ఏపీలో ఈ రోజు వెలువడుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని అధికార పార్టీ అయిన వైసీపీ అదరగొడుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 15 మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. మాచర్ల, పిడుగురాళ్ల, పులివెందుల, పుంగనూరు గిద్దలూరు, డోన్, ఆత్మకూరు, పలమనేరు, మదనపల్లి రాయచోటి, ఎర్రగుంట్ల, నాయుడుపేట, సూళ్లూరుపేట కనిగిరి, కొవ్వూరు మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. ప్రకాశం జిల్లా గిద్దలూరులోని 20 వార్డుల్లో …
Read More »మాజీ ఎంపీ మాగంటి బాబు ఇంట్లో విషాదం
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ నేత, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు టీడీపీకి చెందిన యువనేత మాగంటి రాంజీ(37) కన్నుమూశాడు. రాంజీ ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు విజయవాడ ఆంధ్ర ఆసుపత్రిలో చేర్పించారు. తాజాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. రాంజీ మృతికి నారా లోకేష్ తో పాటు పలువురు టీడీపీ నేతలు సంతాపం తెలిపారు
Read More »మేయర్ అభ్యర్థిని ఖరారు చేసిన టీడీపీ
ఏపీలో త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ మేయర్ అభ్యర్థిని టీడీపీ ఖరారు చేసింది. ఎంపీ కేశినేని నాని కుమార్తె అయిన కేశినేని శ్వేత పేరును ఓకే చేసినట్లు ఆ పార్టీ వెల్లడించింది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. కేశినేని శ్వేత 11వ డివిజన్ నుంచి బరిలో ఉన్నారు.
Read More »తెగ బాధపడుతున్న నారా లోకేష్..!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు.. మాజీ మంత్రి,టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ తెగ బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ నాయుడు విశాఖపట్టణంలో పర్యటించాడు. ఈసందర్భంగా లోకేష్ మాట్లాడుతూ” ఒక్క అవకాశం ఇచ్చినందుకు ప్రస్తుత సీఎం,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి వైజాగ్ స్టీల్ ప్లాంటును అమ్మేస్తున్నారని విమర్శించారు. విశాఖ గాజువాకలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో లోకేశ్ …
Read More »మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారనే ఆరోపణలతో పోలీసులు ఆయనపై కేసు ఫైల్ చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బంధువు గౌరీనాథ్ రెడ్డి ఇంట్లో పోలీసులు చేసిన దాడుల్లో 60 క్రికెట్ కిట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ చేపట్టనున్నారు
Read More »మరో సంచలనానికి తెరతీసిన నిమ్మగడ్డ రమేష్
ఏపీలో పంచాయతీ ఎన్నికల సమరం ముగిసిందో లేదో ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ మరో సంచలనానికి తెరతీశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలపై చర్చించేందుకు మార్చి 1న అన్ని రాజకీయ పర్టీలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ భేటీ కానున్నారు. ఒక్కో పార్టీ నుంచి ఒక్కొక్కరు హాజరుకావాలని సూచించారు. ఇప్పటికే ప్రాంతాల వారీగా 3 ప్రాంతాల్లో ఎస్ఈసీ సదస్సులను నిర్వహించనుండటం తెలిసిందే. మార్చి 10న 12 …
Read More »చంద్రబాబు సంతోషం.. ఎందుకంటే..?
ఏపీలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నేతలు వీరోచితంగా పోరాడారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. 4వ విడతలో 1,136 పంచాయతీల్లో విజయం సాధించామని అన్నారు.. మొత్తం నాలుగు విడతల్లో 4,230 పంచాయతీలను గెలుచుకున్నామని తెలిపారు. ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసిందని, అరాచకాలు సృష్టించిందన్నారు. ఎన్నికలను SEC సక్రమంగా నిర్వహించలేదని చంద్రబాబు ఆరోపించారు.
Read More »సొంత ఇలాఖాలో చంద్రబాబుకి షాక్
ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత,సీఎం జగన్ పనితీరును మెచ్చే మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పం ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారని మంత్రి కన్నబాబు అన్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో 89 పంచాయతీల్లో 74చోట్ల వైసీపీ మద్దతుదారులే గెలిచారని, ఈ ఫలితాలు చంద్రబాబు, లోకేశ్ కు చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు గతంలో చంద్రగిరిని వదిలి కుప్పం చేరుకున్న చంద్రబాబు.. ఇప్పుడు పక్క రాష్ట్రాలు, …
Read More »గురువారం తిరుపతికి సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ ఈ నెల 18న తిరుపతిలో పర్యటించనున్నారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బయల్దేరి రుయా ఆస్పత్రి సమీపంలో ఉన్న రిటైర్డ్ మేజర్ జనరల్ 95 ఏళ్ల సి.వి.వేణుగోపాల్ ఇంటికి వెళ్లి ఆయన్ను సత్కరిస్తారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఆ తర్వాత సైనికులను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు.
Read More »ఏపీ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యింది. రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీ, నగర పంచాయతీలకు షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీనిప్రకారం మార్చి 10 పోలింగ్ జరుగనుండగా, అదేనెల 14న ఓట్లను లెక్కిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు రెండు రోజులపాటు సమయం ఇచ్చారు. ఈ ప్రక్రియ మార్చి 2న ప్రారంభమై 3న మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది.
Read More »