కరోనా వ్యాక్సినేషన్ రెండో డోసు పంపిణీలో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానం, దక్షిణ భారత దేశంలో ద్వితీయ, జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో నిలువడం గర్వకారణమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ గంగుల కమలాకర్ గారు పేర్కొన్నారు. సీఎం ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందని, ఈ విజయాన్ని కేసీఆర్‌కే అంకితం చేస్తున్నామని ప్రకటించారు. వ్యాక్సినేషన్‌లో జిల్లా సాధించిన విజయానికి గుర్తుగా బుధవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో అధికారులతో కలిసి …
Read More »శ్రీకాంత్ కు కరోనా పాజిటీవ్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో శతాధిక చిత్రాల్లో నటించి మెప్పించిన హీరో శ్రీకాంత్. ప్రస్తుతం కేరక్టర్ ఆర్టిస్ట్‌గానూ, విలన్ గానూ సత్తాచాటుకుంటున్నారు. ఇటీవలే ఓ సీనియర్ హీరో సినిమాలో విలన్‌గా నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆయనకి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. శ్రీకాంత్ తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఈ రోజు (బుధవారం) సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ‘మిత్రులారా.. అవసరమైన జాగ్రత్తలు …
Read More »సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం మూడోసారి ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర మహాసభలో ఆయనను మరోసారి ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. 2014లో రాష్ట్రం విడిపోయిన అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా తొలిసారి ఎన్నికైన వీరభద్రం.. 2018లో రెండో సారి ఆ బాధ్యతలు చేపట్టారు. మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో పార్టీ కేడర్ వీరభద్రంపైనే నమ్మకం ఉంచింది. కాగా, మంగళవారం జరిగిన సభలో …
Read More »తెగ సంబురపడుతున్న సాయిపల్లవి
బక్కపలచు భామ సాయి పల్లవి ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీలోని ‘ప్రణవాలయ’ పాటకు డాన్స్ రిహార్సల్స్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. ‘ఫిదా’ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి మొదటి సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. వరుసగా సినిమాలు చేస్తూ క్రేజీ హీరోయిన్‌గా మారిన ఆమె నానితో రెండవసారి నటించిన ‘శ్యామ్ …
Read More »మెగాస్టార్ చిరంజీవికి కొవిడ్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి కొవిడ్ బారిన పడ్డారు. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. థర్డ్ వేవ్ మొదలైనప్పటికి పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసందే. ఈ క్రమంలోనే తాజాగా చిరంజీవికి కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక ఇటీవల ఆయనను కలిసిన వారందరూ టెస్ట్ చేయించుకోవలసిందిగా …
Read More »బీజేపీ ప్రభుత్వానిది మాటలెక్కువ.. పనితక్కువ
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానిది మాటలెక్కువ.. పనితక్కువ సిద్ధాంతమని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఏడేళ్లలో దేశంలో 153 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలో మాతా శిశు ఆరోగ్య కేంద్రం, (ఎంసీహెచ్), నవజాత శిశు సంరక్షణ కేంద్రాలను ఆయన ప్రారంభించారు. గతంలో ప్రభుత్వాస్పత్రుల్లో 30ు లోపు ఉన్న ప్రసవాల సంఖ్య ఇప్పుడు 52 …
Read More »జమిలీ ఎన్నికల గురించి ప్రధానమంత్రి నరేందర్ మోదీ సంచలన వ్యాఖ్యలు
రిపబ్లిక్ డే రోజు జమిలీ ఎన్నికల గురించి ప్రధానమంత్రి నరేందర్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ జమిలీ ఎన్నికలు దేశానికి అవసరమని మరోమారు ఉద్ఘాటించారు. ‘‘లోక్‌సభ ఎన్నికలే అయినా.. రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినా.. పంచాయతీలు, ఇతర స్థానిక సంస్థల పోల్స్ అయినా.. ఒకేసారి నిర్వహించడం వల్ల అభివృద్ధి జరుగుతుంది. పదేపదే ఎన్నికలు జరగడం అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. జాతీయ ఓటర్ల …
Read More »ఏ సమయంలో నీళ్లు తాగాలో మీకు తెలుసా..?
ఏ సమయంలో నీళ్లు తాగాలి అనే విషయం మీకు తెలుసా.. అయితే ఇప్పుడు తెలుసుకుందాం..? నిద్రకు ముందు నీళ్లు తాగితే రాత్రి మధ్యలో తరుచుగా లేవాల్సి వస్తుంది. అంతేకాక కిడ్నీలు రాత్రులు నిదానంగా పనిచేస్తాయి కాబట్టి శరీరంపై ప్రభావం పడుతుంది వర్కవుట్లు చేస్తూ నీళ్లు తాగకండి. ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది భోజనం చేసే కొద్ది సమయం ముందు నీళ్లు తాగకండి. భోజనానికి ముందు, తర్వాత కనీసం అరగంట …
Read More »అవన్నీ Fake News-దీప్తి సునయన
బిగ్ బాస్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్న యూట్యూబ్ స్టార్ దీప్తి సునయన త్వరలోనే స్క్రీన్ మీద హీరోయిన్ గా మెరవనుందని ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ వార్తలపై దీప్తి స్పందించింది. ఓ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ కోసం ఒక లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ ఆమెను సంప్రదించిందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆమె స్పష్టం చేసింది.కానీ ఆమెకు సినిమా ఆఫర్లు వస్తున్నప్పటికీ దీప్తి ఒప్పుకోవడం లేదని …
Read More »కరోనా పై Good News
దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. అయితే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మాత్రం కరోనా ఉధృతి మాత్రం కాస్త స్వల్పంగా తగ్గింది. గడిచిన 24గంటల్లో కొత్తగా 2,55,874 మందికి కరోనా సోకింది. నిన్నటితో పోల్చితే 50,190 కేసులు తక్కువగా నమోదయ్యాయి. కాగా పాజిటివిటీ రేటు 20.75శాతం నుంచి 15.52శాతానికి తగ్గింది. 614మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 22,36,842 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »