తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్డ్ డౌన్ మరోసారి పొడిగించవద్దని సర్కారు భావిస్తోంది. పగటి పూట పూర్తిగా లాక్డౌన్ ఎత్తివేసి రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేసే అవకాశముందని సమాచారం. వ్యాపారాలతో పాటు మెట్రో, బస్సులకు సాయంత్రం 7 వరకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మద్యాహ్నం 2 గంటల వరకు సడలింపులు కొనసాగుతున్నాయి. ఈ నెల 9తో లాక్ …
Read More »అమ్మ పెట్టదు, అడుక్కొనివ్వదు అన్న రీతిలో కేంద్రం వ్యవహారం
సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట బాలాజీ ఫంక్షన్ హాలులో శనివారం ఉదయం సిద్దిపేట జిల్లాలో హై రిస్క్ లకు కోవిడ్-19 వ్యాక్సినేషన్ టీకా కార్యక్రమాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు ప్రారంభించారు. ఈసందర్భంగా మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. మంత్రి శ్రీ హరీశ్ రావు కామెంట్స్: – వాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనాలోచిత, అసందర్భ, తప్పుడు నిర్ణయాలతో దేశ, తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. …
Read More »ఆంధ్రప్రదేశ్ కు మేఘా ఆక్సిజన్ క్రయోజనిక్ ట్యాంకులు
• సింగపూర్ నుంచి మూడు ట్యాంకుల దిగుమతి • రక్షణశాఖ ప్రత్యేక విమానంలో పానాగఢ్ వైమానిక స్థావరానికి చేరుకున్నక్రయోజెనిక్ ట్యాంకులు • ఒక్కొక్క ట్యాంకు నుంచి కోటి 40 లక్షల లీటర్ల ఆక్సిజన్ లభ్యత • ప్రభుత్వానికి ఉచితంగా అందించిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ • ప్రస్తుత, భవిష్యత్తు ఆక్సిజన్ కొరత నివారణే లక్ష్యం • దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ లో ఆక్సిజన్ నింపుకుని రాష్ట్రానికి రానున్న ఆక్సిజన్ ట్యాంకులు …
Read More »పూజా అందాల రాక్షసే కాదు అందమైన మనసు కూడా ఉంది
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే పెద్ద మనసు చాటుకుంది. కరోనాతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు అండగా నిలుస్తోంది. తాజాగా 100 నిరుపేద కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకుల్ని అందించింది. లాక్డ్ డౌన్ కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు అండగా నిలిచింది. వాటన్నింటిని తనే స్వయంగా ప్యాక్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Read More »తెలంగాణలో కొత్తగా 2,493 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 2,493 కరోనా కేసులు, 15 మరణాలు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 318 కరోనా కేసులు వచ్చాయి. ఇక రాష్ట్రంలో కరోనా నుంచి మరో 3,308 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 33,254 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు 24 గంటల్లో 94,189 కరోనా పరీక్షలు నిర్వహించారు.
Read More »ఏపీలో కొత్తగా 11,303 మందికి కరోనా
ఏపీలో కొత్తగా 11,303 మందికి కరోనా సోకింది. మరో 104 మంది కరోనాబారిన పడి మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా ఒక్కరోజే 20 మంది మరణించారు. ఇక ఒక్కరోజులోనే కరోనా నుంచి 18,257 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 1,46,737 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 93,704మందికి కరోనా టెస్టులు చేశారు.
Read More »మిల్క్ బ్యూటీకి కోపం వచ్చింది..ఎందుకంటే..?
దేశాన్ని కుదిపేస్తున్న కరోనా టైంలో సినీ తారలు ఆశించిన స్థాయిలో సేవా కార్యక్రమాలు చేపట్టడం లేదనే వాదనలు అర్థరహితమని మిల్కీ బ్యూటీ తమన్నా తెలిపింది. ‘సినిమా వాళ్లు దాతృత్వ కార్యక్రమాలు విరివిగా చేయడం లేదనే అపోహను సృష్టించారు. వాస్తవంగా చాలామంది. ప్రచారానికి దూరంగా సేవ చేస్తున్నారు. వ్యక్తిగతంగా మాత్రం నేను ఛారిటీ అంశాల్లో ప్రచారానికి దూరంగా ఉంటాను. ఇలాంటి తప్పుడు ప్రచారంతో మాపై ఒత్తిడి పెరుగుతోంది’ అని తమన్నా చెప్పింది.
Read More »సోనుసూద్ పై ప్రముఖ నిర్మాత షాకింగ్ కామెంట్స్
కరోనా మహమ్మారి సమయంలో దేశంలో అనేక మందికి సేవలు చేస్తున్న ప్రముఖ నటుడు సోనుసూద్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ఐదేండ్ల క్రితం నేను ఓ ఛారిటీ ఈవెంట్ కు రావాలని సోనూసూద్ను ఆహ్వానించినప్పుడు ఈవెంట్ రావాలంటే సోనూసూద్ రెమ్యునరేషన్ ఇవ్వాలని అడిగాడట. దీంతో సోనూసూద్ కమర్షియల్ పర్సన్ అని అనుకున్నాడట. కానీ, ఇపుడు దేవుడిలా మారి ఆయన సేవలు చేస్తూ …
Read More »‘కె.జి.యఫ్’ స్టార్ యష్ ఓ సంచలన నిర్ణయం
మహమ్మారి కరోనా ప్రభావం సినిమా ఇండస్ట్రీపై కూడా గట్టిగానో ఉంది. ఎక్కడి షూటింగ్స్ అక్కడ ఆగిపోవడంతో సినీ కార్మికులు ఎందరో అల్లాడిపోతున్నారు. అలాంటి వారిని ఆదుకునేందుకు ‘కె.జి.యఫ్’ స్టార్ యష్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కన్నడ సినీ పరిశ్రమలోని 21 డిపార్ట్‌మెంట్స్‌లో ఉన్న 3వేల మంది సభ్యులకు.. ఒక్కొక్కరికి రూ. 5000 చొప్పున ఆర్ధిక సహాయం అందించాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా యష్ తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా …
Read More »మంత్రి పువ్వాడకు నెటిజన్లు ఫిదా…ఎందుకంటే..?
కరోనా విపత్కర పరిస్థితుల్లో గొప్ప మానవతావాది గా నిలుస్తున్నారు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. కరోనా మరియు ఇతర బాధితులకు అండగా నిలిచి సాయం అందిస్తున్నారు ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా మంత్రి పువ్వాడ ను సహాయం కోరుతున్న బాధితులకు వెంటనే స్పందించి వారిని సంప్రదించి చికిత్స కు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఈ కరోనా ఇబ్బందికర పరిస్థితి దృష్ట్యా పేదలు,ఖమ్మం …
Read More »