ప్రస్తుతం కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచదేశాలను వణికిస్తోంది. దీని ప్రత్యేక లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పటివరకూ స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో లండన్ కింగ్స్ కాలేజీ దీని లక్షణాలపై అధ్యయనం చేసింది. కొన్ని సింప్టమ్స్ తెలియజేసింది. సాధారణ కోవిడ్ లక్షణాలతో పాటు.. చర్మంపై అసాధారణ దద్దుర్లు, దురద ఉంటే అది ఒమిక్రాన్ కావొచ్చని తెలిపింది. ఇలాంటి పరిస్థితిలో ఎరుపు, దురద దద్దుర్లను గమనించాలని సూచించింది.
Read More »బీహార్ కేబినేట్ లో కరోనా కలకలం
బీహార్ కేబినేట్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇద్దరు డిప్యూటీ సీఎంలు రేణూ దేవీ, తారా ప్రసాద్ సహా మంత్రులు సునీల్ కుమార్, విజయ్ చౌదరి, అశోక్ చౌదరిలకు కరోనా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు. పంజాబ్లోను కరోనా విలయతాండవం చేస్తోంది. శిరోమణి ఆకాలిదళ్ అధ్యక్షుడు సుఖేవ్ సింగ్ ధిండా కరోనా బారిన పడ్డారు.
Read More »ఏపీలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు
ఏపీలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. గుంటూరులో ఓ మహిళతో పాటు ముగ్గురు ప్రకాశం జిల్లా వాసులకు ఒమిక్రాన్ వచ్చింది. USA నుంచి వచ్చిన ఒకరికి, యూకే నుంచి వచ్చిన ఇద్దరికి, విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి నుంచి మరో మహిళకు ఒమిక్రాన్ సోకింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28కి చేరింది.
Read More »అమితాబ్ బచ్చన్ ఇంట్లో కరోనా కలకలం
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇంట్లో కరోనా కలకలం రేగుతోంది. ముంబైలోని అమితాబ్ నివాసంలో పని చేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. బిగ్ బీ ఇంట్లో మొత్తం 31 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. గతేడాది జూలై 11న అమితాబ్ కరోనా బారినపడి ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆయన ఇంట్లో మరోసారి …
Read More »గంగూలీ ఫ్యామిలీకి కరోనా
బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఫ్యామిలీకి కరోనా సోకింది. ఆయన కుటుంబంలో నలుగురికి పాజిటివ్ గా తేలింది. వీరిలో అతని కూతురు కూడా ఉంది. అయితే వీరందరికీ తేలికపాటి లక్షణాలు ఉండటం వల్ల అందరినీ హోం ఐసోలేషన్ లోనే ఉంచారు. గంగూలీ భార్య మాత్రం నెగటివ్ వచ్చింది. ఇప్పటికే గంగూలీకి కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ బారిన పడి హోం ఐసోలేషన్ లో ఉన్నారు.
Read More »ఢిల్లీలో 10వేల కరోనా కొత్త కేసులు
దేశ రాజధానిలో ఈ రోజు దాదాపు 10వేల కరోనా కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ వెల్లడించారు. ప్రస్తుతం 8.3గా ఉన్న పాజిటివిటీ రేటు 10 శాతానికి చేరనుందని అంచనా వేశారు. దేశం మూడో వేవ్లోకి ప్రవేశించిందన్న ఆయన.. ఢిల్లీకి మాత్రం అది ఐదో వేవ్ అని వెల్లడించారు. ఇక ప్రైవేటు 40 శాతం పడకలు కొవిడ్ బాధితుల కోసం రిజర్వ్ చేసినట్లు …
Read More »తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9 నుంచి వచ్చే అన్ని ఆదివారాలు తమిళనాడులో పూర్తిస్థాయి లాక్ డౌన్ ఉంటుందని ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు కాలేజీలు పూర్తిగా మూసివేయాలని.. థియేటర్లు 50శాతం ఆక్యుపెన్సీతో నడపాలని ప్రభుత్వం సూచించింది. మరిన్ని ఆంక్షలు విధించడంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ తెలిపారు.
Read More »దేశంలో కొత్తగా 2135 ఒమిక్రాన్ కేసులు
దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు అంతకంతకూ పెరిగిపోతూ భయపెడుతున్నాయి. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2135కి చేరింది. మహారాష్ట్ర 653, ఢిల్లీ 464, కేరళ 185, రాజస్థాన్ 174, గుజరాత్ 154, తమిళనాడు 121, తెలంగాణ 84, కర్ణాటక 77, హర్యానా 71, ఒడిశా, ఉత్తరప్రదేశ్ 31, ఆంధ్రప్రదేశ్ 24, బెంగాల్ 20, మధ్యప్రదేశ్ 9, ఉత్తరాఖండ్ 8, గోవా 5 కేసులు నమోదయ్యాయి. మరోవైపు …
Read More »తెలంగాణలో కొత్తగా 235 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 38,023 టెస్టులు చేయగా.. 235 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,81,307కు చేరాయి.. గడిచిన 24 గంటల్లో 204 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు విదేశాల నుంచి వచ్చిన 346 మందికి టెస్టులు చేయగా.. 10 మందికి పాజిటివ్ రాగా, వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపారు.
Read More »అమెరికాలో కరోనా కలవరం.. ఒకేరోజు 3లక్షల కరోనా కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. అమెరికాలో గత 24 గంటల్లో 3లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. 18 వందల మందికి పైగా మహమ్మారి వల్ల చనిపోయారు. ఫ్రాన్స్లోనూ కొవిడ్ విజృంభిస్తోంది. అక్కడ నిన్న ఒక రోజే 2లక్షల మందికి కరోనా నిర్ధారణ అయింది. పోర్చుగల్లో 26 వేలకు పైగా కేసులు నమోదు కాగా.. పొలాండ్లో 15వేలు, రష్యాలో 21 వేల కేసులు నమోదయ్యాయి.
Read More »