ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు షాకిచ్చింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరుకు రోడ్లలో సభలు, రోడ్ షోలను నియంత్రించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్-1 ను హైకోర్టు కొట్టేసింది. ఈ జీవో ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని అభిప్రాయపడింది. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే జీవో ఇచ్చారని …
Read More »పొత్తులపై పవన్ కళ్యాణ్ క్లారిటీ
ప్రముఖ స్టార్ హీరో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఏపీలో వచ్చేడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు పక్కా అని తేలిపోయింది. పొత్తులకు ఒప్పుకోని వారు ఎవరైనా ఉంటే వారిని ఒప్పిస్తానని జనసేనాని స్పష్టం చేశారు. ఇదే విషయం ఢిల్లీలో కూడా మాట్లాడానని చెప్పారు. అంటే బీజేపీ కూడా కలిసి రావాలని ఆయన చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఒక వేళ బీజేపీతో కలిసి రాకపోతే పవన్ టీడీపీతోనే …
Read More »1,061 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నియామక ఉత్తర్వులు
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 1,061 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఈ నెల 22న నియామక ఉత్తర్వులు అందజేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రి వర్యులు తన్నీరు హారీష్ రావు వెల్లడించారు. ఇప్పటికే 65 మందికి ప్రొఫెసర్లుగా, 210 మందికి అసోసియేట్ ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు ఇచ్చినట్లు తెలిపారు. గత ఏడాది ఒకేసారి 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించామని.. ఈ ఏడాది మరో 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభమవుతాయని …
Read More »వరంగల్ కు సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరనున్న సీఎం కేసీఆర్.. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనున్నారు. నూతనంగా నిర్మిస్తున్న ఆసుపత్రితో పాటు ఇతర అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. తిరిగి సాయంత్రం హైదరాబాద్ కు చేరుకోనున్నట్లు సమాచారం.
Read More »పదో తరగతి ఫలితాల్లోనూ గురుకుల విద్యాసంస్థలు సత్తా
తెలంగాణలో ఈ రోజు విడుదలైన పదో తరగతి ఫలితాల్లోనూ గురుకుల విద్యాసంస్థల విద్యార్థులు మెరిశారు. టీఎస్ రెసిడెన్షియల్స్ స్కూల్స్ 98.25 శాతం ఉత్తీర్ణత సాధించి మొదటి స్థానంలో నిలవగా, ప్రభుత్వ పాఠశాలల్లో 72.39 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచాయి. పది ఫలితాల్లో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా, 99 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. కాగా ఈ జిల్లాల్లో 59.46 శాతం …
Read More »తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచలన నిర్ణయం
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. డీఎంకే ఫైల్స్ పేరుతో బీజేపీ నేత స్టాలిన్ సర్కార్‌పై ఆరోపణలు చేశారు. బీజేపీ నేత అన్నామలై ఈ అంశంపై పలు మీడియా సమావేశాలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్టాలిన్ ఇవాళ డిఫమేషన్ కేసును ఫైల్ చేశారు. స్టాలిన్ ఫ్యామిలీ అవినీతికి పాల్పడుతున్నట్లు బీజేపీ నేత తన డీఎంకే ఫైల్స్ …
Read More »దళితజనోద్ధరణకు సీఎం కేసీఆర్ కంకణం
తెలంగాణలో దళితజనోద్ధరణకు కంకణం కట్టిన తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును బ్రిటన్ సమాజం వేనోల్లా పొగుడుతున్నది. వివక్షకు గురవుతూ విస్మిరించబడిన ఎస్సీ కులాల సమున్నత అభివృద్ధికోసం సిఎం కేసీఆర్ దార్శనికతతో దేశచరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న పథకాలు కార్యాచరణ దేశంలో ఇప్పటికే వో విప్లవాన్ని సృష్టిస్తున్నాయి. దళితబహుజన సబ్బండ కులాల అభ్యున్నతికోసం సిఎం కేసీఆర్ కార్యాచరణ దేశం నలుదిక్కులనుంచి ప్రశంసలు అందుకుంటున్న …
Read More »మత రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలి
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు బెంగళూరు శాంతినగర్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్‌లోని పోలింగ్ బూత్ వద్దకు వచ్చారు. తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మత రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కర్ణాటక ప్రశాంతంగా ఉండాలంటే అది మనకు చాలా అవసరం అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.కర్ణాటకలోని 224 నియోజకవర్గాలకు …
Read More »కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. కర్ణాటక ప్రజలారా..! ఈ ఎన్నికల్లో ద్వేషాన్ని తిరస్కరించండి..! అభివృద్ధికి ఓటేయండి అని ఆమె పిలుపునిచ్చారు. ప్రజల, సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఓటేయాలని ఆమె తన ట్వీట్‌లో కోరారు. కర్ణాటకలోని 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడుతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. …
Read More »యూకే పర్యటనకు మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ యూకే పర్యటనకు బయల్దేరి వెళ్లారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో కేటీఆర్ యూకే పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆయా దేశాల పారిశ్రామికవేత్తలు, వాణిజ్య సంఘాలతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూలతల గురించి కేటీఆర్ వివరించనున్నారు. ఈ నెల 13వ తేదీ వరకు కేటీఆర్ యూకేలో పర్యటించనున్నారు. గతేడాది మే 18 నుంచి 22 వరకు కేటీఆర్ …
Read More »