Home / SLIDER / ఖాయమైన గెల్లు శ్రీను గెలుపు

ఖాయమైన గెల్లు శ్రీను గెలుపు

అబద్ధాలకు, కుటిలనీతికి కాలం చెల్లిపోతున్నదా? అభివృద్ధి, సంక్షేమానికే హుజూరాబాద్‌ ఓటర్లు ఓటు వేయబోతున్నారా? ఇంటిపార్టీకే అండగా నిలువాలని నిర్ణయించుకొన్నారా? హుజూరాబాద్‌లో ఎవరి నోట విన్నా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్‌పై అచంచలమైన విశ్వాసం విస్పష్టంగా కనిపిస్తున్నది. ఉప ఎన్నిక ఏకపక్షంగా జరుగబోతున్నదని తేలిపోయింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ గెలుపు ఖాయమైందని టీఆర్‌ఎస్‌ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. మోయలేని భారంగా మారిన గ్యాస్‌బండకు దండం పెట్టి బీజేపీని కోదండమెక్కించాలని ఓటర్లు నిశ్చయించుకొన్నట్లు అర్థమవుతున్నది. నియోజకవర్గంలో జరిగిన అన్ని సర్వేలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

దుమ్ము రేపిన కారు
హుజూరాబాద్‌ ఉపఎన్నిక ప్రచారంలో కారు దుమ్మురేపింది. నోటిఫికేషన్‌ వెలువడినప్పటి నుంచి టీఆర్‌ఎస్‌ శ్రేణులు దూకుడు ప్రదర్శించాయి. బీజేపీ అసత్యాలను దీటుగా తిప్పికొట్టాయి. కేంద్రం నిరంతరం పెంచుతున్న నిత్యావసరాల ధరలు, ప్రత్యేకించి గ్యాస్‌ ధరల పెంపుపై ఆగ్రహంతో ఉన్న హుజూరాబాద్‌ ఆడబిడ్డలు బీజేపీకి గుణపాఠం చెప్పి, కారు గుర్తుకు ఓటేస్తామని ప్రచార సభల్లో బాహాటంగానే తేల్చి చెప్పారు. తాము ‘ఓటేసేమందు గ్యాస్‌ బండకు దండంపెట్టి బీజేపీని కోదండం’ ఎక్కిస్తామని ఓటర్లు తమకు చెప్పారని దూదేకుల సంఘం జాతీయ ఇంచార్జి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు షేక్‌ హసీనా పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంటింటా కేసీఆర్‌ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో లబ్ధిపొందినవాళ్లే ఉన్నారని, వారంతా టీఆర్‌ఎస్‌కు తప్ప మరోపార్టీకి ఓటేయబోమని తేల్చిచెప్పారని రాష్ట్ర రజక సంఘాల సమితి ప్రధాన సలహాదారు కొండూరి సత్యనారాయణ చెప్పారు.

సీఎం కేసీఆర్‌ మా రక్తం పంచుకొని పుట్టకపోయినా.. మా బతుకులను బాగుచేసేందుకు దళితబంధు తెచ్చారని.. కేసీఆర్‌ మాటే తమ బాట అని లబ్ధిదారులు గరిగె చంద్రయ్య, పులాల సంజీవయ్య, తలారి శంకరయ్య చెప్పారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు మద్దతు వెల్లువలా వచ్చింది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్‌ కృష్ణయ్య నేతృత్వంలో 120 బీసీ సంఘాలు క్షేత్రస్థాయిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు మద్దతు తెలిపాయి. బీసీలకు అన్యాయం చేసిన కాంగ్రెస్‌, బీజేపీలకు గట్టి గుణపాఠం చెప్పాల్సిందేనని ఆయా సంఘాలు విస్తృత ప్రచారం నిర్వహించాయి. ఈటల బీసీ ముసుగేసుకున్న దొర అనే వాతావరణం నెలకొన్నదని, దీంతో బీసీలంతా కారు గుర్తుకు ఓటేసేందుకు సిద్ధమయ్యారని బీసీ నేతలు చెప్తున్నారు.

బీజేపీపై యూత్‌ ధూం..ధాం..
ప్రచారంలో యువకులు అన్నీ తామై బీజేపీ తప్పుడు ప్రచారాలను ఎక్కడిక్కడ నిలువరించగలిగారని టీఆర్‌ఎస్‌ నేతలు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్‌, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఈటల ఉన్నారన్న గుట్టును రట్టు చేయడంలో సఫలమయ్యారని పేర్కొన్నారు. ఈటల.. తన రాజకీయ పుట్టుకకు, ఎదుగుదలకు టీఆర్‌ఎస్‌, కేసీఆరే అన్నది విస్మరించి.. వెన్నుపోటు పొడిచిన తీరును యువకులు ఇల్లిల్లూ తిరిగి ప్రచారం చేశారు.

