Home / MOVIES / దీపావళి ని ముందే తీసుకోచ్చిన కాజల్

దీపావళి ని ముందే తీసుకోచ్చిన కాజల్

 బాలయ్య హీరోగా వచ్చి ఘనవిజయం సాధించిన లేటేస్ట్ మూవీ  భగవంత్ కేసరి సినిమాతో భారీ హిట్ అందుకున్న కాజల్‌ అగర్వాల్ . ఈసారి పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా అలరించేందుకు సిద్ధమవుతోంది. ఆమె ప్రధాన పాత్రలో న‌టిస్తున్న తాజా క్రైమ్‌ థ్రిల్లర్ ‘సత్యభామ’ ’.

సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తుండ‌గా.. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ టిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి కాజల్‌ పుట్టినరోజు సంద‌ర్భంగా గ్లింప్స్ విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది.

ఇదిలా ఉంటే.. దీపావళి కానుకగా ఈ సినిమా నుంచి మేక‌ర్స్ టీజ‌ర్‌ విడుద‌ల చేశారు.”సత్య ఈ కేసు నీ చేతుల్లో లేదు. కానీ ఆ ప్రాణం నా చేతుల్లోనే పోయింది సర్. అంటూ కాజల్‌ అగర్వాల్ బ్యాక్ గ్రౌండ్ వాయిస్‌తో టీజ‌ర్ మొద‌ల‌వుతుంది. ఇక టీజ‌ర్ చూస్తే హైద‌రాబాద్‌ నగరాన్ని కదిలించిన భయంకరమైన హత్య కేసును పోలీసాఫీసర్‌గా నటిస్తున్న కాజల్‌ అగర్వాల్‌ ఎలా పరిష్కరించారనేది ఈ మూవీ. ఇక ఈ టీజ‌ర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది.క్రైమ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే సమ్మర్ కు ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు మేక‌ర్స్ తెలిపారు. ఇక ఈ సినిమాకు శ్రీ చరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్నాడు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat