Home / NATIONAL / గేదేలు.. ప్లీజ్.. వందే భారత్ రైలు వైపు వెళ్లొద్దు

గేదేలు.. ప్లీజ్.. వందే భారత్ రైలు వైపు వెళ్లొద్దు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనపై, వందే భారత్ రైలు ప్రారంభోత్సవంపై వినూత్నంగా నిరసన తెలిపారు టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి. వందే భారత్ రైలు ప్రారంభమయ్యాక ఇప్పటివరకు దాదాపు 68 వరకు ప్రమాదాలు జరిగాయి. గేదెలు, ఆవులను ఢీకొని వందే భారత్ రైలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో సతీష్ రెడ్డి ఓ గేదెలకు విజ్ఞప్తి చేశారు.

“మోడీ గారు సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభిస్తున్నారు. వందే భారత్ రైళ్లు చాలా వీక్ గా ఉంటాయి. దయచేసి అటువైపు వెళ్ళొద్దు. మీరు పొరపాటున తాకినా రైలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అసలే ఆ రైళ్లు చాలా వీక్ గా ఉంటాయి. దేశంలో బుల్లెట్ రైలు పరుగులు పెట్టిస్తానని చెప్పిన మోడీ వందే భారత్ పేరుతో గేదలు తాకితేనే చిద్రమైపోయే రైళ్లను తీసుకొచ్చారు. అలాంటి రైళ్లతో వాటికే కాదు మీకు ప్రమాదమే. వాటిని ప్రారంభించడం ఎలాగూ మోడీ గారు ఆపే పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి కాబట్టి మీరైనా అటువైపు వెళ్ళకుండా ఉండి మీ ప్రాణాలు కాపాడుకోండి. మీ బంధుమిత్రులకు చెప్పి వందే భారత రైలు ప్రయాణించే ట్రాక్ వైపు వెళ్ళకుండా చూడండి” అంటూ గేదెలకు విజ్ఞప్తి చేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకే వందే భారత్ స్కీంను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నిసార్లు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. ఇప్పటివరకు దాదాపు 17 సార్లు అంటే 17 రైళ్ళను ప్రధానమంత్రి స్వయంగా ప్రారంభించారన్నారు. రైల్వే శాఖ మంత్రి చేయాల్సిన పనిని దేశ ప్రధాని చేయడం సిగ్గుచేటు అన్నారు సతీష్ రెడ్డి. పబ్లిసిటీ పిచ్చితో కేవలం ప్రారంభోత్సవాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. ఆ డబ్బుతో మరేదైనా కొత్త ప్రాజెక్టు కట్టే అవకాశం ఉందన్నారు. అవసరమైతే రైలు కనెక్టివిటీ లేని ప్రాంతానికి కొత్తగా లైన్ వేసే అవకాశం కూడా ఉందన్నారు.
రాష్ట్రానికి పైసా ఇచ్చేది లేకున్నా పైసా పనికొచ్చేది లేకున్నా కేవలం పబ్లిసిటీ కోసమే నరేంద్ర మోడీ రాష్ట్రానికి వస్తున్నారని సతీష్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి వచ్చి ఏదో ఇచ్చినట్టు షో చేసి తమ మీడియాలో పబ్లిసిటీ చేసుకున్నంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. బిజెపి చేస్తున్న అరాచకాలు, దురాగతాలు అన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat