పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్‌కు కేంద్ర ప్రభుత్వం ‘జెడ్’ కేటగిరీ భద్రత కల్పించింది. మంగళవారం నుంచి ఆయన భద్రత బాధ్యతను సీఐఎస్‌ఎఫ్ తీసుకున్నది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఈ నెల 13న ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర 24 పరగణాల జిల్లా పరిధిలోని జగదల్‌లోని బారాక్‌పూర్ ఎంపీ అర్జున్‌సింగ్ నివాసం వద్ద మంగళవారం ఉదయం మరో బాంబు పేలింది. ఆయన ఇంటికి …
Read More »బీఎస్‌ఎన్‌ఎల్ పోయి.. రిలయన్స్ జియో వచ్చింది
బీజేపీపై తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి హరీష్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కేంద్రంలో బీజేపీ వచ్చాక బీఎస్‌ఎన్‌ఎల్ పోయి.. రిలయన్స్ జియో వచ్చిందని హరీష్‌రావు అన్నారు. రేపు ఎల్‌ఐసీ పరిస్థితి అదే కాబోతుందన్నారు. ఎల్‌ఐసీని ప్రైవేటీకరణ చేసిన బీజేపీకి గుణపాఠం చెప్పాలన్నారు. హుజురాబాద్‌లో బీజేపీ గెలిస్తే అభివృద్ధి జరగదని హరీష్‌రావు పేర్కొన్నారు. ఎంపీగా బండి సంజయ్ కనీసం 10 లక్షల పని చేశాడా అని హరీష్‌రావు ప్రశ్నించారు. ఎంపీగా …
Read More »గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్
అంతా ఊహించినట్టుగానే గుజరాత్‌లో బీజేపీ హైకమాండ్ పటేల్ సామాజిక వర్గంవైపు మొగ్గుచూపింది. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ను ( Bhupendra Patel ) ఎంపికచేసింది. ఇవాళ గాంధీనగర్‌లో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా భూపేంద్ర పటేల్‌ను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. భూపేంద్ర పటేల్ పేరును మాజీ సీఎం విజయ్ రూపానీ ప్రతిపాదించగా మిగతా ఎమ్మెల్యేలంతా ఆమోదించారు. కేంద్ర పరిశీలకుడు నరేంద్రసింగ్ తోమర్ భూపేంద్ర పటేల్‌ను …
Read More »మీ ఓటు ఎటువైపు.. కుట్టు మిషన్లకా.. కళ్యాణలక్ష్మికా..?
మీ ఓటు ఎటువైపు.. కుట్టు మిషన్లకా.. కళ్యాణలక్ష్మికా..? అరవై రూపాయాల గోడ గడియారానికా.. కేసీఆర్ కిట్‌కా..? రూపాయి బొట్టుబిళ్లకా.. రూ.2016 పెన్షన్లకా..? అని మంత్రి హరీశ్‌రావు ఓటర్లను ఉద్దేశించి అడిగారు. వీటిలో ఏది ఉపయోగమో ఆలోచించాలని ఓటర్లకు ఆయన సూచించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని దమ్మక్కపేటలో యాదవ భవన నిర్మాణ పనులకు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. గెల్లు శ్రీను ఉద్యమకారుడు. 20 ఏండ్లు …
Read More »విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో రాగిజావ, బెల్లం, మొలకలు
కరోనా నేపథ్యంలో విద్యార్థులకు అదనపు పోషకాహారం అందించేందుకు చర్యలు చేపట్టారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు రాగిజావ, బెల్లం, లేత మొలకలను అందించనున్నారు. ఇందుకు కేంద్ర విద్యాశాఖ సైతం ఆమోదం తెలిపింది. 2021-22 మధ్యాహ్న భోజన పథకం ప్రాజెక్ట్ ఆమోదిత మండలి (పీఏబీ) మినట్స్‌ను ఇటీవలే కేంద్రం విడుదల చేసింది. ఈ ఏడాదికి 16,828 పాఠశాలల్లో 59 రోజులపాటు 7.75 లక్షల మందికి రాగిజావ, 7,277 పాఠశాలల్లో 61 …
Read More »మాజీ మంత్రి ఈటల కొత్త ఎత్తుగడ
హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు వస్తున్న ఆదరణతో బెంబేలెత్తిపోయిన ఈటల రాజేందర్ తాజాగా దళితులను రెచ్చగొట్టి సొమ్ము చేసుకొనేందుకు కుయుక్తులు పన్నుతున్నట్టు తేలిపోయింది. బీజేపీ జెండా, ఈటల బొమ్మ ఉంటుంది. కానీ వాహనం మాత్రం నీలిరంగులో ఉంటుంది. ఎక్కడా బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకుల ముఖాలు మచ్చుకు కూడా కనిపించవు. ఈ వాహనాలను బుధవారమే రంగంలోకి దింపారు. బుధవారం సాయంత్రం శంభునిపల్లి గ్రామానికి రంగుమార్చుకొన్న ప్రచార రథాలు చేరుకొన్నాయి. వాడవాడల్లో తిరుగుతూ.. దళితబంధు …
Read More »ఆస్తులు అమ్మి అచ్ఛేదిన్ అంటారా?
కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను టోకుగా అమ్మకానికి పెట్టింది. ఆర్థికలోటు తీవ్రంగా ఉన్నందున ప్రజల ఆస్తులను ఆమ్మాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ అమ్మకం దశలవారీగా కొనసాగుతుందని చెప్పారు. దేశంలోని ప్రతి రంగంలో ప్రైవేటీకరణకు అనుమతిస్తున్నట్లు ప్రకటించడం హాస్యాస్పదం.సహజ వనరులైన గనులు మొదలుకొని రోడ్లు, ప్రాజెక్టులు, కంపెనీలను అమ్మబోతున్నట్లు కేంద్రం ప్రకటించటం గర్హనీయం. ఈ స్థాయిలో గతంలో ఏ ప్రభుత్వమూ ఆస్తులను ప్రైవేటుకు అప్పగించలేదు, అమ్మకానికి పెట్టలేదు. …
Read More »బీజేపీ దరఖాస్తు ఉద్యమంపై మంత్రి కేటీఆర్ సెటైర్
బీజేపీ నేతలు తలపెట్టిన దరఖాస్తుల ఉద్యమంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రధాని మోదీ హామీ ఇచ్చిన రూ.15 లక్షల కోసం దరఖాస్తులు ఆహ్వానించడాన్ని స్వాగతిస్తున్నట్లు ట్వీట్ చేశారు. అర్హులైన తెలంగాణ వాసులంతా బీజేపీ నేతలకు దరఖాస్తులు పంపాలని.. జన్‌ధన్ ఖాతాల్లోకి ధనాధన్ డబ్బులు వస్తాయంటూ సెటైర్ వేశారు.
Read More »దళితబంధు ఇప్పటిది కాదు..25ఏండ్ల క్రితం నాంది పలికా-సీఎం కేసీఆర్
దళితబంధు తమాషా అనుకోవద్దు. పెద్ద బాధ్యత అప్పగిస్తున్న. దళితబంధు ఈ రోజు పుట్టింది కాదు. 25 ఏండ్లుగా నా మస్తిష్కంలో నిక్షిప్తమై ఉంది. నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే, 25 ఏండ్ల క్రితం దళిత చైతన్య జ్యోతికి శ్రీకారం చుట్టిన. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అనాడే పాటలు రాసిండు. కొన్ని ప్రయత్నాలు చేశాం. ఎమ్మెల్యేగా నా మొట్టమొదటి సంతకంతో దళితబిడ్డ, నా క్లాస్‌మేట్ దానయ్యను మార్కెట్ కమిటీ చైర్మన్‌గా చేశా. …
Read More »కొత్త బ్యాంకు ఖాతాల్లోనే దళితబంధు పైసలు
పాత అకౌంట్‌లో వేస్తే పాత బాకీల కింద పట్టుకునే అవకాశం ఉంది. సంవత్సరానికి లక్ష కన్నా ఎక్కువ తీసుకోవద్దనే కేంద్రం పెట్టిన నిబంధన కూడా ఉన్నది. వాటన్నింటినీ అధిగమించి మీరు పెట్టుబడి పెట్టుకోవాలంటే మీరంతా కొత్త బ్యాంకు ఖాతాలు తెరవాలి. కొత్తబ్యాంకు ఖాతాలోనే ఈ డబ్బులు వేసుకోవాలి. కలెక్టర్లు మీకు త్వరలోనే కొత్త ఖాతాలు తెరిపిస్తరు. దీనికి తెలంగాణ దళితబంధు ఖాతా అని పేరు పెట్టుకుంటం. ఆ ఖాతాలోనే డబ్బులు …
Read More »