తెలంగాణలో అప్పుడే ఎన్నికల హాడావుడి మొదలయింది. నేడో మాపో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించనున్న నేపథ్యంలో ఆశావాహులు ఆధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో బిజీబిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఉప్పల్ నియోజకవర్గం నుండి టికెట్ ఆశిస్తున్న మాజీ మేయర్ బొంతు రామ్మోహాన్ ఎమ్మెల్సీ కవితను కలిశారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో తనకు అవకాశం ఇప్పించేలా కృషి చేయాలని విన్నవించుకున్నారు. చూడాలి మరి రామ్మోహాన్ ఆశలు నిజమవుతాయా.. అడియాశవుతాయా. అని..?
Read More »అమరవీరులను అవమానించే సంస్కృతి మాది కాదు
తెలంగాణ అమరవీరులను అవమానించే సంస్కృతి మాది కాదు.. పూజించే సంస్కృతి మాది అని భారత్ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. అబిడ్స్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో భారత జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ సాహిత్య సభలో కవిత పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ చరిత్రలో ఇవాళ సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు అని కవిత అన్నారు. ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించుకుంటున్నామని …
Read More »ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉగాది శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తెలుగింటి నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా.. ప్రజలంతా ప్రగతిపథంలో ముందుకు సాగాలని కవిత పేర్కొన్నారు. ప్రతి ఇంటా ఆరోగ్యం – ఆనందంతోపాటు సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు అని కవిత తన …
Read More »ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు- కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిన్న సోమవారం జన్మదిన వేడుకలు నిర్వహించుకున్న సంగతి తెల్సిందే. అయితే ఎమ్మెల్సీ కవిత జన్మదినం సందర్భంగా ఆమెను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల రవి ఆధ్వర్యంలో ప్రతినిధులు రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని సైబర్ క్రైమ్ …
Read More »వినూత్నంగా ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) పుట్టినరోజును (Birthday) పురస్కరించుకుని అభిమానులు, బీఆర్‌ఎస్ (BRS) కార్యకర్తలు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్‌కు (Nizamabad) చెందిన బీఆర్ఎస్ నాయకుడు చిన్ను గౌడ్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపి తన అభిమానాన్ని చాటుకున్నారు. అండమాన్ నికోబార్ దీవుల్లో (Andaman Nicobar islands) బంగళాఖాతం (Bay of Bengal) సముద్రపు అంచుల్లోకి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలతో కూడిన బ్యానర్లను ప్రదర్శించారు.నీటి అడుగున …
Read More »ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ -ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత
దేశంలోనే సంచలనం సృష్టించిన దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోనే కాదు యావత్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణకు వస్తున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆమెను ప్రశ్నించబోయే ఈడీ కార్యాలయం వద్ద ఆంక్షలు అమలు చేస్తున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు అక్కడకు చేరుకోకుండా కట్టడి చేసేలా ఇప్పటికే అదనపు …
Read More »ఫిబ్రవరి 25న ముంబై కి ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముంబైలో ఫిబ్రవరి 25న జరగనున్న ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్-2023కు హాజరుకానున్నారు. 2024 ఎన్నికలు – విపక్షాల వ్యూహం అనే అంశంపై ఆమె తన అభిప్రాయాలను వెల్లడించనున్నారు. బీఆర్ఎస్ జాతీయ ఎజెండా, దేశాభివృద్ధిపై సీఎం కేసీఆర్ ఆలోచనలు, రైతుబంధు, దళితబంధు, రైతు బీమా వంటి పథకాల ప్రాధాన్య తలను ఆమె వివరించనున్నారు.
Read More »మహిళలకు ప్రత్యేక పథకాలు పెట్టింది తెలంగాణ ప్రభుత్వమే
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళ సై చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఈ రోజు శనివారం తెలంగాణ శాసనసభ, శాసనమండలిలో చర్చ కొనసాగుతుంది. మండలిలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. మహిళలకు ప్రత్యేక పథకాలు పెట్టింది తెలంగాణ ప్రభుత్వమే అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ది జరుగుతుంటే కాళ్ళలో కట్టెలు పెడుతున్నారు ప్రతిపక్ష నాయకులంటూ మండిపడ్డారు. …
Read More »ఎమ్మెల్సీ కవితతో శరత్ కుమార్ భేటీ
ప్రముఖ నటుడు, ఆల్ ఇండియా సమతావ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్ కుమార్ ఎమ్మెల్సీ కవితతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత దేశ రాజకీయాలు, ఇతర అంశాలపై ఇరువురు చర్చించారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపన ఉద్దేశాలు, లక్ష్యాలు, ఎజెండా వంటి అంశాల గురించి శరత్ కుమార్.. కవితను అడిగి తెలుసుకున్నారు.
Read More »బాబుపై ఎమ్మెల్సీ కవిత ఫైర్
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం వేదికగా ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ రాజకీయాలు తెలంగాణ లో చెల్లవని స్పష్టం చేశారు. చుక్కలు ఎన్ని ఉన్నా చంద్రుడు ఒక్కడే అన్నట్లు తెలంగాణలో కేసీఆర్ ఒక్కడే అని అన్నారు. చంద్రబాబు వచ్చి మళ్లీ ఇక్కడ పార్టీని రివైవ్ చేయాలని అనుకుంటున్నారని …
Read More »