ఒక్క 10 రోజులు నాయకుడు పర్సనల్ పనుల మీద రాష్ట్రంలో అందుబాటులో లేకపోతే పరిస్థితులు మ్యానేజ్ చేసుకోలేక దిక్కులు చూసే స్థితిలో మన పార్టీ ఉందా.. ఇది సగటు వైసీపీ అభిమాని ప్రశ్న.. తాజాగా జరిగిన ఘటనలపై టీడీపీ పెద్దఎత్తున ఆర్భాటం చేస్తుంటే ఓ ముగ్గురు మంత్రులు తప్ప కనీసం కిమ్మనే నాధుడే లేడు.. మరోవైపు టీడీపీ నేతలు చంద్రబాబును చంపేందుకే డ్రోన్ తిప్పారంటూ అసత్య ప్రచారం చేసారు.. రాజధానిని …
Read More »కాషాయ కండువా కప్పుకున్నా వీళ్లిద్దరు బాబు బంట్రోతులే…!
వాళ్లిద్దరు ఒకప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత ఆప్తులు…టీడీపీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా వాళ్లిద్దరూ ఉండేవారు. ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల ఖర్చు అంతా బడా పారిశ్రామికవేత్తలైన వాళ్లిద్దరే భరించేవారని పార్టీలో టాక్. అయితే బాబుగారికి పరమ విధేయులుగా ఉన్న వాళ్లిద్దరు…ఇటీవల కాషాయ పార్టీలో చేరారు. తమ ఆస్తులు కాపాడుకోవడం కోసం..మనీ లాండరింగ్ కేసుల్లోంచి తప్పించుకోవడం కోసమే వాళ్లిద్దరూ బీజేపీలో చేరినట్లు రాజకీయంగా విమర్శలు వచ్చాయి. అయితే చంద్రబాబే…భవిష్యత్తు అవసరాల దృష్ట్యా …
Read More »కోడెలకు చుక్కలు చూపించిన టీడీపీ నేత…!
టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు రాజకీయంగా విషమ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆయనకు ప్రత్యర్థి పార్టీలే కాదు.. స్వయానా సొంత పార్టీ నేతలే చుక్కలు చూపిస్తున్నారు. మొన్నటికి మొన్న సత్తెనపల్లి ఇన్‌చార్జిగా కోడెలను తొలగించాలంటూ…టీడీపీ అసమ్మతినేతలు చంద్రబాబు ముందు గళం ఎత్తారు. అంతే కాదు సొంత పార్టీ నేతల చేతిలో కోడెల పలు అవమానాలు ఎదుర్కొన్నాడు. తాజాగా అసెంబ్లీ ఫర్నీచర్‌ను హైదరాబాద్ నుంచి అమరావతికి షిఫ్ట్ చేసే …
Read More »బీజేపీ నడ్డా నాటకాలు నడవవు
”తెలంగాణ అడ్డాలో బీజేపీ నడ్డా నాటకాలు నడవవు. ఇతర రాష్ర్టాల్లో వేసిన ఎత్తుగడలు తెలంగాణలో వేస్తే ఊరుకోం. బీజేపీ నేతలు అధికార మత్తులో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. కర్ణాటకలో బీజేపీ చేసిన నాటకాలు ఇక్కడ సాగవు. ఇది కర్ణాటక కాదు.. తెలంగాణ అని బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలి”. అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కూకట్‌పల్లిలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ విస్తృతస్థాయి …
Read More »రికార్డులతో హోరెక్కిస్తున్న విరాట్ కు చుక్కెదురు..ఎందుకంటే !
