ఐపీఎల్ లో స్పాట్ ఫిక్సింగ్ చేశాడన్న ఆరోపణలతో 9 ఏళ్లపాటు క్రికెట్ కి దూరమైన టీమిండియా పేసర్ శ్రీశాంత్ మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత కేరళ తరపున రంజీ క్రికెట్ ఆడనున్నట్లు ట్వీట్ చేశాడు. వచ్చే రంజీ సీజన్ కోసం కేరళ క్రికెట్ బోర్డు ప్రకటించిన 24 మంది ప్లేయర్ల లిస్టులో శ్రీశాంత్ పేరు కూడా ఉంది. రంజీల్లో చోటు దక్కడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.
Read More »Junior NTR సరసన సమంత
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ త్వరలో హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది రెగ్యులర్ షూటింగ్కు వెళ్లనుంది. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన సమంతను ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది. కొరటాల ‘జనతా గ్యారేజ్ లో సామ్ హీరోయిన్ గా నటించడంతో మరోసారి ఎన్టీఆర్ …
Read More »అల్లు రామలింగయ్య స్వాతంత్ర్య సమరయోధుడు
తన తాతయ్య స్వాతంత్ర్య సమరయోధుడని టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ అన్నాడు. ‘మా అమ్మ వాళ్ల నాన్న అల్లు రామలింగయ్య స్వాతంత్య్ర సమరయోధుడనే విషయం తక్కువమందికే తెలుసు. ఆ రోజుల్లో ఆయన హక్కులపై పోరాటం చేశారు. అందుకు 15 రోజులకుపైగా ఆయన్ని జైలులో పెట్టారు. ఈ విషయం మా కుటుంబసభ్యుల్లో కొద్ది మందికి మాత్రమే తెలుసు’ అని చరణ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ‘RRR’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చరణ్ …
Read More »నటుడు మాణిక్య వినాయగం (73) కన్నుమూత
ప్రముఖ గాయకుడు, నటుడు మాణిక్య వినాయగం (73) కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. అన్ని భాషల్లో కలిపి 800లకు పైగా పాటలు పాడారు. వేల సంఖ్యలో ఆధ్యాత్మిక, జానపదాలను ఆలపించారు. ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ మూవీలోని ‘పట్టుపట్టు చెయ్యే పట్టు’తో టాలీవుడ్ ప్రేక్షకుల్ని విశేషంగా అలరించారు.
Read More »సినిమా టికెట్ల రేట్ల వివాదంపై హీరో నాని సంచలన వ్యాఖ్యలు
ఏపీలో సినిమా టికెట్ల రేట్ల వివాదంపై హీరో నాని మరోసారి స్పందించాడు. ‘వకీల్సాబ్ సినిమా అప్పుడే అందరూ ఏకతాటిపైకి వచ్చుంటే బాగుండేది. ఈ సమస్యే మొదలయ్యేది కాదు. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకమత్యం లేదు. సినిమా టికెట్ల రేట్లపై ఇదివరకు నా అభిప్రాయం మాత్రమే చెప్పాను. దాన్ని చీల్చి పెద్ద ఇష్యూ చేశారు. సమస్య అనేది నిజం. సమస్య వచ్చినప్పుడు అందరూ ఒక్కటి కావాలి’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
Read More »వంగవీటి రాధ హత్యకు రెక్కీ
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశానికి చెందిన నేత వంగవీటి రాధ సంచలన ఆరోపణలు చేశారు. తన హత్యకు కుట్రపన్నారని, రెక్కీ నిర్వహించారని అన్నారు. తనను చంపాలని చూసినా భయపడనని, దేనికైనా సిద్ధం అని స్పష్టం చేశారు. తానెప్పుడూ ప్రజల మధ్యే ఉంటానని, వంగవీటి రంగా ఆశయాల సాధనే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. కృష్ణా జిల్లా చిన్నగొన్నూరులో రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాధ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ …
Read More »ఇంగ్లాండ్ శిబిరంలో కరోనా కలకలం
ఆస్ట్రేలియాలో యాషెస్ సిరీస్ ఆడుతున్న ఇంగ్లాండ్ శిబిరంలో కరోనా కలకలం రేపింది. ఇంగ్లండ్ బృందంలో 4 కరోనా కేసులు వచ్చాయి. సిబ్బంది కాగా.. మరో వీరిలో సహాయక ఇద్దరు ఆటగాళ్ల కుటుంబ సభ్యులని తెలిసింది. ఇక, ఆటగాళ్లలో ఎవరికీ కరోనా పాజిటివ్ రాలేదని తేలిన తర్వాతే.. హోటల్ నుంచి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్కు అనుమతించారు. ఈ నేపథ్యంలో 3వ టెస్టు రెండో రోజు ఆట అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది.
Read More »అక్కడ ఒక్కరోజే లక్ష కరోనా కేసులు
ఫ్రాన్స్ లో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఒకేరోజు ఏకంగా లక్ష కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,04,611 మంది వైరస్ బారిన పడినట్లు ఫ్రాన్స్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ వెల్లడించింది. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఒకే రోజు నమోదైన అత్యధిక కేసులు ఇవే. దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి కూడా ఎక్కువగా ఉందని ఫ్రాన్స్ వైద్యశాఖ ప్రకటించింది. రానున్న రోజుల్లో ఒమిక్రాన్ కేసులు అధికంగా నమోదయ్యే అవకాశం …
Read More »AP లో 82కొత్త కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 82 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా కొవిడ్తో ఒకరు మరణించారు. 164 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య- 20,76,492 మరణాల సంఖ్య- 14,490 మొత్తం కోలుకున్న వారి సంఖ్య- 20,60,836 ప్రస్తుతం యాక్టివ్ కేసులు- 1,166
Read More »TRS Mp రంజిత్ రెడ్డి కి కరోనా
తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి నిన్న కరోనా నిర్ధారణ అయిన సంగతి తెల్సిందే..ప్రస్తుతం ఆయన హోంఐసోలేషన్లో ఉన్నారు.. తాజాగా టీఆర్ఎస్ కి చెందిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కొవిడ్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్లో వెల్లడించారు. అయితే ఇటీవల తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృంద ఢిల్లీకి వెళ్లిన నేపథ్యంలో ఎర్రబెల్లి, రంజిత్ రెడ్డికి పాజిటివ్ రావడంతో అధికార పార్టీ …
Read More »