MINISTER RAJINI: తెలంగాణలో వైద్య విద్యార్థి ప్రీతి ఆత్మహత్య ఘటన నేపథ్యంలో….ఆంధ్రప్రదేశ్ లో మంత్రి విడదల రజిని అధికారులతో సమీక్ష నిర్వహించారు. ర్యాగింగ్ విషయంలో రాష్ట్రంలో అన్ని కళాశాలల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. వైద్య విద్యార్థి ర్యాగింగ్ ఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో కలవరం సృష్టించింది. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు అప్రమత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి రజిని సమావేశం ఏర్పాటు చేశారు. కళాశాలల్లో యాంటీ …
Read More »ERRABELLI: దేవాదుల కాలువ నిర్మాణంపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష
ERRABELLI: ఖైరతాబాద్ జిల్లా పరిషత్‌లో దేవాదుల కాలువ నిర్మాణంపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో కాలువ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ పాల్గొన్నారు. కాలువ ద్వారా నిర్మితమయ్యే 3 రిజర్వాయర్ల ద్వారా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు సాగునీరు అందుతుందని మంత్రి అన్నారు. నష్కల్ – ఉప్పుగల్ రిజర్వాయర్ కింద బమ్మెర, కొండాపురం, వావిలాల, మల్లంపల్లి, దర్దేపల్లి ముత్తారం, తిరుమలాయపల్లి, కొండూరు, కేశవాపురం, గన్నారం, కొలను పల్లి, కాట్రపల్లి, …
Read More »CM JAGAN: రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్న సీఎం
CM JAGAN: దురుద్దేశంతోనే రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పంచాయతీ, పురపాలక, గిరిజన సంక్షేమశాఖల అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న రోడ్లను పూర్తిగా బాగు చేసి….కొత్త రోడ్లను నాణ్యతతో వేయాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకుని…..అందులో ప్రధానమైన రోడ్లన్నింటినీ పూర్తి చేయాలని సూచించారు. ఖర్చు ఎక్కువైనా నాణ్యత బాగుంటుందని …
Read More »ఆ భూముల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి: జగన్ ఆదేశం
పరిశ్రమల కోసం ప్రభుత్వం కేటాయించిన భూముల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఎంఎస్‌ఎంఈలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని.. సకాలంలో వారికి ప్రోత్సాహకాలు అందేలా చూడాలని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల అభివృద్ధి, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడారు. దేశంలో ఎవరూ చేయని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలకు …
Read More »అమరుల స్మారక చిహ్నంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి: ప్రశాంత్‌రెడ్డి
తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అని.. ఆ నిర్మాణంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ విధించిన గడువులోపు ఆ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద అతిథులు నివాళులర్పించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని.. అమరుల త్యాగాలు …
Read More »నేడు జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌హైలెవల్ మీటింగ్
తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాలకు జరిగిన పంటనష్టం సహా వివిధ అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్లతో ప్రగతిభవన్‌లో సీఎం హైలెవెల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు సీఎం కార్యాలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాల్లో జరిగిన పంట నష్టం, దానికి సంబంధించిన ఎస్టిమేషన్లతో రివ్యూ మీటింగ్‌కు రావాలని ఇప్పటికే సీఎంవో నుంచి జిల్లా కలెక్టర్లు ఆదేశాలు వెళ్లాయి. దీంతో పాటు పల్లె, పట్టణ ప్రగతి …
Read More »రాజకీయ లబ్ధి కోసం యాదాద్రిపై విమర్శలా?: ఇంద్రకరణ్‌రెడ్డి
యాదాద్రిలో సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించాను. భక్తుల సౌకర్యాలపై దేవాదాయ శాఖ, ఆర్‌అండ్‌బీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. క్యూకాంప్లెక్స్‌లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడటం.. వాష్ రూమ్స్‌లో సౌకర్యాలు, చలువ పందిళ్లు తదితర అంశాలపై చర్చించారు. రాజకీయ లబ్ధి కోసం యాదాద్రిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. చిన్నచిన్న సమస్యలను కూడా పెద్దవి చేసి చూపెట్టే ప్రయత్నాలు …
Read More »పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్.. ఏపీ వ్యాప్తంగా బోర్లకు మీటర్లు: జగన్
ఏపీలో వ్యవసాయ మోటార్లు అన్నింటికీ విద్యుత్‌మీటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్టు సక్సెస్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా దీన్ని కొనసాగించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన శాఖలపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా కేంద్రాలు ఎఫ్‌ఏవో ఛాంపియన్ అవార్డుకు ఎంపికైన …
Read More »‘మన ఊరు- మన బడి’ పనులు త్వరగా పూర్తిచేయాలి: మంత్రి సబిత
వేసవి సెలవుల్లో పాఠశాలల పనులను త్వరగా పూర్తిచేయాలని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అధికారులును ఆదేశించారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంపై మంత్రి సబిత అధ్యక్షతన మంత్రుల బృందం సమావేశమైంది. అధికారుతో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లిదయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ‘మన ఊరు-మన బడి’ పురోగతిపై చర్చించారు. మొదటి విడతలో చేపట్టిన పనులను జూన్ 12 నాటికి పూర్తిచేయాలని మంత్రి …
Read More »కల్తీ విత్తన విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోండి: కేసీఆర్
ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసి తీరతామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. వ్యవసాయశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. పంట ఉత్పత్తి తగ్గించే తీరుపై తిరోగమన విధాలను అవలంభిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. కల్తీ విత్తనాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని.. ఏఈవోలకు నిరంతర ట్రైనింగ్ క్లాసులు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. వ్యవసాయ అధికారులు …
Read More »