Home / Tag Archives: heavy rains

Tag Archives: heavy rains

గులాబ్‌ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా వర్షాలు

గులాబ్‌ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను వల్ల రాష్ట్రంలో చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వానలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్ర వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తుఫాన్‌ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. కాగా, …

Read More »

కృష్ణా జిల్లాలో భారీ వర్షం.. గాల్లో చక్కర్లు కొడుతున్న విమానం

ఏపీలోని కృష్ణా జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో గన్నవరం విమానాశ్రయం జలమయమైంది. భారీ వర్షానికి విమానాల రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతోంది. సోమవారం ఉదయం వర్షం కారణంగా ఇండిగో విమానం ల్యాండ్‌ అయ్యేందుకు వీలులేక గాల్లో చక్కర్లు కొడుతోంది. బెంగళూరు నుంచి గన్నవరం వచ్చిన ఇండిగో విమానం సుమారు అరగంట నుంచి గాలిలో చక్కర్లు కొడుతూనే ఉంది.

Read More »

భారీ వ‌ర్షాలు..32 గేట్లు ఎత్తివేత

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వ‌ర్షాల కార‌ణంగా నిజామాబాద్ జిల్లాలోని శ్రీ‌రాంసాగ‌ర్ ప్రాజెక్టులోకి వ‌ర‌ద ప్ర‌వాహం కొన‌సాగుతోంది. దీంతో ప్రాజెక్టు 32 గేట్లు ఎత్తి నీటిని దిగువ‌కు విడుద‌ల చేస్తున్నారు. జ‌లాశయంలోకి ఇన్‌ఫ్లో 1.19 ల‌క్ష‌ల క్యూసెక్కులు ఉండ‌గా 1.25 ల‌క్ష‌ల క్యూసెక్కుల‌ను వ‌దులుతున్నారు. క‌నువిందు చేస్తున్న గోదావ‌రి దృశ్యాల‌ను చూసేందుకు భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌లు త‌ర‌లివ‌స్తున్నారు. మ‌హారాష్ట్రంలో కురిసిన భారీ వ‌ర్షాల‌తో లెండి, పూర్ణ‌, మ‌న్నార్‌, ఆస్నా న‌దులు …

Read More »

కేంద్ర వాతావరణశాఖ హెచ్చరిక ..ఏపీతో పాటు 13 రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంతోపాటు 13 రాష్ట్రాల్లో గురువారం భారీ వర్షాలు కురుస్తాయని ఢిల్లీలోని కేంద్ర వాతావరణశాఖ తాజా బులిటిన్‌ లో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంతోపాటు తమిళనాడు, కేరళ, దక్షిణ కర్నాటక, రాజస్థాన్‌, బీహార్‌ రాష్ట్రాల్లో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, తూర్పు ఉత్తరప్రదేశ్‌, ఒడిశా, జార్ఖండ్‌, బీహార్‌, పశ్చిమబెంగాల్‌, అసోం రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతోపాటు …

Read More »

సాగర్ కు కొనసాగుతున్న వరద

తెలంగాణ ,ఏపీ సరిహద్దు ప్రాంతంలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహాం వస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఈ ప్రవాహాం కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. వరదప్రవాహాం ఎక్కువవ్వడంతో ఆరు క్రస్ట్ గేట్లను అధికారులు ఎత్తివేశారు. సాగర్ ఇన్ ఫ్లో 1.50లక్షల క్యూసెక్కులు ఉంది. ఔట్ ఫ్లో మాత్రం అరవై ఐదు వేల క్యూసెక్కులుగా నమోదైంది. దీని పూర్తి స్థాయి నీటి మట్టం 590అడుగులైతే ప్రస్తుతం …

Read More »

మూడు రోజుల్లో రాయలసీమలో భారీ వర్షాలు

వచ్చే మూడు రోజుల్లో రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోంది. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో రేపు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని.. ప్రజలు …

Read More »

నేటి నుంచి తెలంగాణలో భారీ వర్షాలు

ఉత్తర బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడనుందని, ఆ తర్వాత రెండు రోజులకు అది వాయుగుండంగా మారనుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సీనియర్‌ అధికారి రాజారావు తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఆదివారం నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆయన వెల్లడించారు. రుతుపవనాలు మొదలయ్యాక అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్‌ మరింత ఆశాజనకంగా ఉంటుం దని వ్యవసాయ …

Read More »

మూడ్రోజులక్రితం కలతచెందుతూ జగన్ ట్వీట్.. నేడు ఆర్ధిక సాయం.. చంద్రబాబు ఎంతిచ్చారో తెలుసా?

గాడ్స్ ఓన్ కంట్రీగా, ప్రకృతి సోయగాలకు పుట్టినిల్లుగా పేరుగాంచిన కేరళలో ప్రకృతి విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులగా కేరళ జల దిగ్బంధంలో ఉంది. వరద బీభత్సానికి ఇప్పటివరకు 372 మంది చనిపోగా, వందలమందికి గాయాలయ్యాయి.. 3లక్షలమంది నిరాశ్రయులయ్యారు. గడచిన వందేళ్లలో ఈ తరహా వరదలు ముంచెత్తడంతో కేరళ అతలాకుతలమవుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కేరళ వరద బాధితులకు పలువురు సినీ తారలు – సెలబ్రిటీలు – క్రీడాకారులు …

Read More »

వర్షాలు, వరదలతో కేరళ రాష్ట్రం అతలాకుతలం ..!

వర్షాలు, వరదలతో కేరళ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. గత 100 ఏళ్లలో ఎన్నడూ ఎరుగని వరద కేరళను కుదిపేస్తుంది. ఇప్పటివరకూ కేరళలో 385 మంది మృతిచెందగా… 2 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఎక్కడ చూసినా వరదనీరే… ఛిద్రమైన ఇళ్లు కనిపిస్తున్నాయి. వందలాది గ్రామాలు ద్వీపాలుగా మారిపోయాయి. ఎక్కడికక్కడ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు ప్రజలు. తక్షణ సహాయం చేకపోతే ప్రాణనష్టం మరింత పెరిగే ప్రమాదం ఉందని స్థానిక ప్రజాప్రతినిధులు కన్నీళ్లు …

Read More »

రానున్న 48 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు..!!

గత వరం రోజులనుండి రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే రానున్న 48 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.. నైరుతి రుతుపవనాలు.. తెలంగాణ దిశగా ముందుకు సాగుతున్నాయి. రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల్లో మోస్తారు వానలు పడే సూచనలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ స్థాయిలోనూ వర్షాలు కురవనున్నట్లు చెప్పారు.ఐతే రైతన్నలు …

Read More »