నాగార్జునసాగర్‌లో ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతున్నది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ కుటుంబ సమేతంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. హాలియాలోని ఇబ్రహీంపేటలో ఓటు వేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ రాత్రి 7 గంటల వరకు కొనసాగనుంది. కరోనా బాధితులకు సాయంత్రం 6 గంటల తర్వాత ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో 41 మంది అభ్యర్థులు …
Read More »రైతుల పాదాలు కడుగుతున్నాం : సీఎం కేసీఆర్
గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి.. రైతుల పాదాలను కడుగుతున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియాలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ పార్టీ బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. నాగార్జున సాగర్ ఆయకట్టు కింద అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. కాళేశ్వరంలో రైతులు కేరింతలు కొట్టినట్లే.. సాగర్లో కూడా రైతులు, ప్రజలు కేరింతలు కొట్టాలి. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. తెలంగాణ నాశనమై ఆత్మహత్యల పాలైందంటే …
Read More »లక్ష మందితో సీఎం కేసీఆర్ సభ
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల పదిహేడో తారీఖున జరగనున్న నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఈ నెల 14న సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నెల 14న హాలియాలో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడనుండగా.. లక్ష మందితో సభను నిర్వహించేందుకు TRS శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. కేసీఆర్ సభను సక్సెస్ చేయడం ద్వారా పోలింగ్ నాటికి టీఆర్ఎస్ పై నియోజకవర్గంలో ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతుందని టీఆర్ఎస్ …
Read More »నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరంటే..?
తెలంగాణ రాష్ట్రంలో ఏఫ్రిల్ 17న జరగనున్న నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ తరఫున దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనయుడు నోముల భగత్ పోటీ చేసే అవకాశం ఉంది. ఇతరులూ టికెట్ ఆశించినా.. నేతల అభిప్రాయం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్నరు సీఎం కేసీఆర్… నోముల నర్సింహయ్య వారసుడికే టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై ఇవాళ ప్రకటన చేయనున్నారు.. ఇక బీజేపీ నుంచి …
Read More »నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో వైసీపీ పోటి
తెలంగాణలో ఎన్నికలు జరిగితే కొంతకాలంగా ఏపీ అధికారక వైసీపీ పార్టీ టీఆర్ఎస్ కు మద్దతిస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు నాగార్జున సాగర్ ఉపఎన్నికలో ఆ పార్టీ నుంచి అభ్యర్థి ఒకరు నామినేషన్ వేశారు. అటు తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ షర్మిల పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతుండగా ఇటు జగన్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలవడంతో ఏం జరుగుతుందా? అని అన్ని పార్టీల నేతలు ఆసక్తిగా పరిణామాలను గమనిస్తున్నారు.
Read More »నాగార్జున సాగర్ ఉప ఎన్నిక – కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు
ఏప్రిల్ 17న జరగనున్న నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. ఉప ఎన్నికలో జానారెడ్డిని బరిలో నిలుపుతున్నట్లు మంగళవారం రాత్రి ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. 2018 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జానారెడ్డిపై టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య తిరుగులేని …
Read More »