అబద్ధాలకు, కుటిలనీతికి కాలం చెల్లిపోతున్నదా? అభివృద్ధి, సంక్షేమానికే హుజూరాబాద్ ఓటర్లు ఓటు వేయబోతున్నారా? ఇంటిపార్టీకే అండగా నిలువాలని నిర్ణయించుకొన్నారా? హుజూరాబాద్‌లో ఎవరి నోట విన్నా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్‌పై అచంచలమైన విశ్వాసం విస్పష్టంగా కనిపిస్తున్నది. ఉప ఎన్నిక ఏకపక్షంగా జరుగబోతున్నదని తేలిపోయింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ గెలుపు ఖాయమైందని టీఆర్‌ఎస్ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. మోయలేని భారంగా మారిన గ్యాస్‌బండకు దండం పెట్టి బీజేపీని కోదండమెక్కించాలని …
Read More »నల్ల చట్టాలు మాకొద్దు … కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు అక్షయపాత్ర
కెనడాలో ఉన్న అత్యంత పెద్దదైన ఎత్తిపోతల పథకానికి మించి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ప్రపంచ రికార్డును అధిగమించారని ప్రముఖ సినీ నటుడు, దర్శక, నిర్మాత ఆర్ నారాయణమూర్తి అన్నారు. జనగామలో స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులతో కలిసి ఓ థియేటర్‌లో ‘రైతన్న’ సినిమాను తిలకించారు.ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు దేశం కట్టింది కాదన్నారు. వేరుపడి బాగుపడుతున్న ఒక రాష్ట్రం సొంతంగా …
Read More »600 ఇయ్యనోళ్లు.. 3 వేల పింఛన్ ఇస్తరా?
‘గుజరాత్‌లో రూ.600 పింఛన్ ఇయ్యనోళ్లు హుజూరాబాద్‌లో మాత్రం రూ.3వేలు ఇస్తరట. అక్కడ ఇయ్యనోళ్లు ఇక్కడ ఇస్తరా? గీ బీజేపీ మ్యానిఫెస్టో చూస్తుంటే నవ్వాలో, ఏడ్వాలో అర్థమైతలే’ అని ఆర్థికమంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. అన్ని సర్వేల్లో గెల్లు శ్రీనివాస్ గెలుస్తాడని తెల్వడంతో ఓడిపోతామనే భయంతో బీజేపీవాళ్లు సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంటలో నిర్వహించిన ధూంధాంకు టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్, …
Read More »పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఈ కనీస సోయి కూడా లేనట్టుంది
అబద్ధమాడినా అతికినట్టుండాలి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఈ కనీస సోయి కూడా లేనట్టుంది.. అందుకే ఏకంగా తెలంగాణ అమరవీరులను కేసీఆర్.. టీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా స్మరించుకోలేదంటూ నీచమైన ప్రచారానికి ఒడిగట్టారు. టీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశాన్ని ప్రపంచంలోని కోట్లమంది తెలంగాణ వాదులు ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. కేసీఆర్ ఏం మాట్లాడారో.. సభలో ఏం జరిగిందో కండ్లారా చూశారు. సమావేశం ఘనంగా జరిగిన తీరు చూసి రేవంత్‌కు ఏం మాట్లాడాలో పాలుపోలేదేమో.. …
Read More »ఈటల రాజేందర్ అబద్ధాల పరాకాష్ట
వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయిందట! ఇప్పుడు ఈటల కూడా వంద అబద్ధాలు ఆడుతూ ఏదోవిధంగా గట్టెక్కాలని చూస్తున్నాడు. అబద్ధాలను ప్రచారం చేయడం.. అడ్డంగా దొరికిపోవడం ఆయనకేకాదు.. ఆయన పార్టీ బీజేపీ నేతలకు అలవాటైపోయింది. అందరికంటే రాజేందర్ రెండాకులు ఎక్కువే చదివినట్టున్నారు. కొన్నాళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా వెలగబెట్టిన ఈ నేత.. ఓట్లకోసం చౌకబారు ప్రచారానికి తెగబడ్డారు. టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన్నాటినుంచీ తన ఉనికిని కాపాడుకోవడం …
Read More »పట్టాభిరామ్‌కు ఏపీ హైకోర్టు బెయిల్
ఏపీ సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు కేసులో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పట్టాభిరామ్ ప్రస్తుతం రాజమహేంద్రవరం జైలులో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఏపీ సీఎంపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బుధవారం రాత్రి విజయవాడ పోలీసులు పట్టాభిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Read More »Huzurabad By Poll-ఓటమి భయంతో బీజేపీ కుట్రలు
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ముప్పై న ఉప ఎన్నికల పోలింగ్ జరగనున్న హుజూరాబాద్‌లో ఏంచేసినా తమ పాచిక పారట్లేదన్న నైరాశ్యంతో బీజేపీ నాయకులు ఇల్లందకుంట మండ లం సిరిసేడులో కొత్త లొల్లికి తెరదీశారు. గ్రామంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తరఫున కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించారు. ప్రచారం స్థానిక టీఆర్‌ఎస్ కార్యాలయం వద్దకు చేరుకోగానే బీజేపీ శ్రేణులు సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. అక్కడే …
Read More »ప్రజలంటే మోదీకి ఇంత ఈసడింపా?-వ్యాసకర్త: శ్రీ చంటి క్రాంతికిరణ్( అందోల్ ఎమ్మెల్యే)
ఈటలకు వ్యక్తిగా ఓటు వేయడం వల్ల అదనంగా హుజూరాబాద్‌కు లేదా బీజేపీ జాతీయ పార్టీ కనుక తెలంగాణకు జరిగే ప్రయోజనం ఏమిటీ? ఈటల, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీని వేర్వేరుగా చూడాలా? రాజేందర్‌కు వేసినా, బీజేపీకి వేసినా.. ప్రజలకు కీడు చేస్తున్నవారిని ఏరికోరి మరీ నెత్తిన పెట్టుకున్నట్లు కాదా..! కొందరు వీరావేశంతో బీజేపీని, మోదీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. దేశంలో ఏవో అద్భుతాలు చేశారని, భవిష్యత్తులో చేయబోతున్నారని అంటున్నారు. వాస్తవానికి మోదీ …
Read More »దళిత బంధు పై బీజేపీ కుట్ర – ఎమ్మెల్యే అరూరి
తెలంగాణ ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి తీసుకొచ్చిన పథకం దళిత బంధు పథకాన్ని బీజేపీ కుట్రలు చేసి ఆపిందని అన్నారు జమ్మికుంట రూరల్ ఇంచార్జి వర్ధనపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు బుధవారం జమ్మికుంట మండలంలోని మాచనపల్లి మరియు నాగంపేట దళిత కాలనిలో నిర్వహించిన దళిత ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే లు చిరుమర్తి లింగయ్య మరియు గాదరి కిషోర్ తో కలిసి పాల్గొన్నారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడ్తు తెలంగాణ రాష్ట్ర …
Read More »దళిత ద్రోహి ఈటల రాజేందర్-MLA క్రాంతి కిరణ్
దళిత బంధును అడ్డకుంటున్న దళిత ద్రోహి ఈటల రాజేందర్ అని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. మంగళవారం జోగిపేట పట్టణంలోని నాందేడ్ – అఖోల ప్రధాన రహదారిపై ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ నాయకులు ఈటల దిష్ట బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రాష్ట్రంలోని దళితులపై ప్రేమ ఉంటే ప్రతి దళిత కుటుంబానికి బీజేపీ కేంద్రప్రభుత్వం రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల …
Read More »