దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా రోజువారీ కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. శనివారం కూడా 10వేలకు పైనే కొత్త కేసులు బయటపడ్డాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో 1,58,625 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 10,753 కేసులు బయటపడ్డాయి. మరోవైపు …
Read More »దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్త కేసుల పెరుగుదలకు XBB 1.16 కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కొత్త వేరియంట్ పిల్లలపై ప్రభావం చూపడం ఆందోళన కలిగిస్తోంది. ఈ వేరియంట్ బారిన పడుతున్న వారిలో కొత్త లక్షణాలు గుర్తిస్తున్నట్లు పిల్లల డాక్టర్లు చెబుతున్నారు. అధిక జ్వరం, జలుబు, దగ్గు వంటివాటితో పాటు కళ్లు పుసులు కట్టడం, దురదగా ఉండటం వంటి లక్షణాల గురించి ఫిర్యాదు వస్తున్నట్లు వెల్లడించారు.
Read More »గేదేలు.. ప్లీజ్.. వందే భారత్ రైలు వైపు వెళ్లొద్దు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనపై, వందే భారత్ రైలు ప్రారంభోత్సవంపై వినూత్నంగా నిరసన తెలిపారు టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి. వందే భారత్ రైలు ప్రారంభమయ్యాక ఇప్పటివరకు దాదాపు 68 వరకు ప్రమాదాలు జరిగాయి. గేదెలు, ఆవులను ఢీకొని వందే భారత్ రైలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో సతీష్ రెడ్డి ఓ గేదెలకు విజ్ఞప్తి చేశారు. “మోడీ గారు సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ …
Read More »పార్లమెంటులో ప్రతిపక్షాలు ఆందోళన
బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నిరంకుశ విధానాలను నిరసిస్తూ ప్రతిపక్షాల ఆందోళన గురువారం కూడా కొనసాగింది.అదానీ ఆర్థిక నేరాలపై సమగ్ర విచారణకు గాను సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని (జేపీసీ)వేయాలని, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై వేసిన అనర్హత వేటును వెంటనే ఉపసంహరించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.అదేవిధంగా ప్రతిపక్షాలకు చెందిన ప్రముఖులు, నాయకులపై ఐటీ,ఈడీ, సీబీఐలను ప్రయోగించి వేధింపులకు గురి చేయడాన్ని వెంటనే ఆపేయాలని బీఆర్ఎస్,కాంగ్రెసు, డీఎంకే, టీఎంసీ, ఎండీఎంకే,ఆప్, …
Read More »గుండెపోటు మరణాలపై కేంద్ర ఆరోగ్య శాఖ పరిశీలన
ఇటీవల పలు రాష్ట్రాల్లో యువకులు గుండెపోటుతో మరణించారు. ఈ గుండెపోటులకు కోవిడ్తో ఏదైనా సంబంధం ఉందా అనే విషయాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని మాండవీయ చెప్పారు. గుండె పోటు, కోవిడ్ మధ్య సంబంధాన్ని కనుగొనేందుకు ప్రభుత్వం పరిశోధనలు ప్రారంభించిందని, రెండు మూడు నెలల్లో ఫలితాలు వస్తాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇండియాలో ఉన్న వ్యాక్సిన్లు అన్ని వేరియంట్లకు వ్యతిరేకంగా పనిచేశాయని ఆయన అన్నారు.
Read More »ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు-8మంది అరెస్ట్
గుజరాత్లోని అహ్మదాబాద్ లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ‘మోదీ హటావో, దేష్ బచావో’ పేరుతో నిందితులు ఈ పోస్టర్లు ముద్రించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కాగా, ఇటీవల ఢిల్లీలోనూ ఈ తరహా పోస్టర్స్ గుర్తించిన అధికారులు.. 185 కేసులు నమోదు చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు.
Read More »రాహుల్ గాంధీపై ఈసీ అనర్హత వేటు
వయనాడ్ ఎంపీ ఎన్నికల్లో పోటీచేసి లెక్కలు సమర్పించని అభ్యర్థిపై ఈసీ అనర్హత వేటు వేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై స్వతంత్ర అభ్యర్థి కే.ఇ రాహుల్ గాంధీ పోటీ చేశారు. 2196 ఓట్లు తెచ్చుకున్నారు. అయితే ఎన్నికల ఖర్చుల వివరాలను ఈసీకి సమర్పించకపోవడంతో ఆయనపై అనర్హత వేటు వేసింది. కే.ఇ రాహుల్గాంధీ 2024 సెప్టెంబర్ 13వరకు ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఈసీ తాజాగా ప్రకటించింది.
Read More »ఏప్రిల్ 8న తెలంగాణకు ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఏప్రిల్ ఎనిమిదో తారీఖున తెలంగాణ పర్యటనకు రానున్నరు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రంలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను వచ్చే ఏప్రిల్ 8న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ పనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోదీ రానున్నట్లు వెల్లడించారు. మరోవైపు అదే రోజు సికింద్రాబాద్- తిరుపతి వందేభారత్ రైలును ప్రధాని జెండా ఊపి ప్రారంభించనున్నారని, ఇందుకోసం ఏర్పాట్లు …
Read More »కర్ణాటక ఎన్నికల్లో హిస్టరీ రిపీట్ అవుతుందా..?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో అధికార బీజేపీతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్ లు అధికారం చేపట్టేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. అయితే కన్నడిగుల తీర్పు పరిశీలిస్తే మాత్రం 1985 నుంచి జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి వరుసగా రెండోసారి అధికారం ఇచ్చిన సందర్భం లేదు. గత 38 ఏళ్లుగా అధికారం చేతులు మారుతూ వస్తోంది. దీంతో ఈసారి ఎన్నికల్లో హిస్టరీ రిపీట్ అవుతుందా లేక ఫుల్ స్టాప్ పడుతుందా వేచి …
Read More »కేంద్రంలో వివిధ ప్రభుత్వ శాఖాల్లో ఖాళీగా 9,79,327 పోస్టులు
కేంద్రంలో వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో 2021 మార్చి 1 నాటికి 9,79,327 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ ఎంపీ నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అత్యధికంగా రైల్వేలో 2,93,943.. రక్షణ శాఖలో 2,64,706.. కేంద్ర హోంశాఖలో 1,43,536 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర …
Read More »