బుల్లితెరపై డీసెంట్ గా ఉండే వంటలక్క.. తాజాగా ఓ మాస్లుక్తో నెట్టింట వైరల్ గా మారింది. నటి ప్రేమి విశ్వనాథ్ కొత్త లుక్ను చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. లుంగీ కట్టు, పూల చొక్కా, చేతిలో సిగరెట్, నోటి నుంచి గుప్పుమని పొగ చూసి.. ‘వాట్ ఏ ఫోజ్’ అంటున్నారు. అల వైకుంఠపురములో అల్లుఅర్జున్ లుక్ను అచ్చుగుద్దినట్లు దించేసిన ప్రేమి.. ఆ ఫొటో తన బ్రదర్ తీసినట్లు పేర్కొంది.
Read More »తానేమి తక్కువ కాదంటున్న నిధి అగర్వాల్
టాలీవుడ్ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ సేవా కార్యక్రమాలతో అందరి మనసులు గెలుచుకుంటోంది. గతేడాది కరోనా సమయంలో తన వంతు సాయం చేసిన నిధి.. తాజాగా ‘డిస్ట్రిబ్యూట్ లవ్’ పేరుతో ఒక ఆర్గనైజేషన్ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కష్టకాలంలో ఎవరికి సాయం కావాలన్నా అడగాలని, తనకు చేతనైన సాయం చేస్తానని తెలిపింది. ఆర్గనైజేషన్ కోసం తనతో పాటు తన టీం కూడా పని చేస్తుందని నిధి పేర్కొంది.
Read More »నిన్న సూపర్ స్టార్..నేడు పవర్ స్టార్..కీర్తి లక్కీ భామ
వరుస అవకాశాలతో హీరోయిన్ కీర్తి సురేష్ ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో మహేష్ బాబుతో సర్కారు వారి పాట మూవీలో నటిస్తున్న కీర్తికి తాజాగా మరో ఆఫర్ వచ్చిందట. తమిళ స్టార్ హీరో విజయ్ తెలుగులో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తుండగా.. ఈ మూవీలో విజయ్కు జోడీగా కీర్తి నటిస్తుందని సమాచారం. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కే ఈ సినిమాకు వంశీ పైడిపల్లి డైరెక్టర్ కాగా, నిర్మాతగా వ్యవహరిస్తారని …
Read More »మెగా హీరోకే షాకిచ్చిన ఉప్పెన బ్యూటీ
కరోనా కాలంలో విడుదలై సంచలన విజయం సాధించిన ఉప్పెన మూవీతో హీరోయిన్ కృతిశెట్టి కుర్రకారును ఆకట్టుకోన్నది.. ఆ మూవీ విడుదలకు ముందే ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈ మంగళూరు బ్యూటీకి సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో ఛాన్స్ వచ్చిందంట. కార్తీక్ వర్మ డైరెక్షన్లో రానున్న ఈ చిత్రాన్ని BVSN ప్రసాద్ నిర్మించనుండగా.. ఈ ఆఫర్కు కృతి నో చెప్పినట్లు …
Read More »భయమోద్దంటున్న సుమ..ఎందుకంటే…?
బుల్లితెరతో పాటు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్, సరదాగా ఉండే యాంకర్ సుమ.. ఓ వీడియో ద్వారా అందరిలో ధైర్యం నింపే ప్రయత్నం చేసింది. సై సినిమాలో రగ్బీ కోచ్ రాజీవ్ కనకాల చెప్పిన డైలాగ్ను అచ్చు గుద్దినట్లు దించేసిన సుమ.. ‘అందరూ ధైర్యంగా ఉండాలి. ఎప్పుడైతే భయపడతామో అప్పుడే మనలోని ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. భయపడకుండా ఉండాలంటే మంచి విషయాలు వినండి. భయపెట్టే వాటిని చూడకండి’ అని చెప్పింది.
Read More »సరికొత్త పాత్రలో రావు రమేష్
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘RX 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం’. ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్న రావురమేశ్ లుక్ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. చిత్రంలో రావు రమేశ్ గూని బాజ్జీగా నటిస్తున్నట్లు వెల్లడించింది. ఆయన పాత్ర వ్యంగ్యంగా సాగుతూ నెగెటివ్ టచ్ ఉంటుందట. ప్రస్తుతం ఈ ఫోటో సినీ అభిమానులను అలరిస్తోంది.
Read More »తమిళ హీరోయిన్ తో రవితేజ
ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన మూవీ ‘క్రాక్’తో హిట్ అందుకున్న రవితేజ తన తర్వాతి ప్రాజెక్టులపై ప్రస్తుతం దృష్టి పెట్టాడు. ఈ క్రమంలోనే త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఓ మూవీలో నటించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో మలయాళ నటి రాజిషా విజయన్ను హీరోయిన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Read More »సూపర్ స్టార్ కి సోదరిగా మహానటి
దక్షిణ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం కీర్తి సురేష్ క్రేజీ హీరోయిన్గా కొనసాగుతోంది. ఈ కేరళ బ్యూటీకి వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా కీర్తి.. సూపర్ స్టార్ సినిమాలో సోదరి పాత్రకు ఓకే చెప్పిందట. రజినీకాంత్ హీరోగా శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా ‘అన్నాతే’. ఈ సినిమాలో కీర్తి.. రజినీ చెల్లెలిగా కీలక పాత్రలో నటిస్తోంది. ఇటీవల తన షెడ్యూల్ని కూడా పూర్తి చేసుకుంది. మరోవైపు మహేశ్ ‘సర్కారువారి పాట’లో నటిస్తోంది.
Read More »ఆనందయ్య మందుపై జగ్గుభాయ్ సంచలన ట్వీటు
అటు ఏపీ ఇటు తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఆనందయ్య మందుపై సినీ నటులు సైతం స్పందిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు.. తాజాగా నటుడు జగపతిబాబు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘ప్రకృతి మనల్ని కాపాడేందుకు వచ్చినట్లుగా అనిపిస్తోంది. ఆనందయ్య గారి మందు అన్ని అనుమతులను పొంది, ప్రపంచాన్ని కాపాడాలని ప్రార్థిస్తున్నాను. దేవుడు ఆయనను ఆశీర్వదించాలి.’ అని జగ్గుభాయ్ ట్వీట్ చేశాడు.
Read More »సరికొత్త పాత్రలో దీపికా
ప్రముఖ దర్శకనిర్మాత సంజయ్ లీలా భన్సాలీ – హీరోయిన్ దీపికా పదుకొణె కాంబినేషన్లో మరో సినిమా రూపొందనుందని సమాచారం. ఈ చిత్రంలో బందిపోటు రూపమతి పాత్రలో దీపిక నటించనుందని, దీనికి ‘బైజు బావ్రా’ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. 2022 ద్వితీయార్థంలో ఈ సినిమా ట్రాక్ ఎక్కుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కలయికలో ఇప్పటికే 3 సినిమాలు వచ్చాయి.
Read More »