ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన పదవీకి రాజీనామా చేయనున్నారు. ఈ క్రమంలో ఈ రోజు గురువారం వెలువడుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ 150 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇక అధికార టీడీపీ పార్టీ కేవలం ఇరవై మూడు స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. దీంతో తన ముఖ్యమంత్రి పదవీకి రాజీనామా చేయడం అనివార్యమైంది. అందులో భాగంగా ఈ రోజు …
Read More »మోదీ హావా..!
ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో అంటే 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అనుకూల పవనాలు ఈ ఈ ఎన్నికల్లో కూడా బలంగా వీస్తున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మొత్తం 342స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తుంది. అయితే 1984లో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత మళ్లీ ఇప్పుడు ఎన్డీఏ ఈ స్థాయిలో ముందంజలో ఉంది. …
Read More »చేతులేత్తిస్తోన్న టీడీపీ మంత్రులు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌లో భాగంగా వైసీపీ ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. టీడీపీకి చెందిన మంత్రులల్లో కొందరు వెనుకంజలో ఉన్నారు. వెనుకంజలో కొనసాగుతున్న వారిలో గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నారాయణ, నక్కా ఆనందబాబు, అచ్చెన్నాయుడు,భూమా అఖిలప్రియ ఉన్నారు. ఇప్పటి వరకూ జరిగిన కౌంటింగ్‌ను బట్టి వైసీపీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది.వైసీపీ 143చోట్ల,టీడీపీ 21చోట్ల అధిక్యంలో ఉంది..
Read More »ముందంజలో “ఆర్కే రోజా”..!
ఏపీలో ఈ రోజు వెలువడుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో నగరిలో వైసీపీ అభ్యర్థి రోజా ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. తొలి రౌండ్‌లో 1221 ఓట్ల ఆధిక్యంలో రోజా ముందంజలో ఉన్నారు. అలాగే జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కూడా వైసీపీ ముందంజలో ఉంది.
Read More »కుప్పంలో బాబు వెనుకంజ
ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుండి బరిలోకి దిగిన సంగతి విధితమే. అయితే ఈ రోజు గురువారం వెలువడుతున్న ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో నారా చంద్రబాబు నాయుడు తన సమీప ప్రత్యర్థి వైసీపీ తరపున బరిలోకి దిగిన అభ్యర్థిపై 357ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల టీడీపీకి చెందిన మంత్రులు,హేమాహేమీలు ఇంతవరకు మెజారిటీ చూపించకపోవడం గమనార్హం..
Read More »వైసీపీ 101 .. టీడీపీ 05
ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ తరపున బరిలోకి దిగిన అభ్యర్థుల హావా కొనసాగుతుంది. ఉదయం మొదలైన కౌంటింగ్ ప్రక్రియలో మొదటి నుండి వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు వైసీపీ 101చోట్ల ఆధిక్యంలో దూసుకుపోతుంది. అధికార పార్టీ టీడీపీ మాత్రం కేవలం ఐదు చోట్ల మాత్రమే ముందంజలో ఉంది..
Read More »“అనంత”లో వైసీపీ ప్రభంజనం
ఏపీలో ఈ రోజు వెలువడుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అనంతపురం జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. సింగనమల నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి ముందంజలో ఉన్నారు. రెండో స్థానంలో టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ ఉన్నారు.గుంతకల్లు పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైసీపీ అభ్యర్థి వై.వెంకట్రామిరెడ్డి ముందంజలో ఉన్నారు. మరోవైపు అనంతపురం …
Read More »సికింద్రాబాద్ నుండి తలసాని సాయి ఆధిక్యం
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా ఈ రోజు జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్లో అధికార పార్టీ టీఆర్ఎస్ తరపున సికింద్రాబాద్ నుండి బరిలోకి దిగిన తలసాని సాయికిరణ్ యాదవ్ ముందంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. తొలి రౌండ్‌లో 1,086 ఓట్ల ఆధిక్యంలో టీఆర్‌ఎస్ ముందంజలో ఉంది. అలాగే ఎంపీ పార్లమెంట్ స్థానాల్లో కూడా టీఆర్ఎస్ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. అయితే 1.అంజన్ కుమార్ యాదవ్ …
Read More »కేంద్రంలో ఆధిక్యంలో”బీజేపీ”..!
ఈ రోజు యావత్తు దేశమంతా ఎన్నో రోజులుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెలువడునున్న రోజు వచ్చింది. ఉదయం దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. అయితే ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మొత్తం 218చోట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కేవలం 98చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఇతరులు ఆరవై ఎనిమిది చోట్ల అధిక్యాన్ని ప్రదర్శిస్తుంది.
Read More »తెలంగాణలో”కారు”ఆధిక్యం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కిం పు ప్రక్రియలో తొలి ఫలితం మహబూబాబాద్ నియోజకవర్గానిదేనని సమాచారం. ఇక్కడ అన్ని నియోజకవర్గాల కంటే తక్కువగా 1,735 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో గరిష్ఠంగా 22 రౌండ్లు కౌంటింగ్ నిర్వహిస్తారు. ఇక అత్యధికంగా 183 మంది పోటీచేసిన నిజామాబాద్ నియోజకవర్గంలో కౌంటింగ్‌లో చాలా ఆలస్యం జరిగే అవకాశముంది. అయితే ఉదయం మొదలైన కౌంటింగ్ ప్రక్రియలో ఇప్పటివరకు అందిన సమాచారం …
Read More »