తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కరోనా బారిన పడ్డారు. ఇటీవల ఢిల్లీలో వారం రోజులు పర్యటించి, నిన్న రాత్రి హైదరాబాద్ మహానగరానికి వచ్చిన మంత్రి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రోనా చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.
Read More »తెలంగాణకు మరో ఘనత
దేశంలో గ్రామ పంచాయతీల ఆన్లైన్ ఆడిటింగ్లో తెలంగాణ వరుసగా రెండో ఏడాది నెం.1 స్థానంలో నిలిచింది. ఆన్లైన్ ఆడిటింగ్ను 100శాతం పూర్తి చేసింది. 2020-21 సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై 25శాతం గ్రామాలు తాము చేసిన నిధుల ఖర్చులను ఆన్లైన్లో ఉంచాలని కేంద్రం ఇటీవల ఆదేశించగా.. గడువు కంటే ముందే తెలంగాణ 100% ఆడిటింగ్ పూర్తిచేసింది. ఆ తర్వాత 72%తో తమిళనాడు, 60%తో ఏపీలో 2, 3 …
Read More »జనగామ బహిరంగ సభకు భారీ ఎత్తున జనం తరలి రావాలి..
జనగామ బహిరంగ సభకు భారీ ఎత్తున జనం తరలి వస్తున్నారని, ఆ సభను విజయవంతం చేయడానికి ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు సమన్వయంతో, సమిష్టి గా కృషి చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు. సీఎం గారి బహిరంగ సభ ఏర్పాట్ల సన్నాహక సమావేశాలు జరిగాయి. పాలకుర్తి, కొడకండ్ల మండలాల ముఖ్య …
Read More »CMగా KCR ఉండటం అదృష్టం
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నవంబర్ 29, 2009న కేసీఆర్ చేపట్టిన దీక్ష గుర్తుకు వస్తే ఒళ్లు పులకరిస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అప్పటి ఉద్యమ జ్ఞాపకాలను, అమరుల త్యాగాలను మర్చిపోలేమని చెప్పారు. తెలంగాణను సాధించిన కేసీఆర్.. ఉద్యమ స్ఫూర్తితో బంగారు తెలంగాణగా మారుస్తున్నారని కొనియాడారు. అంత గొప్ప మహా మనిషి మనకు సీఎంగా ఉండటం రాష్ట్ర ప్రజలందరి అదృష్టమని వ్యాఖ్యానించారు.
Read More »చుక్కా రామయ్యకు మంత్రి ఎర్రబెల్లి సన్మానం
ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు, మాజీ శాసనమండలి సభ్యుడు, జనగామ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం గూడూరుకు చెందిన చుక్కా రామయ్యను హైదరాబాద్ లోని విద్యానగర్ లో గల ఆయన నివాసంలో కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. అలాగే ఆయనకు పాదాభివందనం చేసి, శాలువాతో సత్కరించారు. స్వీట్ బాక్స్ ని అందచేశారు.ఈ సందర్భంగా …
Read More »స్వచ్ఛ భారత్ మిషన్‌లో తెలంగాణకు 12 అవార్డులు
స్వచ్ఛ భారత్ మిషన్‌లోని పలు విభాగాల్లో తెలంగాణ దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా నిలవడం, కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో రాష్ట్రాల క్యాటగిరీలో తెలంగాణకు 12 అవార్డులు రావడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ కృషి ఫలితమని మంత్రి అన్నారు. దేశంలోనే వినూత్నంగా కెసిఆర్ …
Read More »ప్రతిపక్షాల మాటలు విని రైతులు ఆగం కావొద్దు: మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నదని, రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. సోమవారం వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండలం తిరుమరాయపల్లి, రాయపర్తి గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు మంత్రి. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా ప్రతిగింజను కొనుగోలు చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం దొడ్డు రకం వరి ధాన్యాన్ని …
Read More »TRS విజయగర్జన సభ కోసం స్థలాన్ని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి, చీఫ్ విప్ దాస్యం.
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి రెండు దశాబ్ధాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, టిఆర్ఎస్ నవంబర్ 15న వరంగల్ లో విజయ గర్జన సభ నిర్వహించనుంది. నగర సమీపంలో భారీ ఎత్తున సభను నిర్వహించి విజయవంతం చేసేందుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా నగరంలో శాయంపేట, భట్టుపల్లి, కరీమాబాద్, తిమ్మాపురం శివార్లలోని ఖాళీ స్థలాలను ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, వరంగల్ మహా నగర మేయర్ గుండు సుధారాణిలతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్, …
Read More »మంత్రి ఎర్రబెల్లిని కలిసిన సిఓలు, డిప్యూటీ సీఇఓలు
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని పలువురు జిల్లా పరిషత్ ల సిఇఓలు, డిప్యూటీ సీఇఓలు హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో సోమవారం కలిశారు. తమకు పదోన్నతులు కల్పించినందులకు మంత్రికి వారు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే విధంగా, ప్రజలకు ప్రభుత్వ పథకాలన్నీ సకాలంలో అందేవిధంగా పని చేయాలని మంత్రి ఈ సందర్భంగా …
Read More »ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో గ్రామాలు అభివృద్ధి
ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. గ్రామాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించారు అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి దయాకర్ రావు సమాధానం ఇచ్చారు.రాష్ట్రంలో 12,769 గ్రామపంచాయతీలకు గానూ ఇప్పటి వరకు 12,672 వైకుంఠధామాలు, 12,737 …
Read More »