అఖంఢ భారత స్వాతంత్య్ర ఫలాలు ప్రతిఒక్కరికి అందాలని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దేశంలో పేదరికం అంతరించిపోవాలని, ప్రజలంతా సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. వజ్రోత్సవాల సందర్భంగా దేశ, రాష్ట్ర ప్రజలు, రైతులు, మహిళలు, పేదల కోసం మనమందరం పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బాన్సువాడ పట్టణంలో నిర్వహించిన ఫ్రీడమ్ రన్‌లో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
Read More »ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఎం కేసీఆర్ శుభవార్త
గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకొన్నది. గతంలో జరిగిన సమావేశాల్లో భాగంగా శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు నిన్న బుధవారం ఆదేశాలు జారీ అయ్యాయి. ఫీల్డ్ అసిస్టెంట్లు అందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, డీఆర్డీవోలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులిచ్చారు. డీఆర్డీవోల దగ్గర రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. దీంతో 7,651 …
Read More »కాంగ్రెస్ లో కొత్త రగడకు తెరలేపిన మునుగోడు ఉప ఎన్నిక
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించడంతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యం అయింది. అయితే ఈ ఉప ఎన్నిక రాష్ట్ర కాంగ్రెస్‌లో కొత్త రగడకు తెరలేపింది. ఉప ఎన్నికలో …
Read More »మంత్రి జగదీష్ రెడ్డికి సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ‘మీకు హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో నిండు నూరేండ్లు ప్రజలకు సేవలందించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను’ అని సీఎం కేసీఆర్ ప్రత్యేక సందేశాన్ని మంత్రి జగదీష్ రెడ్డికి అందజేశారు.
Read More »విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండబోదు : మంత్రి జగదీశ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తున్నప్పటికీ.. ఎటువంటి పరిస్థితుల్లోనూ విద్యుత్ ప్రసారానికి అంతరాయం ఉండబోదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. వందేండ్లలో ఎన్నడూ పడనంత వర్షపాతం నమోదు అయినప్పటికి కనురెప్ప పాటు అంతరాయం లేకుండా సరఫరా అందించిన ఘనత తెలంగాణా విద్యుత్ సంస్థలకే దక్కిందని ఆయన కొనియాడారు. ఇవే వర్షాలు గతంలో పడ్డప్పుడు విద్యుత్ శాఖా అతలాకుతలం అయిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.రాష్ట్రంలో కుండపోతగా …
Read More »BJP పాలకులు దేశాన్ని ప్రమాదపుటంచున నిలబెట్టారు
డబుల్ ఇంజిన్లతో కేంద్రం ప్రజల మధ్యన వైషమ్యాలు సృష్టిస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రం నవజాత శిశువు లాంటిదని అటువంటి పసిగుడ్డును గొంతు నులిమెందుకు మోడీ సర్కార్ కుట్రలు పన్నుతోందని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ ను కాదని కమలనాధులకు అవకాశం ఇస్తే బిజెపి పాలకులు దేశాన్ని ప్రమాదపుటంచున నిలబెట్టారని ఆయన విమర్శించారు. తెలంగాణా రాష్ట్ర రెడ్కో చైర్మన్ గా నియమితులైన …
Read More »కల్నల్ సంతోష్ బాబు చరిత్రలోనే చిరస్మరణీయుడు
దేశ కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్ బాబుచరిత్రలోనే చిరస్మరణీయుడిగా నిలిచి పోతారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన యుద్ధంలో అసువులు బాసిన మహావీరచక్ర దివంగత కల్నల్ సంతోష్ బాబు రెండో వర్ధంతి సందర్భంగా సంతోష్ బాబు చిత్రపటానికి మంత్రి ఘన నివాలులర్పించారు.కాసరబాద్ రోడ్డులోని స్మృతి వనంలొ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన సంతోష్ బాబు విగ్రహాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు. …
Read More »మామిడిలో నూతన వంగడం – మంత్రి జగదీష్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ
తెలంగాణలో నర్సరీలో వినూత్న ప్రయోగాలు సృష్టిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన సంగారెడ్డికి చెందిన గంగా నర్సరీ మామిడిలో సరికొత్త వంగడాన్ని సృష్టించారు.మామిడి పేరు వినపడగానే నోరూరించే బంగినపల్లి మామిడిని పోలి ఉండే ఈ వంగడానికి గంగా గా నామకరణం చేశారు. ఈ మేరకు హార్టికల్చర్ రంగంలో విశిష్ట గుర్తింపు ఉన్న గంగా నర్సరీ అధినేత ఐ సి మోహన్ ఆ వంగడాన్ని సోమవారం ఉదయం రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి …
Read More »రైతును లక్షాధికారిగా మార్చడమే ప్రభుత్వ సంకల్పం
రైతును లక్షాధికారిగా మార్చడమే ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు శ్రమించేది అందుకోసమే నని ఆయన స్పష్టం చేశారు. వానాకాలం పంటల సాగుపై బుధవారం ఉదయం నల్లగొండ జిల్లా కేంద్రంలోనీ ఓ ప్రవైట్ ఫంక్షన్ హాల్ లో నల్లగొండ, యాదాద్రి జిల్లాలకు చెందిన రైతుల అవగాహన సదస్సుతో పాటు ఈ మధ్యాహ్నం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ …
Read More »కేసీఆర్.. దేశంలోనే నంబర్ వన్ సీఎం
ఎనిమిదేండ్లలోనే అన్ని రంగాల అభివృద్ధితోపాటు వ్యవసాయానికి నిరంతర విద్యుత్తును ఉచితంగా అందిస్తూ.. వినూత్న సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కేసీఆర్ యావత్ దేశంలోనే నంబర్ వన్ సీఎంగా నిలిచారు. వరి దిగుబడిలో తెలంగాణ రాష్ట్రం పంజాబ్‌ను మించిపోయింది. ఆ ఘనత కూడా సీఎం కేసీఆర్‌దే’నని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి.. వర్జినియా రాష్ట్రం ఆల్డి నగరంలో ఏనుగు శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌ఐలు నిర్వహించిన మీట్ …
Read More »