Home / Tag Archives: film nagar

Tag Archives: film nagar

దానికి నో చెప్పిన అందాల రాక్షసి

తన అందాలతో నటనతో తెలుగు సినిమా ప్రేక్షకులకు దగ్గరైన అందాల రాక్షసి రష్మికా మంధాన..యువతకు మాత్రం కలల రాకుమారిగా మారింది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా కన్నడ సినిమా ‘కిరిక్ పార్టీ’ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. కార్తిక్ ఆర్యన్ హీరోగా నటించనున్న ఈ మూవీ కోసం చిత్రయూనిట్ రష్మిక మంధన్నాను సంప్రదించింది. అయితే ఇందులో నటించేందుకు ఆమె నో చెప్పింది. దీనిపై స్పందించిన కన్నడ బ్యూటీ.. మళ్లీ మళ్లీ ఒకే …

Read More »

మరోసారి ఆ హీరోతో సాయిపల్లవి రోమాన్స్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలుగా విడుదలై విజయవంతమైన ‘ఛలో, భీష్మ’ వంటి సినిమాలతో తన ప్రత్యేకత చాటుకున్న దర్శకుడు వెంకీ కుడుముల.  తాజాగా వెంకీ వరుణ్ తేజ్ తో ఓ సినిమా తీయనున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్ గా నటించాలని సాయి పల్లవిని చిత్రయూనిట్ సంప్రదిస్తోందట. ‘ఫిదా’తో హిట్ అందుకున్న ఈ జోడీ మరోసారి వెండితెరపై మెరవనుందా? లేదా? తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

Read More »

కోహ్లీపై రష్మిక సంచలన వ్యాఖ్యలు

తాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెట్ టీమ్ అభిమానినే అయినప్పటికీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఫేవరెట్ క్రికెటర్ కాదని కన్నడ భామ రష్మికా మందన్న తాజాగా వ్యాఖ్యానించింది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఐపీఎల్‌ను రెగ్యులర్‌గా ఫాలో అవుతానని చెప్పింది. ఈ ఏడాది ఐపీఎల్‌ టైటిల్‌ను ఆర్‌సీబీ గెలుస్తుందనుకున్నానని, అయితే అనుకోని పరిస్థితుల్లో లీగ్‌ వాయిదా పడటం తనను బాధించిందని చెప్పింది. ఐపీఎల్‌లో ఆర్సీబీ నా ఫేవరెట్ టీమ్. …

Read More »

కరోనా బాధితులకు అండగా రకుల్ ప్రీత్ సింగ్

తనవంతు సాయంగా కరోనా రోగులకు ఆక్సిజన్ అందించేందుకు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ముందుకొచ్చింది. ఇప్పటికే కొంత సొమ్ము సమకూర్చిన రకుల్.. తన స్నేహితుల ద్వారా మరికొంత మొత్తాన్ని సేకరిస్తోంది. ఆ నిధులతో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు సమకూర్చేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

Read More »

ఆ హీరో కోసం తెగ కష్టపడుతున్న పూజా

అఖిల్ అక్కినేనితో నటిస్తున్న ‘ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో స్టాండప్ కమెడియన్గా పూజా హెగ్దే కన్పించనుంది. సన్నివేశాలకు అవసరమైనంత వరకే తన స్టాండప్ స్కిల్స్ చూపించాల్సి ఉంటుందని ఇందుకోసం చాలా హోంవర్క్ చేశానని చెప్పింది. మరే సినిమా కోసం ఈ స్థాయిలో హోంవర్క్ చేసి శ్రమించలేదని పూజా వెల్లడించింది. జీఎ2 బ్యానర్పై బన్నీ వాస్, డైరెక్టర్ వాసు వర్మ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించనున్నారు.

Read More »

కియారా అద్వానీ తెగ బిజీ

కరోనా బారిన పడి కోలుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం RRR మూవీతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత కొరటాల శివతో ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీలో హీరోయిన్గా కియారా అద్వానీ ఫిక్స్ అయ్యింది. తాజాగా ఈ మూవీకి సైన్ చేసిన ఈ అమ్మడు.. తన డేట్స్ కూడా కేటాయించిందట. ప్రస్తుతం ఆచార్య మూవీతో కొరటాల శివ బిజీగా ఉండగా.. ఈ మూవీ షూటింగ్ పూర్తైన వెంటనే ఎన్టీఆర్తో మూవీని …

Read More »

బాలకృష్ణతో వర్క్ చేయడం అద్భుతమైన అనుభవం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో,యువరత్న ,నందమూరి అందగాడు బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న అఖండ మూవీ గురించి హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ పలు విషయాలు వెల్లడించింది. ‘ఈ మూవీలో నా రోల్ ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఒక్కోసారి సెట్స్లో వెయ్యి మందితో కూడా షూటింగ్ జరిగింది. అందరినీ డైరెక్టర్ బోయపాటి హ్యాండిల్ చేయడం చిన్న విషయం కాదు. బాలకృష్ణతో వర్క్ చేయడం అద్భుతమైన అనుభవం. …

Read More »

రాశీ ఖన్నా సంచలన నిర్ణయం

కరోనా కష్టకాలంలో హీరోయిన్ రాశీఖన్నా తనకు సాధ్యమైనంత వరకూ అనాథల ఆకలి తీరుస్తోంది. ముంబైలో రోడ్లపై ఆకలితో అలమటిస్తున్న వారికి ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి సాయం చేస్తోందట. అయితే ఎలాంటి ప్రచారం లేకుండానే ఆమె.. సైలెంట్గా అన్నార్థులను ఆదుకుంటోందట.

Read More »

అనుపమ తనదైన శైలీలో రంజాన్ శుభాకాంక్షలు

పవిత్ర రంజాన్ సందర్భంగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం యువతిలా ఈద్ ముబారక్ తెలుపుతూ ఆకర్షణీయ లుక్లో అలరించారు. అనుపమ తన స్టన్నింగ్ ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. దీనిపై ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read More »

జర్నలిస్టు TNR కి అండగా చిరు

ప్రముఖ నటుడు,యాంకర్ జర్నలిస్ట్ TNR మృతిపట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. TNR భార్యా పిల్లలను ఫోన్లో పరామర్శించారు చిరు.. తక్షణ ఖర్చుల కోసం రూ.లక్ష సాయం చేశారు. ‘TNR ఇంటర్వ్యూలను ఎన్నో చూశా. ఆయన ఇంటర్వ్యూ చేసే విధానం బాగుంటుంది. పట్టుదలతో ఎదిగిన ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఎలాంటి అవసరం వచ్చినా మీ కుటుంబానికి నేనుంటా’ అని చిరు చెప్పారు. అటు హీరో సంపూర్ణేష్ బాబు …

Read More »