కరోనా సెకెండ్ వేవ్ పై కేంద్రం ఏర్పాటు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తల బృందం ఊరటనిచ్చే కబురు చెప్పింది. జులైతో దీనికి తెర పడే అవకాశాలున్నట్లు వెల్లడించింది. అలాగే 6-8 నెలల తర్వాతే థర్డ్ వేవ్ ఉండొచ్చని.. అయితే రెండో వేవ్ అంత తీవ్ర ప్రభావం చూపించదని అంచనా వేసింది. ‘సూత్ర’ (ససెప్టబుల్, అన్లిడిటెక్టెడ్, టెస్టెడ్ అండ్ రిమూవ్డ్ అప్రోచ్) అనే మోడల్ ద్వారా శాస్త్రవేత్తల బృందం ఈ అంచనాలకు వచ్చింది.
Read More »ఇక ఇంటి దగ్గరే కరోనా పరీక్షలు
పుణెలోని మై ల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్ లిమిటెడ్ రూపొందించిన హోమ్ ఐసోలేషన్ టెస్టింగ్ కిట్ వినియోగానికి ICMR అనుమతిచ్చింది. దీంతో ఎవరైనా సొంతంగా ఇంట్లోనే కరోనా టెస్ట్ చేసుకోవచ్చు. కోవి సెల్ఫ్ అనే పేరు గల ఈ కిట్ వినియోగానికి ప్లే స్టోర్ / యాప్ స్టోర్ నుంచి ప్రత్యేక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ టెస్టులో పాజిటివ్ వచ్చిన వారు హోం ఐసోలేషన్లో ఉంటూ ICMR, ఆరోగ్య శాఖ …
Read More »బ్లాక్ ఫంగస్ ను గుర్తించడం ఎలా…?
నాసికా మార్గం ద్వారా బ్లాక్ ఫంగస్ వేగంగా వ్యాపించి రక్త నాళాలను మూసివేస్తుంది. ముక్కుకు ఎండోస్కోపీ చేయడం సహా CT స్కాన్ ద్వారా ఇన్ఫెక్షన్ గుర్తిస్తారు. ఇక మెదడుకు, కంటికి ఈ వ్యాధి సోకిందో లేదో MRI స్కానింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. నియంత్రణలో లేని డయాబెటిస్.. స్టెరాయిడ్స్ అధికంగా వాడటం, ఎక్కువ కాలం ఆక్సిజన్ థెరపీలో, వెంటిలేటర్పై బాధితుడిని ఉంచడం వల్ల జబ్బు సోకే అవకాశం ఉంటుంది.
Read More »తెలంగాణలో 75వేలు దాటిన కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 2,207 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 75,257కు చేరింది. కరోనా నుంచి కొత్తగా 1136 మంది పూర్తిగా కోలుకున్నారు .. డిశ్చార్జి అయినవారి సంఖ్య 53,239గా ఉంది. గత 24 గంటల్లో కరోనాతో 12 మంది మృతి చెందడంతో.. రాష్ట్రంలో మరణాల సంఖ్య 601కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,417 …
Read More »20లక్షలు దాటిన కరోనా కేసులు!
భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిత్యం రికార్డుస్థాయిలో కొవిడ్ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే అత్యధికంగా 62,498 కేసులు నమోదయ్యాయి. భారత్లో ఒక్కరోజులోనే 60వేల కేసులు దాటడం ఇదే తొలిసారి. అంతకుముందు జులై 31న అత్యధికంగా 57,151 కేసులు బయటపడ్డాయి. దీంతో శుక్రవారం నాటికి దేశంలో మొత్తం కరోనా కేసులసంఖ్య 20,27,034కు చేరింది. మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 13లక్షల 78వేల మంది కోలుకోగా, మరో 6లక్షల …
Read More »100కి 20మందిలో కరోనా లక్షణాలు
దవాఖానల్లో చేరుతున్న కరోనా రోగులకంటే అంతకు నాలుగురెట్లు కొవిడ్-పాజిటివ్ ఉన్నవారు ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకుండా యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. దేశంలో సోమవారంనాటికి 4,666 మంది కరోనాబారిన పడగా, అంతకు నాలుగురెట్లు అనగా సుమారు 20వేలమంది జనారణ్యంలో తిరుగుతూ తమకు తెలియకుండానే వైరస్‌ను విస్తరిస్తున్నారు. ఈ విషయాన్ని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)కి చెందిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రమన్ గంగాఖేడ్కర్ వెల్లడించారు. వ్యాధి లక్షణాలతో తమ వద్దకు …
Read More »