Home / Tag Archives: bjp (page 150)

Tag Archives: bjp

ప్రధాని మోదీకి దీదీ షాక్

 దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న పెగాసస్‌ స్పైవేర్‌ వివాదంపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో పలువురు రాజకీయ నేతలు, అధికారులు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయన్న ఆరోపణలపై రాష్ట్ర పరిధిలో విచారణ జరిపేందుకు కమిషన్‌ను నియమించారు. కలకత్తా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జ్యోతిర్మయి భట్టాచార్య, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్‌ బి.లోకూర్‌తో ద్విసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం ఆమె ఢిల్లీకి …

Read More »

బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డి కన్నుమూత

ఏపీ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ చెన్నై అపోలో ఆస్పత్రిలో మృతి చెందగా.. ఆయన మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం తెలియజేశారు. ‘రామచంద్రారెడ్డి సిద్ధాంతాలకు కట్టుబడిన నేత. ఆయనతో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను. రామచంద్రారెడ్డి కుటుంబసభ్యులకు నా సానుభూతి’ అని వెంకయ్యనాయుడు అన్నారు. అటు సోమువీర్రాజు కూడా సంతాపం తెలియజేశారు.

Read More »

రేషన్ కార్డుదారులకు ఇచ్చే బియ్యం కోటాలో కోత

తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ఇచ్చే బియ్యం కోటాలో కోత పడింది. జులై నెల కోటా కింద మనిషికి 5 కిలోలే ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఒక్కొక్కరికీ ఉచితంగా 5 కిలోలు బియ్యం కేంద్రం ఇస్తామనగా, రాష్ట్ర సర్కారు 5 కిలోలు ఇస్తామంది. 3 నెలలు కలిపి మనిషికి 30 కిలోలు ఇవ్వాల్సి ఉండగా, 25 కేజీలే అందాయి. ఈ క్రమంలో తాజా …

Read More »

ఉత్తరాఖండ్ సీఎంగా తీరత్ సింగ్ రావత్ రాజీనామా

ఉత్తరాఖండ్ సీఎంగా తీరత్ సింగ్ రావత్ రాజీనామా చేశారు. గవర్నర్ బేబీ రాణీ మౌర్యకు ఆయన తన రాజీనామా సమర్పించారు. CMగా తీరత్ సింగ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సెప్టెంబర్ 10 నాటికి 6 నెలలు ముగుస్తుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 చోట్ల సెప్టెంబర్ 10 లోపు ఉపఎన్నికల నిర్వహణ సాధ్యం కానందునే ఆయన రాజీనామా చేశారు. తీరత్ బాధ్యతలు చేపట్టి 4 నెలలే కావడం గమనార్హం. రేపు …

Read More »

సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి ఫోన్ … ఎందుకంటే..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఇవాళ ఫోన్‌ చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు, ఎస్టీటీ ఆదేశాలపై సీఎం కేసీఆర్‌తో ఆయన చర్చించినట్లు తెలిసింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతానికి కృష్ణాబోర్డు బృందాన్ని పంపుతాం. పనులు జరుగుతున్నాయో.? లేదో.? కమిటీ పరిశీలిస్తుందని సీఎంతో కేంద్ర మంత్రి షెకావత్‌ అన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య పలు అంశాలపైనా వీరు చర్చించినట్లు సమాచారం. అనుమతి …

Read More »

జమ్మికుంట మండలం అభివృద్ధి కావాలి

ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జమ్మికుంట మండల ఇంచార్జి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. బుధవారం జమ్మికుంట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యేముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో చేయాల్సిన పనులను వేగవంతం చేయాలని, ఇంక పెండింగ్ లో ఉన్న పనులపై అధికారులు నివేదిక …

Read More »

తెలంగాణను చూసి ఇతర రాష్ట్రాలు నేర్చుకోవాలి

గ్రామ పంచాయతీ నిధుల ఆడిట్‌కు తెలంగాణ రాష్ట్రం అవలంబిస్తున్న ఆన్‌లైన్‌ విధానం దేశానికి ఆదర్శంగా నిలిచిందని కేంద్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ కొనియాడారు. మంగళవారం ఆయన రాష్ర్టాల ఆడిట్‌, ఆర్థిక, పంచాయతీరాజ్‌ విభాగాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్రసింగ్‌ తోమర్‌ మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌ ఆడిట్‌పై తెలంగాణ అధికారులు ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను ప్రశంసించారు. నిధులు దుర్వినియోగం కాకుండా చూసేందుకు ఆన్‌లైన్‌ …

Read More »

విద్రోహులతో దోస్తీ ఆత్మాభిమానమా?

వ్యవసాయ భూమి ఉన్నా నీటి సౌక ర్యం లేకుంటే నిష్ప్రయోజనమే. అందుకే నీటి సౌకర్యం కల్గించడానికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజల ఆకలి తీర్చడానికి ఆరుగాలం కష్టపడే రైతుకు కేసీఆర్‌ అండగా నిలిచారు. కోటి ఎకరాలకు నీటివసతి కల్పించడం లక్ష్యంగా కాళేశ్వరం లాంటి అద్భుత ప్రాజెక్టును, అనుబంధ ప్రాజెక్టులను త్వరితగతిన నిర్మింపజేశారు. సీమాంధ్ర పాలనలో తెలంగాణ ఎంత విలవిలలాడిందో గమనించిన వారికి మన రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిందేమిటో అర్థమవుతుంది. …

Read More »

రాబ‌డుల‌ను పూర్తిగా కోల్పోయాం:-మంత్రి కేటీఆర్

కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ గారు లేఖ రాశారు. గత ఏడాది మీరు ప్రకటించిన ఆత్మ నిర్భర్ సహాయ ప్యాకేజ్ లో ఎన్నో పరిమితులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ, కరోనా సంక్షోభ కాలం స్వల్పకాలమే ఉంటుందని, ఈ కాలానికి మీరు ప్రకటించిన ప్యాకేజీ సరిపోతుందని ఆశించాము. అయితే ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభం రెండవ దశను సైతం దాటి కొనసాగుతున్నది. అతి …

Read More »

ప్రతిపక్షాలపై మంత్రి కేటీఆర్ ఫైర్

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కొదురుపాకలో ప్రతిపక్షాలపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్-బీజేపీకి దమ్ముంటే సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో రైతులకు 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తున్నారా అని నిలదీశారు. బీజేపీ-కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాల్లో రైతుబంధు ఇచ్చే సంస్కారం ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ను ఎంత తిట్టినా ఎంత దూషించిన తమకు పోయేది ఏమీ లేదన్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat