తెలంగాణ రాష్ట్రం నుండి పలు ప్రాంతాలకెళ్లే ప్రయాణికుల కోసం సంక్రాంతి పండుగకు 4,318 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ రోజు శుక్రవారం 7 నుంచి 14 వరకు రాష్ట్రంలోని అన్ని ముఖ్య ప్రాంతాలతో పాటు ఏపీకి ఈ బస్సులు నడుస్తాయని తెలిపింది. రాష్ట్రంలో 3,334 బస్సులు, ఏపీకి 984 బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. అడ్వాన్స్ రిజర్వేషన్లు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. …
Read More »తెలంగాణలో ఈనెల 8 నుంచి 16 వరకు విద్యాసంస్థలకు సెలవులు
తెలంగాణలో ఈనెల 8 నుంచి 16 వరకు అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సెలవుల్లో విద్యార్థులు కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది. బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలని సూచించింది.
Read More »మరోసారి మానవత్వం చాటుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి….
పర్వతగిరి మండల కేంద్ర సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్వతగిరి గ్రామ శివారులో కారు, బైక్ ఢీకొని ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. అదే మార్గంలో వెళ్తున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు వెంటనే క్షతగాత్రుల వద్దకు వెళ్లి అంబులెన్సు ఫోన్ చేసి బాధితులను పరామర్శించారు. అంబులెన్స్ వచ్చే వరకు అక్కడే ఉండి, ఎంజీఎం సూపరేంటెండ్ గారికి ఫోన్ చేసి రోడ్డు …
Read More »న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో పలు ఆంక్షలు
న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో పలు ఆంక్షలు విధించిన పోలీసులు.. క్యాబ్ డ్రైవర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. క్యాబ్ డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలన్న పోలీసులు.. రాత్రి వేళల్లో క్యాబ్ బుక్ చేస్తే, డ్రైవర్లు రద్దు చేయటానికి వీల్లేదన్నారు. క్యాబ్ సర్వీసును రద్దు చేస్తే రూ.500 జరిమానా వేస్తామన్న పోలీసులు.. సమస్య వస్తే 9490617111 నెంబర్కు వాట్సాప్లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.
Read More »సంక్రాంతి తర్వాత ఆర్టీసీ ఛార్జీల పెంపు
తెలంగాణలో ఇప్పటికే విద్యుత్ ఛార్జీల పెంపు ఖాయం కాగా, ప్రజలపై మరో భారం పడనుంది. సంక్రాంతి తర్వాత ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ప్రకటన వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పల్లెవెలుగు బస్సులకు కి.మీ.కు 25 పైసలు, ఎక్స్ప్రెస్ ఆ పైన బస్సులకు కి.మీ.కు రూ.30 పైసల చొప్పున పెంచాలన్న TSRTC ప్రతిపాదన ఇప్పటికే ప్రభుత్వానికి చేరగా, అనుమతి రావాల్సి ఉంది. సంక్రాంతి తర్వాత దీనికి సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేయనున్నట్లు సమాచారం.
Read More »త్వరలోనే తెలంగాణలో 60వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో వివిధ శాఖల్లోని ఖాళీల లెక్కలు తీసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే ఇప్పటికే 60 వేల ఖాళీలను ఆర్థిక శాఖ గుర్తించగా.. అదనంగా మరో 40 వేల కొలువులు తేలనున్నట్లు సమాచారం. దీంతో 2022లో వరుస నోటిఫికేషన్లు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే శాఖలవారీగా సన్నాహాలు మొదలుపెట్టింది.
Read More »తెలంగాణలో కొత్తగా 177కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 38,219 కరోనా టెస్టులు చేయగా కొత్తగా 177 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు వైరస్ తో మరణించారు. మొత్తం 190 మంది కోలుకున్నారు.మొత్తం కేసుల సంఖ్య- 6,80,251 .మరణించిన వారి సంఖ్య – 4,018. ప్రస్తుతం యాక్టివ్ కేసులు – 4,470.మొత్తం ఒమిక్రాన్ కేసులు- 38
Read More »తెలంగాణకు మరో ఘనత
దేశంలో గ్రామ పంచాయతీల ఆన్లైన్ ఆడిటింగ్లో తెలంగాణ వరుసగా రెండో ఏడాది నెం.1 స్థానంలో నిలిచింది. ఆన్లైన్ ఆడిటింగ్ను 100శాతం పూర్తి చేసింది. 2020-21 సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై 25శాతం గ్రామాలు తాము చేసిన నిధుల ఖర్చులను ఆన్లైన్లో ఉంచాలని కేంద్రం ఇటీవల ఆదేశించగా.. గడువు కంటే ముందే తెలంగాణ 100% ఆడిటింగ్ పూర్తిచేసింది. ఆ తర్వాత 72%తో తమిళనాడు, 60%తో ఏపీలో 2, 3 …
Read More »TSRTC మహిళా కండక్టర్లకు శుభవార్త
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా కండక్టర్లకు TSRTC శుభవార్త చెప్పింది. మహిళా కండక్టర్లు విధులు ముగించుకొని రాత్రి 8 గంటలలోపే వారి డిపోలకు చేరుకునేలా డ్యూటీలు వేయాలని అధికారులను MD V.C.సజ్జనార్ ఆదేశించారు. ఒకవేళ రాత్రి 8 తర్వాత డ్యూటీలు వేయాల్సి వస్తే.. అందుకు సంబంధించిన వివరణను హెడ్ ఆఫీసుకు తెలియజేయాలన్నారు. అన్ని డిపోల మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లు, రీజినల్ మేనేజర్లు ఈ ఆదేశాలను పాటించాలని సజ్జనార్ తెలిపారు.
Read More »ఇక నుండి దళితబంధు ఎంపిక వాళ్ల చేతుల్లోనే
సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దళితబంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈ పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యే లకు అప్పగించనుంది. తొలి ఏడాది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి రూ.10 లక్షలు ఇవ్వనుండగా.. హుజురాబాద్ నియోజకవర్గం మినహా మిగతా చోట్ల ఈ పథకం త్వరలోనే అమలు చేయనుంది. …
Read More »