గెల్లుదే విజయం..
టీఆర్‌ఎస్‌ ఈ ఉపఎన్నికలో మొదట్నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. ఉద్యమంలో పనిచేసిన విద్యార్థి నేత గెల్లును ఇక్కడ బరిలో దించింది. నిరుపేద అయిన గెల్లుకు ఎన్నికల ఖర్చును ఇచ్చి తన ప్రత్యేకతను చాటింది. అక్కడే బీజేపీ బిత్తరపోయింది. మచ్చలేని వ్యక్తి కావడంతో గెల్లుపై విమర్శలకు అవకాశం లేకుండా పోయింది. గెల్లుకు టీఆర్‌ఎస్‌ టికెట్‌ ప్రకటించడంతో యువత, విద్యార్థులు సానుకూలంగా స్పందించారు. ఆయన గెలుపుతో కొత్తతరం రాజకీయాలకు హుజూరాబాద్‌ వేదిక అవుతుందని నమ్ముతున్నారు.

టీఆర్‌ఎస్‌పైనే విశ్వసనీయత
నోటిఫికేషన్‌కు ముందు హుజూరాబాద్‌లో రాజకీయ వాతావరణం టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య నువ్వా, నేనా? అన్నట్లు అనిపించింది. బీజేపీ విధానాలు, ఆ పార్టీ అభ్యర్థి ఈటల అసలు రూపం బయటపడుతున్నకొద్దీ సమీకరణాలు మారిపోయాయి. కమలం పార్టీ నేతలు ఒక్కొక్కరుగా టీఆర్‌ఎస్‌ బాట పట్టారు. ఈటల భూకబ్జాలు, ఇతరులతో ఆయన అనుసరించే తీరు, కేంద్ర ప్రభుత్వ విధానాలతో ప్రజలకు, ముఖ్యంగా పేదలకు, రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని టీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రజలకు చేర్చగలిగాయి. అన్నీ బేరీజు వేసుకొన్న ఓటర్లు గెల్లును గెలిపించాలని నిర్ణయించుకొన్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రైతు సంక్షేమానికి అండగా ఉండే టీఆర్‌ఎస్‌కు అండగా నిలవాలని ఓటర్లు నిర్ధారించుకున్నట్లు సర్వేల్లో తేలిసింది. దళితబంధు పథకం కింద బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం రూ.10 లక్షల జమ చేయడంతో సాధికారత సాధిస్తున్న దళితులు టీఆర్‌ఎస్‌కు మద్దతు పలుకుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

అసలు రంగును గుర్తించారు.
ఇన్నాళ్లు వామపక్షవాదిని చెప్పుకుంటూ, బీజేపీ కనుమరుగవుతుందని శాపనార్థాలు చెప్పిన రాజేందర్‌.. సొంత ప్రయోజనాల కోసం, ఆస్తులు, భూముల రక్షణ కోసం కాషాయ పార్టీలో చేరడంతో మాజీ మంత్రి నిజస్వరూపాన్ని హుజూరాబాద్‌ ప్రజలు తెలుసుకున్నారు. ఈటల తీరును టీఆర్‌ఎస్‌ ప్రజలకు వివరించింది. ప్రజల నుంచి దీనిపై సవాళ్లు రావడంతో రాజేందర్‌.. వితండవాదాలకు దిగిన ఈటల.. అధికారం తనకు ఎంత ముఖ్యమో చెప్పారు. దాంతో ఆయన అసలు రంగు అందరికీ స్పష్టమైంది. ఇదే ద్వంద్వ వైఖరిని పేదల సంక్షేమ పథకాలపైనా వ్యవహరించారు ఈటల. దళిబంధుపై ఈసీకి ఫిర్యాదు చేసి, తాత్కాలికంగా ఆపించారు. ప్రత్యేకించి ఈ పరిణామం దళితుల్లో ఆగ్రహాన్ని మరింత రాజేసింది. వెరిసి.. సబ్బండ వర్ణాలను టీఆర్‌ఎస్‌కు మరింత దగ్గర చేసింది.

బీజేపీకి తాకిన ధరల మంట
దళితబంధును ఆపేందుకు జరిగిన కుట్రలు.. నిత్యం పెరుగుతున్న వంటగ్యాస్‌, పెట్రోల్‌, డీజీల్‌ ధరలు.. సామాన్యులు, మధ్య తరగతి ఆవేదన, రైతు వ్యతిరేక చట్టాలు, ప్రశ్నించిన రైతులను పొట్టన పెట్టుకున్న తీరు, వడ్ల కొనుగోలుపై విముఖత వంటి అంశాలు బీజేపీకి ప్రతికూలంగా మారాయని సర్వేలు చెప్తున్నాయి. హుజూరాబాద్‌ గడ్డపై మతతత్వ పార్టీకి ఏ ఎన్నికల్లోనూ డిపాజిట్‌ దక్కకపోవడం, ప్రజల్లో ఆ పార్టీపై ఉన్న వైఖరిని తెలియజేస్తున్నదని సర్వేల ఆధారంగా విశ్లేషకులు అంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat