తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 979 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,48,873 కరోనా కేసులు నమోదయ్యాయి. నగరంలో ఓవైపు కరోనా కేసులు, మరోవైపు ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ.. మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు
Read More »ఒమిక్రాన్ బారినపడి 108 మంది మృతి
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఒమిక్రాన్ బారినపడి 108 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రపంచ దేశాల్లో 4,70,462 ఒమిన్ కేసులు నమోదైనట్లు పేర్కొంది. యూకేలో అత్యధికంగా 2,46,780 ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా, డెన్మార్క్ 57,125, USA 42,539, జర్మనీలో 35,529 చొప్పున కొత్త వేరియంట్ కేసులు నమోదైనట్లు వివరించింది. కాగా దేశంలో ప్రస్తుతం 2,135 ఒమిక్రాన్ కేసులు ఉన్నట్లు తెలిపింది.
Read More »