ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సంఘాలకే వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారని కొందరు మహిళలు తన దృష్టికి తెచ్చారని, ఇప్పుడు పట్టణ ప్రాంతంలోని మహిళా సంఘాలకు కూడా ఈ అవకాశాన్ని కల్పించేందుకు నిర్ణయం తీసుకుంటామని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తామని, ప్రతి గ్రామంలో సీసీ ప్లాట్‌ఫాంలు, మినీ గోడౌన్లు నిర్మిస్తామని చెప్పారు. అభయహస్తం పథకంపై ఇటీవలనే రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించిందని, …
Read More »1.20 లక్షల మందితో సీఎం కేసీఆర్ సభ
విప్లవాత్మక దళిత బంధు పథకాన్ని ప్రారంభించేందుకు ఈ నెల 16న హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించనున్న సభను విజయవంతం చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. సభకు 1.20లక్షల మంది హాజరుకానున్నట్టు పేర్కొన్నారు. మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌తో కలిసి సభా ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులతో సమీక్షించారు. దేశ చరిత్రలోనే గొప్ప పథకాన్ని ప్రారంభించేందుకు వస్తున్న సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికేందుకు.. సభను దిగ్విజయం చేసేందుకు …
Read More »కొవిడ్‌ను ఎదుర్కోవడంలో తెలంగాణ ప్రభుత్వం కృషి భేష్
ఆరోగ్య, ఆర్థిక పరిపూర్ణ తెలంగాణే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. కొవిడ్‌ను ఎదుర్కోవడంలో తెలంగాణ ప్రభుత్వం సమర్థంగా పనిచేసిందని, వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను అత్యుత్తమ పద్ధతుల్లో నిర్వహిస్తున్నదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు వివరించారు. రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆమె ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి తెలంగాణ, పుదుచ్చేరి రాష్ర్టాల పరిస్థితులను …
Read More »కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేసిన మంత్రి ఎర్రబెల్లి
రాయపర్తి మండల కేంద్రంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిరుపేదలకు అండగా నిలుస్తున్నాయన్నారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లు భారం కావొద్దనే సీఎం కేసీఆర్ ఈ పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి పథకాలు లేవన్నారు. కార్యక్రమంలో స్థానిక …
Read More »ప్రజలందరూ భక్తి మార్గంలో నడిచినప్పుడే సమాజ శాంతి
ప్రజలందరూ భక్తి మార్గంలో నడిచినప్పుడే సమాజ శాంతికి దోహదపడుతుందని శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి అన్నారు. ఆర్సీపురం డివిజన్ లోని రాయసముద్రం చెరువు కట్టపైన నూతనంగా నిర్మించిన నాగులమ్మ ఆలయంలో నాగులమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి భూపాల్ రెడ్డి సతీసమేతంగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగులమ్మ ఆలయ ఏర్పాటు, విగ్రహ ప్రతిష్ఠాపణతో ఓల్డ్ ఆర్సీపురంలో పండుగ వాతావరణం నెలకొందని …
Read More »సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు
ఈ నెల 16న హుజూరాబాద్‌లో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు ఏర్పాట్లు చకాచకా సాగుతున్నాయి. శాలపల్లి గ్రామంలో జరిగే సభలో దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్ వివరించనున్నారు. ఈ క్రమంలో సభ ఏర్పాట్లను గురువారం రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు.. మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్, పాడి కౌశిక్‌రెడ్డి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు …
Read More »అసాధ్యాలను సుసాధ్యం చేయడం కేసీఆర్ ప్రత్యేకత
స్వయం పాలనా పోరాటంలో యువత పాత్ర గొప్పది అని ముఖ్యమంత్రి అనేకసార్లు చెప్పారు. యూనివర్సిటీ విద్యార్థులను తమ రాజకీయ అవసరాల కోసం వాడుకొని వదిలేసిన చరిత్ర రాష్ట్రంలోని ప్రతిపక్షాలది. కానీ కేసీఆర్ ఆ తొవ్వలో లేరు. 2014 నుంచి చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించే వారిలో సీనియర్లతో పాటు 30+ ఫార్ములాను అమలు చేస్తున్నారు. రాజకీయాలలోకి వచ్చి నిలదొక్కుకోవాలంటే అంతా ఈజీ కాదు. అంగ బలం, అర్ధ బలం ఉన్న …
Read More »కరోనా కట్టడిలో తెలంగాణ ముందు
కరోనా కట్టడిలో తెలంగాణ ముందున్నదని కేంద్ర గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. రాష్ట్రంలోని ఏ ఒక్క జిల్లాలోనూ పాజిటివిటీ రేటు 5 శాతానికి మించలేదని కేంద్రం వెల్లడించింది. దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు 5 నుంచి 15 శాతం ఉన్న జిల్లాలు, కరోనా మరణాల సంఖ్యపై రాజ్యసభ సభ్యుడు వివేక్ కే టంఖా అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. తెలంగాణలో 2019, 2020 సంవత్సరాల్లో 1,541 కరోనా మరణాలు నమోదుకాగా, ఈ ఏడాది జనవరి …
Read More »శాసన సభ్యుడిగా నోముల భగత్ ప్రమాణ స్వీకారం
నాగార్జునసార్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన నోముల భగత్ శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ రూల్స్ బుక్స్, ఐడెంటిటీ కార్డును భగత్ కు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని …
Read More »ఉన్నత విద్యావంతుడు.. ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్
ఉద్యమనేత కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తెలంగాణ పోరాటంలో బాణంలా దూసుకుపోయారు. 2010 హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ప్రజాచైతన్య బస్సుయాత్ర నిర్వహించారు. 2011 మార్చి 1 మౌలాలీ స్టేషన్ అప్పటి ఉద్యమకారుడు, ప్రస్తుత టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి 48 గంటల రైల్‌రోకోలో పాల్గొన్నారు. 2011 మార్చి 10న చరిత్రాత్మక మిలియన్ మార్చ్‌లో భాగస్వామి అయ్యారు. 2011 జులై 21న అమరవీరుడు యాదిరెడ్డి ఆత్మాహుతికి నిరసనగా …
Read More »