తెలంగాణలో త్వరలో జరగనున్న నాగార్జునసాగర్ ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా ప్రముఖ న్యాయవాది మువ్వా అరుణ్‌కుమార్ పోటీచేస్తారని టీడీపీ-టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ శనివారం తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు పేర్కొన్నారు. అనుముల మండలం చింతగూడెం గ్రామానికి చెందిన అరుణ్‌కుమార్ వృత్తిరీత్యా న్యాయవాది. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఆయన ఎన్టీఆర్ పార్టీని స్థాపించినప్పుడే టీడీపీలో చేరి క్రియాశీలంగా పనిచేస్తున్నారు. …
Read More »రేవంత్ అరెస్ట్ తప్పదా…?
తెలంగాణ ,ఏపీ రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణకు హాజరుకాకపోతే వారెంట్ జారీ చేస్తామని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని ఏసీబీ కోర్టు హెచ్చరించింది. నిన్న విచారణకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్ ఉదయ్ సింహ హాజరుకాగా, పాదయాత్రలో ఉన్న రేవంత్ రెడ్డి రాలేదు. ఇవాళ మాత్రం తప్పనిసరిగా హాజరుకావాలని కోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలతో వీలైనంత వేగంగా విచారణ చేపట్టాలని పేర్కొంది
Read More »ఏపీలో టీడీపీకి షాక్
ఏపీలో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త వీరవెంకట సత్యనారా యణమూర్తి తెలుగుదేశం పార్టీ పదవులకు రాజీనామాలు చేశారు. వాకలపూడిలోని తమ నివాసంలో శుక్రవారం మీడియా సమక్షంలో వారు కన్నీరు పెట్టుకుంటూ ఈ విషయం వెల్లడించారు. రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పదవికి అనంతలక్ష్మి, టీడీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి పదవికి సత్యనారాయణమూర్తి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు
Read More »ఏపీలో మరో ఓటుకు నోటు తరహా-నామినేషన్ వేస్తే 2లక్షలు ఆఫర్..?
ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక ఎన్నికలు పార్టీ రహిత ఎన్నికలైనా.. చిత్తూరు జిల్లాలో పరువు కాపాడుకునేందుకు చంద్రబాబు సర్పంచ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. గెలుపోటములతో పనిలేకుండా కేవలం నామినేషన్ వేసేవారికి రూ.2 లక్షలు నగదు అందజేస్తున్నారు. గట్టి పోటీ ఇవ్వాలని భావించే పంచాయతీల్లో పోటీచేసే వారికి ఓటర్లను బట్టి టీడీపీ నేతలు నగదు పంపిణీ చేస్తున్నారు. అది కూడా కొందరికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు …
Read More »మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ వైసీపీ సర్పంచ్ అభ్యర్థి అప్పన్నను బెదిరించిన కేసులో అచ్చెన్నను అదుపులోకి తీసుకున్నరు పోలీసులు. అనంతరం ఆయన్ని కోటబొమ్మాళి PSకు తరలించారు. అటు అప్పన్నను పరామర్శించేందుకు అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కాసేపట్లో నిమ్మాడకు రానున్నారు.
Read More »ఓటుకు నోటు కేసులో ఎంపీ రేవంత్ కు షాక్
ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రేవంత్‌రెడ్డికి ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ రోజు శుక్రవారం కోర్టు విచారణ జరిపింది. ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక శాఖ పరిధిలోకి రాదంటూ రేవంత్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ …
Read More »తిరుపతిలో పోటీపై పవన్ క్లారీటీ
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం తిరుపతిలో జరిగింది. తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన అభ్యర్థినే బరిలోకి దింపాలని సమావేశంలో కమిటీ అభిప్రాయపడింది. రానున్న ఎన్నికల్లో పార్టీ పోటీ చేయాలని సభ్యులు గట్టిగా డిమాండ్ చేశారు. బీజేపీ అధిష్టానంతో చర్చించి వారం రోజుల్లో ఈ అంశాన్ని తేలుద్దామని అధినేత పవన్ కల్యాణ్ చెప్పారట. అభ్యర్థి ఎవరైనా గెలుపు కోసం కలిసి పనిచేయాలని పార్టీ నేతలకు సూచించారు.
Read More »మాజీ మంత్రి కళా వెంకట్రావు అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు శ్రీకాకుళం జిల్లా రాజాంలో పోలీసులు అరెస్ట్ చేశారు. రామతీర్థం క్షేత్రాన్ని పరిశీలించేందుకు ఇటీవల వచ్చిన వైసీపీ ఎంపీ విజయసాయి కారుపై దాడి ఘటనలో కళా వెంకట్రావును అరెస్ట్ చేశారు. చెప్పులు విసిరిన ఘటనలో కళా అనుచరులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారించనున్నారు.
Read More »జగన్ కు లోకేష్ వార్నింగ్
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కళా వెంకటరావు అరెస్టును నారా లోకేశ్ ఖండించారు రామతీర్థంలో రాముడి విగ్రహం తల ఎత్తుకెళ్లిన వారిని పట్టుకోలేకపోయిన చేతకాని సర్కారు అత్యంత సౌమ్యుడైన వెంకటరావు గారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అధికారం అండతో ఇంకెంత మంది బీసీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయిస్తావు జగన్?’ అని ట్వీట్ చేశారు
Read More »మాజీ ఎంపీ దివాకర్ రెడ్డికి షాక్ -రూ.100కోట్లు జరిమానా
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి భారీ షాక్ తగిలింది. ఏపీ మైనింగ్ అధికారులు రూ.100 కోట్ల జరిమానా విధించారు. వంద కోట్లు కట్టకపోతే ఆర్ అండ్ ఆర్ చట్టం కింద ఆస్తులు జప్తు చేస్తామన్నారు. త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీ పేరుతో జేసీ కుటుంబ సభ్యులు అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. యాడికి మండలం కోనఉప్పలపాడులో అక్రమ తవ్వకాలు …
Read More »