టీమిండియా కోచ్ కు సంభందించి జరిగిన ఇంటర్వ్యూలో మళ్ళీ రవిశాస్త్రినే పాస్ అయ్యాడు. కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న వారిలో చివరికి ఆరుగురు మిగిలిన విషయం అందరికి తెలిసిందే. వీరికి నిన్న ముంబై లోని బీసీసీఐ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరిగాయి. చివరికి అందరు అనుకున్నట్టుగానే మళ్ళీ రవిశాస్త్రినే కోచ్ గా ఎన్నుకుంది కపిల్ దేవ్ తో కూడిన కమిటీ. దీంతో రవిశాస్త్రి మళ్ళీ ఇండియా కోచ్ గా రీఎంట్రీ ఇచ్చాడు. …
Read More »చంద్రబాబూ.. నువ్వు అప్పుడు సీఎం కదా ఏదైనా చెల్లుతుందనుకున్నావా.? జగన్ ఫైర్
ఇటీవల కూల్చేసిన ప్రజావేదిక నిర్మాణంపై ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో నిప్పులు చెరిగారు. నిబంధనలకు తిలోదకాలిస్తూ ప్రజావేదిక నిర్మించారని విమర్శించారు. అక్రమాలు కట్టడాలు తొలగిస్తే అసెంబ్లీలో చర్చించడం బాధాకరమని, చంద్రబాబు నివాసం చాలా ప్రమాదకర పరిస్థితిలో ఉందని చెప్పుకొచ్చారు. అక్రమ కట్టడాల వల్లే వరదలు వస్తున్నాయని, తాను సీఎం కాబట్టి తనకు చట్టాలు వర్తించవు.. తనను ఏం ఎవరు ఏం చేస్తారంటూ చంద్రబాబు వ్యవహరించారని జగన్ ఆరోపించారు. …
Read More »ఇది ఫిష్ మార్కెట్టా…! టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనం
టీడీపీ సభ్యులపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం శుక్రవారం నాడు అసహనాన్ని వ్యక్తం చేశారు. అధికార పక్ష సభ్యులు మాట్లాడుతున్న సమయంలో విపక్షపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గొడవ చేయడంతో సభలో గందరగోళ వాతావరణం చోటు చేసుకొంది. ఈ సమయంలో స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడారు.శుక్రవారం నాడు వడ్డీ రాయితీ లేని అప్పుల విషయమై అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. ఈ సమయంలో స్పీకర్ తమ్మినేని సీతారాం …
Read More »కాళేశ్వరం కడుతుంటే మీరు గాడిదలు కాసారా.? చంద్రబాబుపై జగన్ ఫైర్
చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణలో కాళేశ్వరం కట్టారన్నారని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు.. ఏపీ అసెంబ్లీలో కరవు, ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలయుద్ధం జరిగింది. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి జగన్ ఎందుకు వెళ్లారని టీడీపీ పదేపదే ప్రశ్నించింది. దీంతో చంద్రబాబుకు జగన్ కౌంటరిస్తూ తాను ముఖ్యమంత్రి అయి కేవలం నెలరోజులే అయిందన్నారు. కానీ అప్పటివరకూ మీరే సీఎంగా ఉన్నారు కదా.. కాళేశ్వరం కట్టేడప్పుడు చంద్రబాబు గాడిదలు …
Read More »ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. పరారీలో మరో ముగ్గురు..!
కేవలం వైసీపీకి మద్దతు తెలిపారన్న కక్షతో అనంతపురం జిల్లా ఈదులపల్లికి చెందిన ప్రతాప్‌రెడ్డికి చెందిన అంబులెన్స్ కు టీడీపీ నేతలు నిప్పుపెట్టారు. పోలింగ్‌కు మూడ్రోజుల ముందు ఎమ్మెల్యే సూర్యనారాయణ కుమారుడు నితిన్ ఈ గ్రామానికి వచ్చి ప్రచారం చేశారు. అయితే పడుకునే సమయంలో మైకుల గోల ఏంటని గ్రామస్తులు ప్రశ్నించడంతో నితిన్ సాయి అనుచరులు గ్రామస్తులపై దాడి చేశారు. పోలీసులు వెంటనే రావడంతో మీ అంతు చూస్తాం అంటూ అక్కడి …
Read More »కామారెడ్డిలో విషాదం
తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని భిక్కనూరు మండలం బస్వాపూర్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహానంపై వస్తున్న ఇద్దర్ని కారు ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది
Read More »