Home / Tag Archives: carona vaccine (page 61)

Tag Archives: carona vaccine

 తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి హోరు

 తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. 24 గంటల్లో 7,430 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొంది. దీంతో తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,50,790కి చేరింది. కొత్తగా 5567 మంది కోలుకొని ఇండ్లకు వెళ్లగా.. ఇప్పటి వరకు 3,67,727 మంది కోలుకున్నారు. నిన్న ఒకే రోజు 56 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య …

Read More »

ఆక్సిజన్‌ లెవల్స్ పెరగాలంటే..?

కరోనా విజృంభిస్తున్న వేళ.. అందరి జాగ్రత్తలూ దీనిపైనే. అందరి మాటలూ వీటిని పెంచుకోవడం ఎలా అనేదానిపైనే. ఆక్సిజన్‌ మన శరీర కణాల్లో శక్తిని పెంచుతుంది. తద్వారా రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. దీనికి బలవర్ధకమైన ఆహారం తీసుకోవడమే మార్గం. రెడ్‌ బ్లడ్‌ సెల్స్‌ (ఆర్‌బీసీ)లోని ప్రధాన ప్రొటీన్‌ హిమోగ్లోబిన్‌. ఇది ఊపిరితిత్తులనుంచి ఆక్సిజన్‌ (ఓ2)ను వివిధ శరీర అవయవాలకు సరఫరా చేయడంతోపాటు అక్కడినుంచి కార్బన్‌డైయాక్సైడ్‌ (సీఓ2)ను వెనక్కు తీసుకొని …

Read More »

దేశంలో కరోనా విళయతాండవం

ప్రస్తుతం దేశంలో కరోనా విళయతాండవం చేస్తున్నది. వైరస్‌ విజృంభణతో ప్రతిరోజు పాజటివ్‌ కేసులు భారీసంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో గత 24 గంటల్లో కరోనా కేసులు 4 లక్షలు దాటాయి. ఒక్కరోజులో 4 లక్షలకుపైగా కేసులు నమోదవడం ప్రపంచంలో ఇదే తొలిసారి. అదేవిధంగా వరుసగా నాలుగోరోజూ మూడు వేలకు పైగా మరణాలు సంభవించాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 4,08,323 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కేసుల …

Read More »

క‌రోనా ఎఫెక్టు- పేషెంట్ల కోసం అంబులెన్స్ డ్రైవ‌ర్‌గా హీరో

కరోనా బాధితులకు సహాయం చేయడానికి ద‌క్షిణాదికి చెందిన ఓ నటుడు అంబులెన్స్ డ్రైవర్‌గా మారిపోయారు. క‌రోనా పేషెంట్ల‌ను ద‌వాఖాన‌కు తీసుకెళ్ల‌డం, ద‌వాఖాన నుంచి ఇంటికి తీసుకెళ్ల‌డం చేస్తూ శ‌హ‌బాష్ అనిపించుకుంటున్నారు సౌతిండియాకు చెందిన న‌టుడు అర్జున గౌడ‌. యువ‌రాథ‌న‌, రుస్తోమ్ సినిమాల‌తో మంచి ఇమేజ్‌ను సంపాదించుకున్న అర్జున గౌడ‌.. ప్రాజెక్ట్ స్మైల్ ట్ర‌స్ట్‌లో స‌భ్యుడిగా చేరి నిరేపేద‌ల‌కు సేవ‌లందిస్తున్నాడు. క‌రోనా సోకిన వారిని ద‌వాఖాన‌ల‌కు తీసుకెళ్ల‌డం, చ‌నిపోయిన వారిని శ్మ‌శాన …

Read More »

కరోనా నుండి కోలుకున్న మాజీ ప్రధాని

ఇటీవల కరోనా మహమ్మారి భారీన పడిన మాజీ ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్ కోలుకున్నారు.ఇటీవల ఆసుపత్రిలో చేరిన కరోనా మహమ్మారికి చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుండి మన్మోహాన్ సింగ్ డిశ్చార్జ్ అయ్యారు.కరోనా సోకడంతో ఆయన ఈ నెల పంతొమ్మిది తారీఖున ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరిన సంగతి విదితమే. ప్రస్తుతం మన్మోహాన్ సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉంది..

Read More »

దేశంలో కొత్తగా 3,86,452 కరోనా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. వైరస్‌ పంజా విసరడంతో ప్రతిరోజు భారీసంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో వరుసగా తొమ్మిదో రోజూ దేశవ్యాప్తంగా మూడు లక్షలకు పైగా కేసులు రికార్డయ్యాయి. అదేవిధంగా మరోమారు మూడు వేలకుపైగా బాధితులు మరణించారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,86,452 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 3498 మంది కరోనాతో మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య …

Read More »

తెలంగాణలో ప్రతి రోజూ పది లక్షల టీకాలు

తెలంగాణ రాష్ట్రంలో 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వడానికి ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నది. మే 1 నుంచి దేశవ్యాప్తంగా 18 ఏండ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్రంలోని అర్హులందరికీ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రకడ్బందీ ప్రణాళిక రూపొందిస్తున్నది. అందరికీ ఉచితంగా టీకా వేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, క్వారంటైన్‌ నుంచి బయటకు రాగానే తానే స్వయంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను సమీక్షిస్తానని …

Read More »

కేంద్ర ప్ర‌భుత్వంపై మంత్రి ఈట‌ల ఫైర్

కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు తెలంగాణ‌కు చెందిన భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కుల‌పై రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ నిప్పులు చెరిగారు. బీజేపీ నేత‌లు బాధ్య‌తారాహిత్యంగా మాట్లాడుతున్నారు. అన్నీ కేంద్రం చేతుల్లో పెట్టుకుని రాష్ర్టాల‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రికాదు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో ప‌రిశీలించి మాట్లాడితే బాగుంటుంది. తెలంగాణ‌లో 4 రాష్ర్టాల‌కు చెందిన రోగుల‌కు చికిత్స అందిస్తున్నామ‌ని తెలిపారు. మేం కేంద్రాన్ని విమ‌ర్శించ‌ట్లేదు.. వారే …

Read More »

తెలంగాణలో పదో తరగతి విద్యార్థులు ఉత్తీర్ణతపై కీలక ప్రకటన

తెలంగాణలో పదో తరగతి విద్యార్థులు పాస్ పై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎగ్జామ్ ఫీజు చెల్లించిన వారే పాస్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులను నమ్మవద్దని సూచించారు. అది తప్పుడు వార్త అని.. రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని స్పష్టం చేశారు. అసత్య ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read More »

కరోనా ఎఫెక్ట్ – మారుతీ సుజుకీ సంచలన నిర్ణయం

దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత నేపథ్యంలో కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ కీలక నిర్ణయం తీసుకుంది. హర్యానాలోని తమ ఫ్యాక్టరీలన్నింటినీ మూసివేయాలని.. తద్వారా ఆక్సిజన్ నిల్వల్ని వైద్య అవసరాల కోసం మళ్లించనున్నట్లు తెలిపింది. మే 1 నుంచి 9 వరకు హర్యానాలోని ఫ్యాక్టరీలను మూసి ఉంచనుండగా.. ప్రజల ప్రాణాల్ని రక్షించడంలో ప్రభుత్వానికి తమ సహకారం నిరంతరం కొనసాగుతుందని మారుతీ హామీ ఇచ్చింది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat