మేడారం మహాజాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ చెప్పారు.వచ్చేనెల 16 నుంచి 19 వరకు జరిగే జాతరలో అమ్మవార్లను దర్శించుకోవటానికి వచ్చే వీఐపీ, వీవీఐపీలకు ఇచ్చే పాస్ (సాట్ల)లలో వారు దర్శించుకొనే తేదీ,సమయం కచ్చితంగా ఉండేలా ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు.తద్వారా సాధారణ భక్తుల దర్శనానికి ఎలాంటి ఇబ్బంది కలుగదని వెల్లడించారు. సమ్మక్క-సారలమ్మలు గద్దెల మీద కొలువైన రోజే సీఎం కేసీఆర్ దర్శించుకొని మొక్కులు చెల్లిస్తారని ఆమె …
Read More »తొలి వన్డేలో 31 పరుగుల తేడాతో భారత్ పరాజయం
మూడు వన్డేల సీరిస్ లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 31 పరుగుల తేడాతో భారత్ పరాజయం పాలైంది. సఫారీ బౌలర్ల దాటికి 265/8 పరుగులకే పరిమితం అయ్యింది. చివర్లో శార్థూల్(50*) పోరాడినా విజయాన్ని అందించలేకపోయాడు. ధావన్ 79, కోహ్లి 51 పరుగులతో రాణించినా మిగతా బ్యాట్స్మెన్ తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో ఓటమి పాలైంది. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, షంసీ, ఫెహ్లుక్వాయో తలో 2వికెట్లు తీయగా, మహరాజ్, మార్క్రమ్ …
Read More »బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఉగ్ర ముప్పు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఉగ్ర ముప్పు ఉందన్న హెచ్చరికలతో.. హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో నాంపల్లి పార్టీ కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. కొత్త వ్యక్తులు కనిపిస్తే అప్రమత్తం చేయాలని కార్యాలయం సిబ్బందికి పోలీసులు సూచించారు. జనవరి 26 వరకు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి సమయంలో గస్తీని ముమ్మరం చేయాలని ఉన్నతాధికారులు పోలీసు సిబ్బందిని ఆదేశించారు
Read More »గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, ఎన్సీపీ పొత్తు
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, ఎన్సీపీ కలిసి పోటీ చేయనున్నాయి. మహారాష్ట్రలో అధికార మహావికాస్ అఘాడీలో భాగమైన ఆ పార్టీలు కాంగ్రెస్ లేకుండానే కూటమిగా ముందుకెళ్తున్నాయి. గెలిచేందుకు అవకాశమున్న సీట్లను తమకు కేటాయించాలని శివసేన కోరగా, కాంగ్రెస్ నిరాకరించినట్లు సమాచారం. తమతో జట్టుకట్టకపోవటం కాంగ్రెస్ దురదృష్టమని, గోవా ఎన్నికల్లో తమ బలాన్ని చూపుతామని శివసేన నేత సంజయ్ వ్యాఖ్యానించారు.
Read More »దూసుకెళ్తున్న రిలయన్స్ జియో
రిలయన్స్ జియో నవంబర్ 20.19 లక్షల మంది యూజర్లను సొంతం చేసుకుంది. దీంతో ఆ కంపెనీ 42.8 కోట్ల మంది వినియోగదారులతో ప్రథమ స్థానంలో నిలిచింది. స్పెక్ట్రం కేటాయింపులకు సంబంధించి రూ. 30,791 కోట్ల బకాయిలను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించింది. ఎయిర్టెల్కు కొత్తగా 13.18 లక్షల మంది చందాదారులు చేరగా, వొడాఫోన్ ఐడియా 18.97 లక్షల మంది యూజర్లను కోల్పోయింది.
Read More »మరో ఘనతను సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ
వన్డేల్లో విదేశాల్లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సచిన్ (5,065) పేరిట ఉన్న రికార్డును దాటేశాడు. ధోనీ (4,520), రాహుల్ ద్రావిడ్ (3,998), సౌరభ్ గంగూలీ(3,468) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Read More »గరిక గడ్డితో లాభాలెన్నో..?
గరిక గడ్డితో ఒక కప్పు కషాయం చేసుకుని రోజూ తాగితే మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి. తీవ్రమైన తలనొప్పి తగ్గిపోతుంది. చర్మంపై ఏర్పడే పొక్కులు, అలర్జీలు, దద్దుర్లు, గాయాల వంటి వాటిపైన గరిక చూర్ణంలో నెయ్యి కలిపి రాస్తే తగ్గిపోతాయి. అరకప్పు నీటిలో ఒక స్పూన్ గరిక పొడి వేసుకుని తాగితే అల్సర్లు తొలగిపోతాయి. గరిక పేస్టును ఒక కప్పు పెరుగులో కలిపి తీసుకుంటే మహిళల్లో వైట్ డిశ్చార్జి సమస్య పరిష్కారమవుతుంది.
Read More »ఏపీ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై సంచలన తీర్పు
ఏపీ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దంపతులు, వారి కుమారుడు కన్నా నాగరాజుపై ఆయన భార్య శ్రీలక్ష్మి వేసిన గృహ హింస కేసు రుజువైంది. దీంతో ఆమెకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని విజయవాడ ఒకటో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశాలిచ్చింది. అలాగే పిటిషనరు, ఆమె కుమార్తెకు ప్రతివాదుల ఇంటిలో నివాస వసతి కల్పించాలని స్పష్టం చేసింది. లేదంటే నెలకు రూ. 50వేలు చెల్లించాలని పేర్కొంది.
Read More »బీజేపీలో చేరిన దివంగత సీడీఎస్ బిపిన్ రావత్ సోదరుడు విజయ్ రావత్
దివంగత సీడీఎస్ బిపిన్ రావత్ సోదరుడు విజయ్ రావత్ బీజేపీలో చేరారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. సైన్యంలో కల్నల్ విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన ఆయన ప్రధాని మోదీ ఆలోచనా విధానం నచ్చే కమలం పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. త్వరలో జరగనున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను బరిలో దింపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
Read More »దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,17,532 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చుకుంటే దాదాపు 30వేల కేసులు పెరిగాయి. ఇక కొత్తగా 491 మంది వైరస్లో మరణించారు. మరోవైపు తాజాగా 2,23,990 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 19,24,051 యాక్టివ్ కేసులున్నాయి. కాగా, దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9,287కు చేరింది.
Read More »