Home / Tag Archives: film nagar (page 91)

Tag Archives: film nagar

కరోనా ఎఫెక్ట్ – మహేష్ బాబు పిలుపు

కరోనా నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హీరో మహేశ్ బాబు సూచించారు. ‘కరోనా తీవ్రమవుతోంది. బయటకు వచ్చేటప్పుడు మాస్క్ ధరించండి. అవసరమైతేనే బయటకు రండి. కరోనా బారినపడితే ఏ లక్షణాలతో బాధపడుతున్నారో చూసుకోండి. వైద్యుల సలహా మేరకు మాత్రమే ఆస్పత్రికి వెళ్లండి. దీంతో అవసరమైన వారికి పడకలు అందుతాయి. ఈ విపత్కర పరిస్థితుల నుంచి మరింత దృఢంగా తయారవుతాం. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండండి’ అని మహేశ్ ట్వీట్ చేశారు.

Read More »

పెళ్ళిపై ఛార్మీ క్లారిటీ

తాను పెళ్ళికి సిద్ధమయ్యాయని వచ్చిన వార్తలను హీరోయిన్, నిర్మాత ఛార్మి ఖండించింది. “ఇప్పుడు నా జీవితంలో మంచి దశలో ఉన్నాను. చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితంలో పెళ్లి చేసుకునే తప్పును నేను ఎప్పటికీ చేయను” అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్తో తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని స్పష్టం చేసింది. ఛార్మి ప్రస్తుతం పూరి కనెక్ట్ సహనిర్మాతగా ఉంటూ ప్రొడక్షన్ బాధ్యతలు చూసుకుంటోంది.

Read More »

సోనూసూద్ కి మద్ధతుగా హీరోయిన్

కరోనా విపత్తు వేళ సాయం చేసేందుకు బాలీవుడ్లో పాటు ఇతర ప్రముఖులు ముందుకు వస్తున్నారు. సేవా కార్యక్రమాల్లో నటుడు సోనూసూద్ అందరికంటే ముందుంటున్నారు. కాగా, యువ నటీమణి, సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్.. సోనూసూద్కు మద్దతుగా నిలిచారు. సోనూసూద్ ఫౌండేషన్కు విరాళమందించారు. ఈ విషయాన్ని సోనూసూద్ ట్విటర్ వేదికగా వెల్లడించి సారాకు ధన్యవాదాలు తెలిపారు.

Read More »

కంగనా రనౌత్ కి కరోనా

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కరోనా బారిన పడింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ‘గత వారం రోజులుగా అలసటగా ఉంది. నిన్న టెస్టు చేయించగా పాజిటివ్ వచ్చింది. క్వారంటైన్లో ఉన్నాను. ఈ వైరస్కు నా శరీరంలో చోటు లేదు. దాన్ని నాశనం చేస్తాను. మీరు దానికి భయపడితే అది మిమ్మల్ని భయపెడుతుంది. హర్ హర్ మహాదేవ్’ అంటూ పేర్కొంది.

Read More »

లేడీ డైరెక్టర్ సుధా కొంగరతో ప్రభాస్ మూవీ

‘ఆకాశమే నీ హద్దురా’ ఫేం లేడీ డైరెక్టర్ సుధా కొంగర… డార్లింగ్ ప్రభాస్ తో ఓ సినిమా చేయనుందని వార్తలు విన్పిస్తున్నాయి. తాజాగా సుధా.. ప్రభాస్కు ఒక సోషల్ డ్రామా కథ చెప్పారట. స్టోరీ లైన్కు ప్రభాస్ ఇంప్రెస్ అయ్యాడు.. బౌండ్ స్క్రిప్ట్ విన్న తరువాత సుధా ప్రాజెక్ట్ పై తుది నిర్ణయం తీసుకుంటాడని తెలుస్తోంది. అయితే, ప్రభాస్ 2023 వరకు ఇప్పటికే ఓకే చెప్పిన పాన్ ఇండియా ప్రాజెక్టులతో …

Read More »

గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. యువరత్ననందమూరి బాలకృష్ణ.. ఇటీవల విడుదలైన ఘన విజయం సాధించిన ‘క్రాక్’ గోపీచంద్ మలినేనితో ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. క్రాక్, వకీల్ సాబ్ చిత్రాల సక్సెస్తో జోష్ మీదున్న అందాల భామ శృతిహాసన్.. బాలయ్యతో జోడీ కట్టనుందట. ఇప్పటికే సలార్ లాంటి భారీ ప్రాజెక్టుతో బిజీగా ఉంది శృతి. బాలయ్య మూవీకి …

Read More »

సరికొత్తగా “యాత్ర” మూవీ దర్శకుడు

అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా డైరెక్టర్ మహి రాఘవ బయోపిక్ తీసిన మూవీ యాత్ర. ఈ సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ప్రస్తుతం మహి ఓ సెటైరికల్ కామెడీ స్కిప్ట్ రెడీ చేస్తున్నాడట. ఈ సినిమాలో ‘జెర్సీ’ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటిస్తోందని టాక్. పలువురు కమెడియన్లను ఈ సినిమా కోసం …

Read More »

కరోనాతో ప్లేబ్యాక్ సింగర్ జి.ఆనంద్ (67) మృతి

టాలీవుడ్ సీనియర్ ప్లేబ్యాక్ సింగర్ జి.ఆనంద్ (67) గతరాత్రి కరోనాతో కన్నుమూశారు. కొంతకాలంగా కరోనాతో బాధపడుతున్న ఆయనను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా తులగాం. స్వరమాధురి సంస్థ స్థాపించి 6,500కు పైగా కచేరీలు చేశారు. ‘ఒక వేణువు వినిపించెను’, ‘దిక్కులు చూడకు రామయ్య’ వంటి పాటలను పాడారు. ‘పండంటి కాపురం’, ‘ప్రాణం ఖరీదు’ తదితర చిత్రాల్లోనూ తన గాత్రంతో అలరించారు.

Read More »

ఆ జాబితాలోకి చేరిన గోవా బ్యూటీ

టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ అని తేడాలేకుండా సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ  తారలంతా OTT బాట పడుతున్నారు. ఈ ప్లాట్ఫాంపై అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు. తాజాగా గోవా బ్యూటి ఇలియానా ఈ జాబితాలోకి చేరింది. అమెజాన్ ప్రైమ్ కోసం ఆమె ఓ టాక్ షో నిర్వహించనుందట.

Read More »

ఆ వ్యాపారంలోని నమిత ఎంట్రీ

టాలీవుడ్ లోకి సొంతం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ నమిత.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. తాజాగా నమిత థియేటర్ పేరుతో OTT వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ‘కొత్త నటీనటులు, దర్శకులతో పాటు ప్రతిభను చూపించే వారికి సహాయం చేయాలని అనుకుంటున్నాను. మా OTT ద్వారా చిన్న సినిమా నిర్మాతలకు సంబంధించి చిత్రాలను విడుదల చేయడానికి సాయం చేస్తాం’ అని నమిత తెలిపింది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat