Home / Tag Archives: Pragathi Bhavan (page 14)

Tag Archives: Pragathi Bhavan

ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, రైతు బంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి,ఎమ్మెల్యే …

Read More »

ప‌ద్మ శ్రీ తిమ్మ‌క్క‌ను ఘ‌నంగా స‌త్క‌రించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్

ప్ర‌ముఖ పర్యావ‌ర‌ణ‌వేత్త,వృక్ష‌మాత‌, ప్ర‌కృతి ప‌రిర‌క్ష‌కులు, ప‌ద్మ శ్రీ తిమ్మ‌క్క‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఘ‌నంగా స‌త్క‌రించి, జ్ఞాపిక‌ను అంద‌జేశారు. క‌ర్ణాట‌క‌కు చెందిన సాలుమ‌ర‌ద తిమ్మ‌క్క‌(110) ఇవాళ బుధవారం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి స‌మీక్షా స‌మావేశానికి తిమ్మ‌క్క‌ను కేసీఆర్ స్వ‌యంగా తీసుకెళ్లారు. ఈ స‌మావేశానికి హాజ‌రైన మంత్రులు, అధికారుల‌కు తిమ్మ‌క్క‌ను కేసీఆర్ ప‌రిచ‌యం చేశారు.

Read More »

నేడు జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌హైలెవల్‌ మీటింగ్‌

తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాలకు జరిగిన పంటనష్టం సహా వివిధ అంశాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్లతో ప్రగతిభవన్‌లో సీఎం హైలెవెల్‌ మీటింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ మేరకు సీఎం కార్యాలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాల్లో జరిగిన పంట నష్టం, దానికి సంబంధించిన ఎస్టిమేషన్లతో రివ్యూ మీటింగ్‌కు రావాలని ఇప్పటికే సీఎంవో నుంచి జిల్లా కలెక్టర్లు ఆదేశాలు వెళ్లాయి. దీంతో పాటు పల్లె, పట్టణ ప్రగతి …

Read More »

సీఎం కేసీఆర్‌ను కలిసిన ఏపీ మంత్రి రోజా

తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఏపీ మంత్రి ఆర్కే రోజా కలిశారు. తన కుటుంబంతో కలిసి ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సీఎం కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నట్లు చెప్పారు. కేసీఆర్‌కు ఆయన ఫొటో ఫ్రేమ్‌ను జ్ఞాపికగా రోజా అందజేశారు. అంతకుముందు రోజాకు సీఎం సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత స్వాగతం పలికారు. భర్త సెల్వమణి, కుమార్తె, కుమారుడితో కలిసి …

Read More »

అంబేద్కర్‌కు నివాళులర్పించిన సీఎం కేసీఆర్‌

రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి వేడుకలను తెలంగాణ సీఎం కేసీఆర్‌ క్యాంపు కార్యాలయం ప్రగతిభవన్‌లో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్‌  చిత్రపటానికి సీఎం ఈ సందర్భంగా పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారత జాతికి అంబేద్కర్‌ అందించిన సేవలను ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, సీఎం కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.

Read More »

యాసంగి ధాన్యం ప్రతి గింజా మేమే కొంటాం: కేసీఆర్‌

ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రానంత మాత్రాన తాము చేతులు ముడుచుకుని కూర్చోబోమని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే యాసంగి ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. కేబినెట్‌ భేటీ ముగిసిన అనంతరం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. యాసంగిలో ప్రతి గింజా తామే కొంటామని చెప్పారు. ఈ మేరకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామన్నారు. క్వింటాల్‌కు మద్దతు ధర రూ.1,960 చొప్పున రాష్ట్ర ప్రభుత్వమే రైతులకు …

Read More »

ప్రగతిభవన్ ను అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రంగా మారుస్తా-రేవంత్

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రగతిభవన్ ను అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రంగా మారుస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీభవన్లో నిరుద్యోగ నిరసన దీక్షలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత తనదని, మరో కొన్ని నెలల్లోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

Read More »

ప్రగతి భవన్‌లో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

ప్రగతి భవన్‌లో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు ఆయన మహనీయుల చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. దేశానికి వారు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

ప్రగతిభవనానికి బయలుదేరిన దళిత బంధువులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న దళితబంధు పథకానికి సంబంధించిన అవగాహన సదస్సు నేడు జరగనుంది. ప్రగతిభవన్‌ వేదికగా జరిగే ఈ సదస్సు కోసం దళితబంధువులు హుజూరాబాద్‌ నుంచి బయలుదేరారు. ఎంపిక చేసిన 427 మందితో 16 బస్సులు హుజూరాబాద్‌ నుంచి పయణమయ్యాయి. ఈ బస్సులకు కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండా శ్రీనివాస్‌ పాల్గొన్నారు. పథకం అమలు, …

Read More »

సీఎం కేసీఆర్ అధ్యక్షతన సీఎం దళిత ఎంపవర్ మెంట్ సమావేశం

తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన కొనసాగుతున్న సీఎం దళిత ఎంపవర్ మెంట్ సమావేశంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, పలు పార్టీల నేతలు.ఎస్సీ అభివృద్ధి, మైనార్టీల సంక్షేమం, వయో వృద్దుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్, మధిర ఎమ్మెల్యే, కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత శ్రీ మల్లు భట్టివిక్రమార్క, మాజీ మంత్రి శ్రీ మోత్కుపల్లి నర్సింహులు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి శ్రీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat