ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపాలని, కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలను కేంద్ర ప్రభుత్వ పెద్దలు మానుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించే కుట్రలను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉందని మండిపడ్డారు. ఇప్పటికే వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయాలన్న కుట్రలను ఎప్పటికప్పుడు అక్కడి కార్మికులు, అనేక ఇతర సంఘాలు, …
Read More »మహిళల గురించి మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు
ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన వైసీపీ ఓడిపోతే మొదటి బుల్లెట్ మహిళలకే తగులుతుందని వైసీపీ సీనియర్ నేత.. ప్రస్తుత మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకుంటే మీ చేతిని మీరే నరుకున్నవారవుతారని ఆయన చెప్పారు. కొంగున డబ్బుంటేనే మీ వెంట భర్త ఉంటాడని హితవు పలికారు. ప్రభుత్వం మహిళలకు సహాయం చేయడం కొందరికి ఇష్టం లేదు. వైసీపీ పోవాలని వారు …
Read More »అసెంబ్లీ ఎన్నికల బరిలో అశోక్ గజపతిరాజు
ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన అత్యంత సీనియర్ నేత అశోక్ గజపతిరాజు మళ్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉమ్మడి ఏపీ విభజన తర్వాత 2014లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఎంపీగా గెలిచి, కేంద్రమంత్రిగా ఆయన పనిచేశారు. అయితే ఆ తర్వాత ఆయన 2019లో పోటీకి దూరంగా ఉన్నారు. ఆయన కూతురు అదితి విజయనగరం అసెంబ్లీ సీటు నుంచి పోటీచేసి, ఓడిపోయారు. మళ్లీ గజపతిరాజు …
Read More »పుట్టపర్తిలో వేడెక్కిన రాజకీయం
ఏపీలో పుట్టపర్తిలో అధికార పార్టీ అయిన వైసీపీ.. ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. అభివృద్ధిపై పేటెంట్ హక్కులు మాకే ఉన్నాయంటూ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ చెబుతున్నారు. తాము వచ్చాకే అభివృద్ధి జరిగిందంటున్నారు ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమంటూ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి సవాల్ విసిరారు. సత్తెమ్మ ఆలయం వద్ద తేల్చుకుందామంటూ పల్లె ప్రతిసవాల్ చేశారు. అలర్టైన పోలీసులు ఆలయం …
Read More »ఏపీలో బీజేపీ జాతీయ కార్యదర్శి వాహనంపై దాడి
ఏపీ అమరావతిలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వాహనంపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు యాక్షన్ మొదలు పెట్టారు. తాళ్లాయపాలెంలో నిందితుడు దున్న నితిన్ ను అరెస్టు చేశారు. అతనే వాహనంపై రాయి విసిరినట్లు పోలీసులు పేర్కొన్నారు. రాజధాని రైతులకు మద్దతు ప్రకటించేందుకు అమరావతి వెళ్తుండగా మూడు రాజధానుల మద్దతుదారులు సత్య కుమార్ వాహనంపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Read More »ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు-8మంది అరెస్ట్
గుజరాత్లోని అహ్మదాబాద్ లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ‘మోదీ హటావో, దేష్ బచావో’ పేరుతో నిందితులు ఈ పోస్టర్లు ముద్రించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కాగా, ఇటీవల ఢిల్లీలోనూ ఈ తరహా పోస్టర్స్ గుర్తించిన అధికారులు.. 185 కేసులు నమోదు చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు.
Read More »రాహుల్ గాంధీపై ఈసీ అనర్హత వేటు
వయనాడ్ ఎంపీ ఎన్నికల్లో పోటీచేసి లెక్కలు సమర్పించని అభ్యర్థిపై ఈసీ అనర్హత వేటు వేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై స్వతంత్ర అభ్యర్థి కే.ఇ రాహుల్ గాంధీ పోటీ చేశారు. 2196 ఓట్లు తెచ్చుకున్నారు. అయితే ఎన్నికల ఖర్చుల వివరాలను ఈసీకి సమర్పించకపోవడంతో ఆయనపై అనర్హత వేటు వేసింది. కే.ఇ రాహుల్గాంధీ 2024 సెప్టెంబర్ 13వరకు ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఈసీ తాజాగా ప్రకటించింది.
Read More »ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కి అస్వస్థత
ఏపీలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. నియోజకవర్గంలోని తన నివాసంలో ఉండగా గుండెనొప్పి రావడంతో వైద్యులను పిలిపించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స అందిస్తున్నారు.. అయితే మరింత మెరుగైన చికిత్స కోసం చెన్నై తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత నెలలో కూడా గుండెలోని వాల్వ్ బ్లాక్ కావడంతో చికిత్స అందించారు.
Read More »ఏప్రిల్ 8న తెలంగాణకు ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఏప్రిల్ ఎనిమిదో తారీఖున తెలంగాణ పర్యటనకు రానున్నరు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రంలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను వచ్చే ఏప్రిల్ 8న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ పనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోదీ రానున్నట్లు వెల్లడించారు. మరోవైపు అదే రోజు సికింద్రాబాద్- తిరుపతి వందేభారత్ రైలును ప్రధాని జెండా ఊపి ప్రారంభించనున్నారని, ఇందుకోసం ఏర్పాట్లు …
Read More »కర్ణాటక ఎన్నికల్లో హిస్టరీ రిపీట్ అవుతుందా..?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో అధికార బీజేపీతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్ లు అధికారం చేపట్టేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. అయితే కన్నడిగుల తీర్పు పరిశీలిస్తే మాత్రం 1985 నుంచి జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి వరుసగా రెండోసారి అధికారం ఇచ్చిన సందర్భం లేదు. గత 38 ఏళ్లుగా అధికారం చేతులు మారుతూ వస్తోంది. దీంతో ఈసారి ఎన్నికల్లో హిస్టరీ రిపీట్ అవుతుందా లేక ఫుల్ స్టాప్ పడుతుందా వేచి …
Read More »