Home / Tag Archives: India

Tag Archives: India

అభిషేక్ శర్మ రికార్డు

సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ ప్లేయర్ అభిషేక్ శర్మ విజయ్ హజారే ట్రోఫీలో అదరగొట్టాడు.లిస్ట్-ఏ ఫార్మాట్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మధ్య ప్రదేశ్ తో మ్యాచులో ఈ పంజాబ్ ఆల్ రౌండర్ 42 బంతుల్లోనే సెంచరీ చేశాడు. మొత్తం 8 ఫోర్లు, 9 సిక్సర్లతో 104 రన్స్ చేసి ఔటయ్యాడు గతంలో 40 బంతుల్లోనే సెంచరీ చేసిన యూసుఫ్ పఠాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. …

Read More »

క‌పిల్‌ త‌ర్వాత తొలిపేస‌ర్‌గా ఇషాంత్‌

టీమ్‌ఇండియా తరఫున ఓ పేసర్‌ వంద టెస్టులు ఆడటం అంటే మామూలు విషయం కాదు. అప్పట్లో దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌దేవ్‌ (131) ఈ ఘనత సాధించగా.. ఆ తర్వాత ఎందరో పేసర్లు జట్టులోకి వచ్చినా.. వారెవరూ ఈ మార్క్‌ చేరుకోలేకపోయారు. జహీర్‌ ఖాన్‌ (92) ఆశలు రేపినా సెంచరీ మాత్రం కొట్టలేక పోయాడు. ఆ అవకాశం ఇషాంత్‌ శర్మకు దక్కింది. 2007లో అరంగేట్రం చేసిన ఈ ఆరడుగుల బుల్లెట్‌ తన …

Read More »

భారత జట్టుకు ఎదురుదెబ్బ

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మరికాసేపట్లో చెన్నై వేదికగా తొలి టెస్టు జరుగుతున్న సంగతి విదితమే..అయితే ఈ మ్యాచ్ లో భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ జట్టు నుంచి తప్పుకున్నాడు. నిన్న ప్రాక్టీస్ సమయంలో మోకాలికి గాయమైన నేపథ్యంలో అతడ్ని తొలి టెస్టు నుంచి తప్పిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో అక్షర్ ఉన్నాడు. దీంతో అతడి స్థానంలో జట్టులోకి ఎవరు వస్తారో చూడాలి మరి

Read More »

దేశంలో కొత్తగా 13,203కరోనా కేసులు

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,203 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,06,67,736కి చేరింది. ఇక నిన్న కరోనాతో 131 మంది ప్రాణాలు కోల్పోయారు..  ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 1,53,470కు చేరింది. ప్రస్తుతం 1,84,182 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. ఇప్పటివరకు 1,03,30,084 మంది కోలుకున్నారు.

Read More »

ఇండియాలో సంచలనం

కేవలం 23 రోజుల్లోనే ఓ దోషికి ఉరిశిక్ష వేసిన ఘటన దేశంలో సంచలనం సృష్టిస్తోంది. రెండేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో UP-ఘజియాబాద్ పరిధిలోని పోక్సో కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. స్నేహితుడి కూతురిపై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించడం ఫోరెన్సిక్ నివేదికలో ఆధారాలు లభించడంతో అతడికి మరణశిక్ష విధించింది. గతేడాది డిసెంబర్ 29న ఈ కేసుకు సంబంధించిన చార్జిషీటును పోలీసులు కోర్టులో సమర్పించారు.

Read More »

రెండో టెస్టులో భారత జట్టు 8 వికెట్ల తేడాతో విజయం

మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆసీస్ నిర్దేశించిన 70 పరుగుల లక్ష్యాన్ని.. 15.5 ఓవర్లలోనే టీమిండియా ఛేదించింది. మయాంక్, పుజారా ఫెయిలైనా.. గిల్(35), రహానే(27) రాణించారు మ్యాచ్ నాలుగు రోజుల్లోనే ముగిసింది. ఈ ఫలితంతో టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. మూడో టెస్టు సిడ్నీ లేదా మెల్ బోర్న్ లోనే JAN 7 నుంచి JAN 11 …

Read More »

రెండో టెస్టులో టీమిండియా రికార్డుల మోత

* మెల్ బోర్న్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా బుమ్రా(4 ఇన్నింగ్స్ లో 15 వికెట్లు) ఘనత సాధించాడు * 2018 బాక్సింగ్ డే టెస్టు తర్వాత ఆసీస్ ను రెండోసారి భారత్ ఓడించింది ఆసియా జట్లలో ఆసీస్ ను ఎక్కువసార్లు ఓడించిన టీంగా భారత్ (8) రికార్డు నెలకొల్పింది * ఆస్ట్రేలియాలో టెస్టు విజయం అందించిన కెప్టెన్లలో ఒకడిగా రహానే నిలిచాడు. గతంలో కోహ్లి, …

Read More »

రోహిత్‌శర్మ అరుదైన ఘనతకు మూడేళ్లు!

డిసెంబరు 13, 2017.. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్‌శర్మ జీవితంలో మర్చిపోలేని రోజు. మొహాలీ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ చెలరేగిపోయాడు. అజేయ డబుల్ సెంచరీ (208)తో కదం తొక్కాడు. ఫలితంగా వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ ఘనతకు నేటితో మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ‘స్టార్‌స్పోర్ట్స్’ ట్వీట్ చేయగా, రోహిత్ బదులిస్తూ.. మరిన్ని సెంచరీలు వస్తాయని బదులిచ్చాడు. వన్డే క్రికెట్‌లో మొత్తం …

Read More »

దేశంలో 98 లక్షల కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. చాలా కాలం తర్వాత 30 వేల దిగువకు పడిపోయాయి. గత 24 గంటల్లో కొత్తగా 29,398 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్నటికంటే ఇది 6.7 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 97,96,770కి చేరింది. ఇందులో 92,90,834 మంది బాధితులు కోలుకోగా, కరోనా బారినపడిన పడిన 3,63,749 మంది చికిత్స పొందుతున్నారు. మరో 1,42,186 మంది …

Read More »

దేశంలో మళ్లీ కరోనా కలవరం

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 32,080 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటికంటే  21 శాతం ఎక్కువ అని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్న దేశంలో 26,567 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 97,35,850కి చేరాయి. ఇందులో 3,78,909 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా బారినపడినవారిలో ఇప్పటివరకు 92,15,581 మంది బాధితులు కోలుకున్నారు. ఇందులో గత 24 …

Read More »