల్పోయిన స్వప్నిక.. నోటితోనే పెయింటింగ్స్ వేయడం నేర్చుకున్నారు. సందర్భాన్ని బట్టి పొలిటికల్ లీడర్స్, సినీ హీరోల డ్రాయింగ్‌ను ఆమె వేస్తూ ఉంటుంది. కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆయన చిత్రపటాన్ని స్వప్నిక గీసింది. కేటీఆర్ చేసే సేవా కార్యక్రమాలు.. ముఖ్యంగా పంజాబ్‌కు …
Read More »ఏపీ సీఎం జగన్ పై గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుందని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. 1956 నుంచే తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా జలాలను దోపిడీ చేస్తున్నారని వెల్లడించారు. వైఎస్సార్ హయంలో పోతిరెడ్డిపాడు నుంచి 55 వేల క్యూసెక్కుల నీటిని దోపిడీ చేశారని, అప్పట్లోనే తాము వ్యతిరేకించామన్నారు. ఇప్పుడు జగన్ కూడా కృష్ణ జలాలను దోచుకుపోవాలనే దుర్భుద్ధితో వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. నల్లగొండలోని …
Read More »ఏపీలో కొత్తగా 10,373 కరోనా కేసులు
ఏపీలో గత 24 గంటల్లో 88,441 మందికి కరోనా టెస్టులు చేస్తే 10,373 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న 80 మంది కరోనాతో మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 17,49,363కు చేరగా ఇప్పటివరకు 11,376 మంది చనిపోయారు. ప్రస్తుతం 1,28,108 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 15,958 మంది కరోనాను జయించారు. మొత్తం 16,09,879 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Read More »ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది, కల్వర్టును ఢీకొని ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు యాక్సిడెంట్ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను సమీప ఆస్పత్రికి తరలించారు. 29 మంది ప్రయాణికులతో.. బస్సు కర్నూలు నుంచి విజయవాడకు …
Read More »ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో పనిచేసే ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కొత్త ఏడాది కానుక అందించింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఉద్యోగులకు శుక్రవారం ఉచిత బస్ పాస్టు అందించారు. ఈ ఉచిత బస్ పాస్లు వారి నివాస స్థలం నుంచి 25 కిలో మీటర్లలోపు ప్రయాణానికి వర్తిస్తాయి. ఈ పాస్ల వల్ల 5 వేల మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందికి లబ్ధి చేకూరనుంది.
Read More »